రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒకే రోజు ఇద్దరు సినీ క్రీడా సెలబ్రిటీలను కలిశారు. వారిలో ఒకరు 1983 వరల్డ్ కప్ విజేత లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కాగా. మరొకరు నటుడు, నిర్మాత అజయ్ దేవ్ గన్. ఈ మధ్య పదే పదే రేవంత్ 140 కోట్ల భారత దేశం నుంచి వచ్చే పతకాల సంఖ్య కేవలం వేళ్ల మీద లెక్కబెట్టగలిగేంత
మాత్రమేనా? అంటున్నారు. ఈ క్రమంలో చూస్తే.. కపిల్ దేవ్ లాంటి క్రీడా ప్రముఖుల సలహా సూచనలు చాలా చాలా అవసరం. దానికి తోడు ఖేలో ఇండియా గేమ్స్ తెలంగాణలో నిర్వహించమని, ఆపై క్రీడల కోసం వంద కోట్లు ఇవ్వమని ఆయన కేంద్ర మంత్రిని కలిసి మరీ విన్నవించుకున్నారు. ఇక ఒలింపిక్స్- 2036 రెండు ఈవెంట్లు.. తెలంగాణ రాష్ట్రంలో జరపమని కూడా అడిగారు సీఎం రేవంత్.
ఇక అజయ్ దేవ్ గన్ సీఎం భేటీలోని ముఖ్యాంశమేంటని చూస్తే.. హైదరాబాద్ లో ఫిల్మ్ స్టూడియో కట్టడానికి తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా దేవ్ గన్ సీఎం రేవంత్ ని అడిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అజయ్ దేవ్ గన్ కి సంబంధించిన వీఎఫ్ఎక్స్ స్టూడియో ఒకటి మాదాపూర్ లో ఉంది. ఇక్కడే ఒక ఫుల్ స్టూడియో సెటప్ ఉంటే బావుండని అజయ్ దేవగన్ భావిస్తున్నారు. ఇందుకోసమే సీఎం రేవంత్ ని అజయ్ దేవగన్ కోరినట్లుగా తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cine-25-201473.html
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!