అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి..!

Publish Date:Aug 12, 2026

Advertisement

 

అధికారుల వేధింపులే కారణమంటూ సెల్ఫీ వీడియో...!

అధికారుల వేధింపులు, పని ఒత్తిళ్లే కారణమంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ ఆశా వర్కర్ చికిత్స పొందుతూ మృతి చెందింది. చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వి.కోట మండలం భారత్‌నగర్‌కు చెందిన రాణి ఆశా వర్కర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు, వేధింపులు ఎదుర్కొంటున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. వారం రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లేందుకు సెలవు కోరగా.. అనుమతి నిరాకరించడంతో పాటు రెండు నెలల జీతం నిలిపివేస్తామని అధికారులు బెదిరించినట్లు రాణి ఆరోపించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్ మాధవి, నిత్య తనను తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ రాణి సెల్ఫీ వీడియో రికార్డు చేసినట్లు తెలిపారు. తన ఆత్మహత్యాయత్నానికి వారే కారణమని ఆరోపిస్తూ.. సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వీడియోలో కోరినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఆత్మహత్యాయత్నం అనంతరం రాణిని వేలూరులోని సీఎంసీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఐదు రోజుల పాటు చికిత్స పొందిన ఆమె ఇవాళ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాణి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి.. ఆమె ఆరోపణలపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని, బాధ్యులుగా తేలిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను కోరుతున్నారు.

Chittoor District, Asha Worker, Asha Worker Death, Suicide Attempt, Harassment Allegations, Official Harassment, Work Pressure, Medical Officer, V Kota, Bharat Nagar, CMC Hospital Vellore, Andhra Pradesh, Health Department, Asha Worker Suicide

By
en-us Political News

  
రాజకీయ విభేదాల నేపథ్యంలో తనను కులం పేరుతో దూషించి, అవమానించారని ఆరోపిస్తూ ఓ రాజకీయ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ నేత జక్కిడి ప్రభాకర్‌రెడ్డిపై ఎల్‌బీనగర్ పోలీసులు కేసు నమోదు
 భార్య బస్సు క్లీనర్‌తో వెళ్లిపోయిందని సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేశాడు ఇన్‌ఫ్లుయెన్సర్ అఖిల్ ..!
ఓటర్ల జాబితా పునఃపరిశీలన సమయంలో ఎన్నికల సిబ్బంది ఆయన పేర్కొన్న చిరునామాకు వెళ్లి విచారణ జరిపారు. ఆ సందర్భంగా సదరు అపార్ట్‌మెంట్‌లో ప్రకాష్ రాజ్ గడచిన నాలుగు సంవత్సరాలుగా నివసించడం తేలింది. నివాసం ఉండని వ్యక్తి పేరును ఆ ప్రాంత ఓటర్ల జాబితాలో కొనసాగించడం నిబంధనలకు విరుద్ధం కావడంతో.. అధికారులు ఆయన పేరును చిరునామా మారిన ఓటర్ల కేటగిరీ కింద వర్గీకరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తీవ్ర ఘర్షణలకు, ప్రెస్ మీట్ల విమర్శలు-ప్రతివిమర్శలకు వేదికగా మారిన ముఖ్యమైన అంశాల్లో మెగా డీఎస్సీ ఒకటి..
సూర్యగ్రహణం వేళ కరెంట్ వాడకం తగ్గించిన వినియోగదారులకు ఉచిత విద్యుత్ ఇస్తామని ఆక్టోపస్ ఎనర్జీ ఆఫర్ ప్రకటించింది. సోలార్ పవర్ కొరత, గ్రిడ్ భద్రత మరియు నిపుణుల విశ్లేషణల పూర్తి వివరాలు ఇవే!
ప్రయాణాల్లో లేదా ఎక్కడైనా సులభంగా, అత్యంత ఉత్పాదకంగా పనిచేసేందుకు అవసరమైన బెస్ట్ రిమోట్ వర్కింగ్ గ్యాడ్జెట్లు, ల్యాప్‌టాప్ స్టాండ్‌లు, నోయిస్ కాన్సెలేషన్ హెడ్‌ఫోన్లు మరియు పవర్ బ్యాంక్స్ వివరాలు తెలుసుకోండి.
న్యూయార్క్‌ను ఊపేసిన రష్యన్ స్లీపర్ ఏజెంట్ ఆన్నా చాప్‌మ్యాన్ సంచలన నిజాలు తెలుసుకోండి. ఎఫ్‌బీఐ ఆపరేషన్ గోస్ట్ స్టోరీస్ నుండి ఛానల్ 4 డాక్యుమెంటరీ వరకు పూర్తి థ్రిల్లింగ్ వివరాలు ఇక్కడ చదవండి.
ఒక రూపాయి యూపీఐ చెల్లింపు వెనుక అసలు ఎంత ఖర్చు అవుతుంది? ఏటా ₹20,000 కోట్ల వ్యయం, ప్రతి లావాదేవీకి 83 పైసల ఖర్చు మరియు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కొత్త బిల్లు వివరాలు మీకోసం.
అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ముడి చమురు ధరలు మరియు మధ్యప్రాచ్య ఉద్రిక్తతల వల్ల భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్, నిఫ్టీ పతనానికి గల ముఖ్యమైన కారణాలు, రంగాలవారీ పనితీరు మరియు మార్కెట్ విశ్లేషణను వివరంగా తెలుసుకోండి.
టీసీఎస్, హెచ్‌సీఎల్ కంపెనీలపై సైబర్ దాడి ముప్పు వార్తల వెనుక ఉన్న అసలు నిజాలు తెలుసుకోండి. స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు ఐటీ దిగ్గజాలు ఇచ్చిన స్పష్టత, 4 ఏళ్ల నాటి డేటా లీక్ వివరాలు మరియు చైనా, పాకిస్థాన్ల సైబర్ దాడుల నివేదికల పూర్తి విశ్లేషణ.
భారతీయ కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
ఆర్డీ ఇండస్ట్రీస్ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో దాదాపు 39 శాతం భారీ ప్రీమియంతో మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. 139 రెట్లు సబ్‌స్క్రైబ్ అయిన ఈ రీసైక్లింగ్ కంపెనీ ఐపీఓ వివరాలు, లిస్టింగ్ ధర మరియు ఆర్థిక వృద్ధి సమాచారం కోసం ఇప్పుడే చదవండి.
సింక్విఫీల్డ్ కప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్‌. ప్రజ్ఞానంద అద్భుత విజయం సాధించారు. ప్రపంచ ఛాలెంజర్ జావోఖిర్ సిందరోవ్‌ను 95 ఎత్తుల పోరులో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.