Publish Date:Aug 13, 2022
బాల్యంలోనే విడిపోయి పెద్దయిన తర్వాత కలుసుకునే అన్నాచెల్లెళ్లను సినిమాలు బాగా చూపించి ఇలానూ జరుగుతుందా అని పించారు ప్రేక్షకు లచేత. కొన్ని ఊహించని సంఘటనలు అలానే జరుగుతాయన్నది ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి. తప్పిపోయిన పిల్లలు కలవడం ఈమధ్యకాలంలో ఉత్తరప్రదేశ్‌లోనూ జరిగింది. తనకు ఒక అన్న ఉన్నాడని తెలిసి అతన్ని కలవడాని కి ఏకంగా పదేళ్లపాటు తెలిసిన అన్ని ప్రాంతాలు, ఆస్పత్రులూ తిరిగిండి క్రిస్టినా సాడ్‌బెరీ. ఆస్టిన్ టెక్సాస్‌లో కుక్ హాస్పిటల్ అని పిల్లల ఆస్పత్రి ఉంది. అక్కడకి ఏడేళ్లుగా రోజూ వెళ్లి అన్ని వార్డులు తరచి చూసేది. ఆమెను ఎవ్వరూ అడ్డుకునే వారు కాదు. కారణం ఆమె అక్కడే పుట్టింది. మూడేళ్ల వయసులో క్రిస్టినా తన అసలు కుటుంబానికీ దూరమయింది. అన్నా.. నువ్వులేని నా బతుకు భారం.. అంటూ వీధుల పడి సినిమాటిక్‌గా ఏడవలేదు. ఎలాగైనా కలివాలని, ఎందుకు విడిపోయిందీ తెలుసుకోవాల న్నది ఆమె పట్టుదల.
చిత్రమేమంటే క్రిస్టినా సోదరుడు రేమండ్ టర్నర్ కూడా ఇలానే అదే ఆస్పత్రిలో తిరగడం! అపరిచితుల్లా ఇద్దరూ అక్కడే తిరిగా రు. 2006 నుంచి తన అసలు కుటుంబం గురించి తిరుగుతూంటే ఆమెకు తన తల్లి కలిసిందికాని తండ్రి , సోదరుడూ ఎవరన్నది ఇంకా తెలియలేదు. చివరికి 2014లో డిఎన్ ఏ పరీక్షా కేంద్రానికి వెళ్లి కాస్తంత అనుమానంగా అనిపించిన 24 మంది తో తనను పోల్చి రిపోర్టు ఇమ్మన్నది. కానీ వారిలో సగం మంది దూరపు బంధువులే తప్ప సొంత సోదరుడు లేదని తేలింది. ఇక ఇక్కడితో అంతా అయిపోయింది. తిరగడం వేస్ట్ అనే అనుకుంది.
ఇలా ఉండగా, రేమాండ్ భార్య మరియా అతని చేత డి ఎన్ ఏ వంటి పరీక్ష చేయించింది. వాస్తవానికి హామ్‌స్టడ్‌లో అతను తన తండ్రితో ఉంటున్నాడు. ఆయన వివాహం చేసుకోలేదు. రేమాండ్, తన తమ్ముడూ ఇద్దరూ అమ్మమ్మగారింట పెరిగారు. కానీ అతనికి ఒక సోదరి ఉందన్న సంగతి తెలియదు. అయితే తాను చేయించుకున్న పరీక్షల వల్ల తాను ఆఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చిన కుటుంబానికి చెందినవాడని తేలింది. దీన్ని ఆధారం చేసుకుని తన సోదరి గురించి తానూ వెతకడం ఆరంభించాడు. కొద్ది నెలల తర్వాత క్రిస్టినా అనే ఆమె కూడా ఇదే లక్ష్యంతో తిరుగుతోందని తెలుసుకున్నాడు. ఆమె గురించి తెలుసుకోవ డం లో అతనికి వారి తండ్రి ఒక్కడే అన్నది తెలిసి ఎంతో ఆశర్యపోయాడు. కాగా 42 ఏళ్ల క్రిస్టినా తన 11 ఏళ్ల కుమారుడు బ్రైసన్‌కు నరాల వ్యాధి చికిత్సకు ఆస్పత్రి చుట్టూ చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో రేమాండ్‌ని చాలాసార్లు చూసింది. అతనూ చూశాడు. కానీ ఆస్పత్రికి వచ్చిన వారిని చూసినట్టుగానే ఇద్దరూ భావించుకున్నారే గాని హలో అనుకోలేదు. చిత్రంగా ఇదంతా ఏకంగా ఏడేళ్లు సాగింది.
కానీ ఒకరోజు రోడ్డు దాటి ఆస్పత్రికి వెళుతూంటే రేమాండ్ అక్కడి కూడలిలో గిటార్ పట్టి పాత పాట పాడుతున్నాడు. అది విని క్రిస్టినా అలా నిలుచుండిపోయింది. అంతే వేగంగా అతని దగ్గరికి వెళ్లి, ఈ పాట నీకెలా తెలుసు అది మా నాన్నగారు పాడేవారట మా అమ్మమ్మ చెప్పేది అన్నది. అప్పటికి రేమాండ్ కి అర్ధమయింది .. ఇన్నాళ్లూ చూస్తున్న ఈ క్రిస్టినాయే తన సోదరి అని. ఇద్దరు తమని తాము గుర్తించుకున్నారు..కనీళ్ల పర్యంతమయ్యారు..అన్నాచెల్లెళ్ల బంధాన్ని వ్యక్తం చేసుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cinematic-turns-in-sister-25-141868.html
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.