ఢిల్లీలో ఉద్రిక్తత: మమతా, కేజ్రీవాల్ సహా పలువురు మాజీ సీఎంల అరెస్ట్.!

Publish Date:Oct 10, 2026

Advertisement

జాతీయ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు చేపట్టిన భారీ నిరసన ప్రదర్శన రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఆందోళనల్లో పాల్గొనేందుకు ప్రయత్నించిన ప్రముఖ జాతీయ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పలువురు ఎంపీలు, సీనియర్ రాజకీయ నేతలను కూడా అధికారులు నిర్బంధించి ప్రత్యేక డిటెన్షన్ సెంటర్లకు తరలించారు.

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, ఓటర్ల జాబితా సవరణల్లో అవకతవకలు జరుగుతున్నాయని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఈ విషయమై ఎన్నికల కమిషన్ జవాబుదారీగా ఉండాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ పరిసరాల్లో నిరసనకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖ విపక్ష నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. సౌత్ అవెన్యూ ప్రాంతంలో నిరసన తెలుపుతున్న మమతా బెనర్జీని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదనే కారణంతో ఆమెను సమీపంలోని బస్టాండ్‌లో బైఠాయించి నిరసన తెలిపేందుకు యత్నించగా, ఆమెతో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, తన నివాసం నుంచి బయలుదేరిన అరవింద్ కేజ్రీవాల్‌ను మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకుని నిర్బంధించారు.

ఇదే నిరసనలో పాలుపంచుకునేందుకు వచ్చిన కేరళ మాజీ సీఎం పినరయి విజయన్, సీపీఎం ఎంపీలను సైతం పోలీసులు విడిచిపెట్టలేదు. నగరంలో ఎలాంటి ఆందోళనలకు ముందస్తు అనుమతి లేదని, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ చర్యలు తీసుకున్నామని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నగర వ్యాప్తంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి, అడుగడుగునా ఆంక్షలు విధించారు. ప్రభుత్వ తీరుపై విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని, ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పోలీసు యంత్రం ద్వారా గొంతును నొక్కాలని చూస్తోందని దుయ్యబట్టారు. ఈ అరెస్టుల పర్వం దేశ రాజకీయాల్లో మరింత దుమారం రేపే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఎన్నికల కమిషన్ తీరుపై విపక్షాలు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతామని రాజకీయ వర్గాల నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి.

 

 

 

[ CJP, Abhijit Deepke, Delhi Police, Cockroach Janata Party protest, Mamata Banerjee, Arvind Kejriwal, Pinarayi Vijayan, Election Commission Protest, Mamata Banerjee, Arvind Kejriwal, Pinarayi Vijayan, Delhi Police Protest, Election Commission of India, Gyanesh Kumar ]

By
en-us Political News

  
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యున్నత గౌరవం దక్కింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరో వాతావరణ గండం ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రకృతిని ఎదిరించి జీవించడం ఎవరికీ సాధ్యం కాదని, దానితో ఘర్షణకు దిగితే మానవాళి తీవ్ర విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హితవు పలికారు.
DRDO ఉద్యోగి ఎదురింట్లో ఉన్న ఓ యువతిపై మనసు పడ్డాడు.. అవకా శం కోసం ఎదురుచూశాడు యువతి ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి ఇంట్లోకి చొరబడ్డాడు.
ఆకలి వేస్తే అన్నం పెట్టే విశాల హృదయం మనది.. దాహమేస్తే గుక్కెడు మంచినీళ్లు ఇవ్వడం మన సంస్కృతి.
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
భారత దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలను రచిస్తున్నాయి.
న్నబిడ్డలకు కడుపునిండా అన్నం పెట్టలేని నిస్సహాయత.. కనీస అవసరాలు తీర్చలేని దుర్భర పరిస్థితి.
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సైబర్ భద్రతా రంగంలో తీవ్ర కలకలం రేపిన ఒక పెద్ద ఉదంతాన్ని ఎదుర్కొంది.
24 ఏళ్లకే అద్భుత ఆవిష్కరణ.. డేటా స్టోరేజ్‌ రంగంలో యువతి సంచలనం.!
ఉద్యోగ వేటలో విజయం సాధించి తొలిసారి కొలువులో అడుగుపెట్టే యువతకు కేంద్ర ప్రభుత్వం నుంచి అండగా నిలిచేలా సరికొత్త వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.