ఆ స్టోరీ చ‌దివితే చ‌లించిపోవాల్సిందే.. మాజీప్ర‌ధాని జీవితంలో సినిమాటిక్ సీన్స్‌..

Publish Date:Feb 10, 2022

Advertisement

సీన్ 1: ఆయన ఓ వృద్ధుడు. వయసు 94 ఏళ్లు. ఉండేది అద్దె ఇంటిలో. ఆ ఉండే ఇంటి అద్దె కూడా కట్టలేని దుస్థితి. ఇంటి యజమాని ఆ వృద్ధుడి సామాన్లు బయట పడేశారు. సామాను అంటే.. మంచాలు, పరుపులు, కుర్చీలు, సోఫాలు కాదు. ఓ పాత మంచం, నాలుగు సత్తు గిన్నెలు, ఒక ప్లాస్టిక్ బకెట్, ఓ మగ్గు అంతే. అదే ఆయన ఆస్తి. ఆ వృద్ధుడు ఇంటి యజమానిని వేడుకుంటున్నారు. కొద్దిగా టైమ్ ఇస్తే అద్దె చెల్లిస్తానని.. అంతవరకూ ఇంట్లో ఉండనీయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇరుగు పొరుగు వారు కూడా ఆ పెద్దాయ‌న‌ దయనీయ పరిస్థితి చూసి జాలిచూపుతున్నారు. ఇంటి యజమానిని గడువు ఇచ్చేందుకు ఒప్పించే ప్రయత్నం చేశారు. చివరకు ఆ ఓన‌ర్ అయిష్టంగానే ఇదే ఆఖరి ఛాన్స్ అంటూ కొంత టైం ఇచ్చి వెళ్లిపోయాడు. ఆ త‌ర్వాత ఆ వృద్దుడు యజమాని వీధిలోకి విసిరేసిన సామాను లోపలికి తీసుకు పోయారు.  ఇదీ అక్క‌డ జ‌రిగిన సీన్‌. ఇలాంటి సంఘ‌ట‌న‌లు చాలానే జ‌రుగుతుంటాయి. అలాంటివి వింటుంటాం. చూస్తుంటాం. కానీ, ఈ ఘ‌ట‌న‌లోని వృద్ధుడు ఎవరో తెలిస్తే.. ఆశ్చర్య పోవడం ఖాయం. అవునా, ఆయ‌నా? అంటూ నోరెళ్ల‌బెట్ట‌డం ప‌క్కా. ఎందుకంటే.. ఇంత‌కీ ఆ పెద్దాయ‌న ఎవ‌రంటే.....

సీన్ 2: ఆ దారిన వెళుతున్న జర్నలిస్ట్ ఒకరు... ఈ మొత్తం వ్యవహారం చూశారు. ఆ ఘ‌ట‌న‌ను ఫోటోల్లో బంధించాడు. మంచి మసాలా కథ దొరికిందని తెగ ఖుషీ అయ్యాడు. “అద్దె ఇంటి నుంచి వృద్ధుడిని గెంటేసిన ఓన‌ర్‌” అనే టైటిల్ పెట్టాల‌ని మ‌నుసులో అనుకుంటూ త‌ను ప‌నిచేసే ప‌త్రికా కార్యాల‌యం చేరుకున్నాడు. పత్రిక యజమానికి జరిగిన కథ చెప్పారు. ఫోటోలు ఆయన ముందుంచారు. ఆ ఫోటోలు చూస్తూనే.. ఆ పేప‌ర్ ఓన‌ర్‌ షాక్ అయ్యారు. అయ్యో.. ఈయ‌నా.. ఆ ‘వృద్దుడు’ ఎవరో తెలుసా నీకు అని.. జర్నలిస్ట్’ను అడిగారు. జర్నలిస్టు తెల్లముఖం వేశాడు. తెలియదన్నాడు. ఇంత‌కీ ఎవ‌రు సార్ అత‌ను అని క్యూరియాసిటీతో ప్ర‌శ్నించాడు... ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రంటే...

సీన్ 3: ఆ మర్నాడు.. పత్రిక మొదటి పేజీలో సెన్షేష‌న‌ల్ స్టోరీ ప్ర‌చురిత‌మైంది. ‘మాజీ ప్రధాని గుల్జారీ లాల్ నందా దుర్భ‌ర జీవితం గడుపుతున్నారు’ అనే హెడ్‌లైన్‌తో ఆ ‘వృద్ధుని’ కథ పతాక శీర్షికలో వచ్చింది. ఆ వార్తలో భార‌త‌ మాజీ ప్రధాని గుల్జారీ లాల్‌ నందా ఎంతటి దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారో విపులంగా వివరించారు. అద్దె ఇంటి నుంచి గెంటి వేసిన వైనాన్ని ఫొటోలతో సహా ప్రచురించారు. అదే క్రమంలో చోటా మోటా రాజకీయ నాయకుల స్థితిగతులతో... రెండుసార్లు దేశ ప్రధానిగా, ఎన్నో ఏళ్ళు కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నందాజీ జీవన స్థితిగతులను పోలుస్తూ, మాజీ ప్రధానికి సొంత ఇల్లులేని వైనాన్ని విశ్లేషించారు. 

నిజానికి, గుల్జారీ లాల్ నందా స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చే 500ల పెన్ష‌న్‌కు అర్హులు. అయితే, ఆయన స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చే పెన్షన్ కోసం.. తాను పోరాటం చేయలేదని.. తనకు ఆ పెన్షన్ అవసరం లేదని తిరస్కరించారు. ఆయనకు వేరే ఆదాయమార్గం లేక పోవడంతో.. మిత్రుల వత్తిడి మేరకు ఆ పెన్షన్ తీసుకునేందుకు అంగీకరించారు. ఆ పెన్షన్ సొమ్ముతోనే ఆయన శేష జీవితం గడిపారు.
  
సీన్ 4: “మాజీ ప్రధాని గుల్జారీ లాల్ నందా దుర్భ‌ర జీవితం గడుపుతున్నారు’ అనే హెడ్‌లైన్‌తో వ‌చ్చిన వృద్ధుని క‌థ చూసిన వెంట‌నే.. అప్పటి ప్రధాని.. మంత్రులు, అధికారులను నందా ఉంటున్న‌ అద్దె ఇంటికి పంపారు. వరసగా కార్లు వచ్చి ఆయన ఇంటి ముందు ఆగాయి. అంతా ఆశ్చర్య పోయారు. ఇంటి యజమాని అయితే, బారులు  తీరిన వీఐపీ వాహనాలను చూసి.. తమ ఇంట్లో అద్దెకు ఉన్నది మాజీ ప్రధాని నందా అని తెలిసి.. అవాక్క‌య్యారు. ఆ వెంటనే ఆయన తెలియక చేసిన తప్పున‌కు క్షమించమని నందాను వేడుకున్నారు. ఆయన ఓ నవ్వు నవ్వి ఊరుకున్నారు. 
  
ఇక ప్రధాని ఆదేశాల మేరకు వచ్చిన మంత్రులు, అధికారులు నందాను అధికార నివాసానికి మారాలని కోరారు. కానీ, నందా.. ఈ వయసులో ఆ సదుపాయాలు తనకు అవసరం లేదని సున్నితంగా తిరస్కరించారు. తుది శ్వాస విడిచే వరకూ నందా సామాన్య జీవితమే గడిపారు. 1997లో భారత ప్రభుత్వం ఆయన్ని భారతరత్నతో గౌరవించుకుంది. అవీ అప్పటి రాజకీయ నాయకుల విలువలు.. మరి ఇప్పుడో..??

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచడం వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు చేపట్టిన నషా ముక్త్ భారత్ యాత్రకు ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
తమిళనాడులో సంచలనం సృష్టించిన మహిళా ఐఏఎస్ అధికారిణి వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
మదురై సమీపంలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభం వద్ద శనివారం దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.