కూటమికి చిరు మద్దతు.. జగన్ కు మైండ్ బ్లాక్!

Publish Date:May 7, 2024

Advertisement

కీలెరిగి వాత పెట్టినట్లుగా చిరంజీవి జగన్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఎన్డీయే కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నారు.  అసలే బలహీనంగా ఉన్న జగన్ కు చిరంజీవి తెలుగుదేశం కూటమికి బాహాటంగా మద్దతు ఇవ్వడం మరింత బలహీనం చేస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకూ చిరంజీవి ప్రత్యక్షంగా తన రాజకీయ మొగ్గు ఎటువైపు అన్నది ప్రకటించలేదు. కానీ మిత్రులు అంటూ అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, అలాగే జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ లకు ఓటు వేయండి అంటూ ఆయన ఒక వీడియో సందేహం ద్వారా ప్రజలకు పిలుపు నిచ్చారు. అంతకు ముందే తన సోదరుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళం అందించారు.

ఇప్పుడు తాజాగా తన సోదరుడు పవన్ కల్యాణ్ కు ఓటు వేసి ఓ నిస్వార్థ సేవకుడిని గెలిపించాలని కోరుతూ పిఠాపురం ప్రజలను ఓ వీడియో ద్వారా కోరారు. ఎన్నికలు రోజుల వ్యవధిలోకి వచ్చేశారు. మరో ఐదు రోజులలో రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇప్పటికే కూటమికే రాష్ట్రంలో మొగ్గు కనిపిస్తోందంటూ పలు సర్వేలు తేల్చేశాయి. జగన్ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి సభలకు జనం పోటెత్తుతుండటం, మరో వైపు వైసీపీ ప్రచారానికి స్పందన కనిపించకపోవడంతో వైసీపీ శిబిరం డీలా పడింది. ఈ తరుణంలో చిరంజీవి కూటమికి మద్దతు పలికడం కచ్చితంగా వైసీపీకి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా మారుతుందనడంలో సందేహం లేదు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు రానున్న రెండు మూడు రోజులలో చిరంజీవి తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. అలా కలవడం  అంటే చిరంజీవి తెలుగుదేశం కూటమికి బాహాటంగా మద్దతు ప్రకటించినట్లేనని భావించాల్సి ఉంటుంది. 

ఇక తాజాగా జనసేనానికి మద్దతుగా అన్నయ్య చిరంజీవి వీడియో సందేశం అందరినీ కదిలిస్తోంది. హృదయాలకు హత్తుకునేలా ఉంది. కుటుంబంలో చివరివాడిగా పుట్టిన పవన్ కల్యాణ్ సమాజానికి మేలు చేయడంలో మాత్రం ముందువాడిగా నిలిచాడని పేర్కొన్నారు.  చిరంజీవి పిలుపు పిఠాపురంలో ఏమూలో వైసీపీకి మిణుక్కు మిణుక్కు మంటున్న గెలుపు ఆశలను ఆవిరి చేసేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చిరంజీవి చంద్రబాబుతో భేటీ అయితే ఆ ప్రభావం రాష్ట్రం మొత్తం ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే జగన్ సహా ఆ పార్టీ నేతలంతా ఓటమి బెంగతో డీలా పడ్డారు.  చిరు ఎంట్రీతో  ఆ పార్టీ అధినేత మరింత దుర్బలంగా మారడం ఖాయమంటున్నారు. ఎందుకంటే చిరంజీవి చాలా కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రజలలో ఆయనకు ఉన్న గుర్తింపు, గౌరవం మాత్రం చెక్కు చెదరలేదు. ఆయన మద్దతు నిస్సందేహంగా కాపు సామాజికవర్గ ఓటర్లను తెలుగుదేశం కూటమివైపు ఆకర్షిస్తుంది.  సరిగ్గా ఎన్నికల వేళ తెలుగుదేశం కూటమికి చిరు మద్దతుగా రావడం జగన్ కు మింగుడుపడని అంశమే. గతంలో సినిమా టికెట్ల తగ్గింపు చిరంజీవి జగన్ ను కలిసిన సందర్భంలో  ఎదురైన పరాభవానికి సరైన సమయంలో  ఎదురైన పరాభవానికి చిరంజీవి సరైన సమయంలో దీటైన బదులిచ్చినట్లుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.