రజనీకాంత్ పై వైసీపీ దూషణలపై కిమ్మనని సినీ పరిశ్రమ

Publish Date:May 3, 2023

Advertisement

సినీ పరిశ్రమలో మంచి మనిషిగా, వివాదరహితుడిగా పేరొందిన రజనీకాంత్  ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా ఓ కార్యక్రమంలో మాజీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిని ప్రశంసించడంపై వైసీపీ నేతలు ఇష్టారీతిగా నోరు పారేసుకోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అన్ని వర్గాల నుంచీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తెలుగు సినీ పరిశ్రమ మాత్రం ఆశ్చర్యకరంగా మౌనం దాల్చింది. ఏపీలో జగన్ పాలనలో  తన మనసులోని మాటను బయటకు  చెప్పుకుంటే కూడా సహించలేని వాతావరణం ఉందనడానికి చంద్రబాబు గురించి రెండు మంచి మాటలు చెప్పిన రజనీకాంత్ పై వైసీపీ నేతలు నోరుపారేసుకుంటున్న తీరే నిదర్శనమని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. వైసీపీ నేతల తిట్ల వర్షం రజనీకాంత్ చంద్రబాబును పొగిడినందుకు కాదనీ, తమ అధినేత దృష్టిలో పడటానికేనని కూడా కొందరు అంటున్నారు. అది పక్కన పెడితే.. రజనీకాంత్ పై వైసీపీ నేతలు విమర్శలతో సరిపుచ్చలేదు. ఆయన వ్యక్తిత్వ హననానికీ, ఆయనపై తిట్ల వర్షానికీ కూడా తెగబడుతున్నారు.

తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి జగపతి బాబు మినహా ఒక్కడంటే ఒక్కడు.. ఆయనతో స్నేహం ఉన్నవారు, కలిసి నటించిన వారు ఎవరూ కూడా రజనీకాంత్ పై వైసీపీ నేతల తిట్ల పురాణాన్ని ఖండించిన పాపాన పోలేదు. మేమంతా  ఒకటే మాది కళాకారుల కుటుంబం.. మాలో మాకు లక్ష విభేదాలున్నా.. మాజోలికి ఎవరైనా వస్తే మేమందరం ఒక్కటే అంటూ డైలాగులు చెప్పే హీరోలు ఇప్పుడు రజనీకాంత్ పై బూతుల పంచాగం విప్పిన వైసీపీ నేతల వ్యాఖ్యలను, విమర్శలను ఖండిస్తూ ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యం. అన్నిటికీ మంచి రజనీకాంత్ తన ప్రాణ మిత్రుడంటూ వేదికలపై సైతం వాడు వీడు అంటూ తన చనువును ప్రదర్శించే మోహన్ బాబు సైతం.. తన ప్రాణ మిత్రుడిని సొంత పార్టీ నేతలే ఇష్టారీతిన నోరు పారేసుకుంటుంటే కిమ్మనకపోవడం ఆశ్చర్యకరం. ఆయన తరచూ చెప్పుకునేలా ఆయన ముక్కుసూటి తనం కేవలం మాటలకే పరిమితమా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  

అలీ, పోసాని, రోజా వంటి నటులు మాట్లాడలేదంటే అర్ధం చేసుకోవచ్చు. రోజాకు ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గపునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఆమె జీవితాశయమైన మంత్రి పదవిని కట్టబెట్టారు. ఇక అలీ, పోసానిలకు అయితే మూడున్నరేళ్లు వెయిటింగ్ లో పెట్టినా ఏదో ఒక పదవి ఇచ్చారు. మరి అటువంటి వాళ్లు రజనీపై తమ పార్టీ నేతల దూషణలను ఎలా ఖండించగలరు? మంత్రి రోజా అయితే ఒక అడుగు ముందుకు వేసి తమ పార్టీ నేతలతో కలిసి రజనీకాంత్ పై విమర్శలు  గుప్పించారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో పార్టీలతో సంబంధం లేని సినీ పరిశ్రమ ప్రముఖులు కూడా రజనీకాంత్ కు మద్దతుగా నిలవకపోవడాన్ని అందరూ ఎత్తి చూపుతున్నారు.

రజనీకి మద్దతుగా నోరెత్తితే.. జగన్మాయ తమ కెరీర్ పై ప్రభావం చూపుతుందన్న భయమే కారణమా అంటున్నారు. ఇక అన్నిటికీ మించి రజనీకాంత్ ను సొంత పార్టీ నేతలు దుర్బాషలాడుతుంటే కనీసం వారించడానికి కూడా మోహన్ బాబుకు నోరు రాకపోవడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

By
en-us Political News

  
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.