ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టై రిమాండ్ లో ఉన్న సర్కిల్ సీఐ నాగరాజు న్యాయమూర్తి ముందు సంచలన వ్యాఖ్యానాలు చేశారు. తన ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉందనీ, ఈ కేసును బలవంతంగా ఒప్పుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నాని అన్నారు. ఒక పోలీసు అధికారి అయి ఉండి, తోటి విభాగాల నుంచే తనకు ప్రాణభయం ఉందంటూ ఆక్ష్న న్యాయస్థానంలో మొరపెట్టుకోవడం సంచలనం రేపింది.
విచారణలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందుకు వచ్చిన సీఐ నాగరాజు.. ఈ కేసులో తనను ఇరికించేందుకు తెరవెనుక పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేపట్టిన విచారణకు తాను మొదటి నుంచి పూర్తిగా సహకరిస్తూనే ఉన్నానని చెప్పిన నాగరాజు.. ఇప్పుడు కొత్తగా తన వద్ద అదనంగా చెప్పడానికి ఏమీ లేదనీ,ఇప్పుడు తనను మళ్లీ పోలీస్ కస్టడీకి ఇస్తే.. తన ప్రాణాలకే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కోర్టు.. నాగరాజు లేవనెత్తిన అభ్యంతరాలు, ఆరోపణలపై లిఖితపూర్వక నివేదిక సమర్పించాలని పోలీసు ఉన్నతా ధికారులను ఆదేశించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ci-nagaraju-sensational-allegation-36-224745.html
జడ శ్రవణ్ కుమార్ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు నాలుక కోసి దానిని నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు పార్సిల్ పంపిస్తానంటూ అభ్యంతరకరమైన,అనుచితమైన వ్యాఖ్యలు చేశారు.
అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో భారీ స్కోరు సాధించినప్పటికీ, వరుణుడు విరుచుకుపడటంతో మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దయింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.
చాలా కాలంగా ఇరు దేశాల మధ్య నిలిచిపోయిన అధికారిక, అనధికారిక దౌత్య మార్గాలను మళ్లీ తెరిచి, అన్ని సమస్యలపై ప్రత్యక్ష సంప్రదింపులకు తక్షణమే శ్రీకారం చుట్టాలని ఈ ప్రముఖులు ఆ లేఖలో ఇరు దేశాల ప్రముఖులకు విజ్ణప్తి చేశారు.
అమెరికా అండతో రెచ్చిపోతున్న ఇజ్రాయెల్‌ను అదుపులో ఉంచాలనీ, లేకుండా తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. అమెరికా గనుక ఇజ్రాయెల్ దేశాన్ని నియంత్రించడంలో విఫలమైతే.. తామ స్పందన తీవ్రాతి తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న దుష్ప్రచారం, వ్యక్తిగత దూషణలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన పరిచయం ప్రేమగా మారింది.
స్టీల్ ప్లాంట్ సందర్శనకు వైసీపీకి అనుమతి నిరాకరణ..
ఇరాన్ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని కన్నుమూయడంతో ఆ దేశంలో ఒక చారిత్రాత్మక అధ్యాయం ముగిసింది
ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదమే తెలుగు జాతికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది...
తెలంగాణ రాష్ట్ర ప్రగతి రథాన్ని మరింత వేగంగా పరుగులు తీయించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగారు.
రాష్ట్రాభివృద్ధితో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
మావిగన్‌కు కట్టుబడి ఉన్నాం..3 అటకెక్కినట్లేనా?