మెగా కుంభ‌కోణం!.. జూబ్లీహిల్స్‌లో చిరంజీవి ల్యాండ్ గోల్‌మాల్‌!

Publish Date:Apr 27, 2022

Advertisement

జూబ్లీహిల్స్‌ కో ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీలో ఏమి జరుగుతోందో ఎవరికీ తెలియదు. అదొక మాయాలోకం. ఇప్పుడు కాదు, 1964లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్రంసొలో సొసైటీ ఏర్పడిన నాటి నుంచి, సొసైటీ భూముల క్రయ విక్రయాలలో కొత్త కొత్త అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అసెంబ్లీలో చర్చలు,  కమిటీలు విచారణలు, నివేదికలు అన్నీ ఇన్నీకాదు, చాలానే ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే, గత 20 ఏళ్లుగా సొసైటీలో జరుగుతున్న అక్రమాలపై దర్యాప్తు జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయం జరిగి పది రోజులు అయినా  కాకముందే, మరో మెగా కుంభకోణం వెలుగు లోకి వచ్చింది. 

నిజానికి సొసైటీలోగత 20 సంవత్సరాలుగా సాగుతున్న అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని సొసైటీ ప్రస్తుత చైర్మన్‌ రవీంద్రనాథ్‌ చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం సెక్షన్‌ 51 కింద విచారణకు ఆదేశించింది. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశం అనంతరం ఆయనే తెలిపారు. సొసైటీలో 20 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వారు అనేక అక్రమాలకు పాల్పడ్డారని గుర్తించామని, ఆయా అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని తాము ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. తమ విజ్ఞప్తిని మన్నించిన ప్రభుత్వం సెక్షన్‌ 51 కింద విచారణకు ఆదేశించిందని రవీంద్రనాథ్‌ తెలిపారు.


అయితే, ఇంతలోనే  మెగా కుంభకోణం మరొకటి వెలుగులోకి వచ్చింది. వివరాలోకి వెళితే ఈ మెగా కుంభకోణంలో మెగా స్టార్ చిరంజీవీ ,భూ దందా వెలుగు చూసింది. మెగా స్టార్ చిరంజీవి, 1999లో సొసైటీలో 3333 చదరపు గజాల విస్తీర్ణంగల  ప్లాట్ నెంబర్ 303ఎన్’ను కొనుగోలు చేశారు.అంతవరకు అంతా బాగానే వుంది. అయితే, తాజాగా, ఆ ప్లాట్’కు అనుకుని ఉన్న మరో 595 చదరపు గజాల స్థలాన్ని కూడా సొసైటీ  ఈ నెల 20న చిరంజీవి పేరున రిజిస్టర్ చేసింది. నిజానికి, ఇందుకు సంబందించిన సేల్ డీడ్, దస్తావేజులు చూస్తే, అంతా ఫెయిర్, నథింగ్ గోల్ మాల్’ అనిపిస్తుంది. కానీ, సొసైటీ భాగోతం తెలిసిన వారు, మాత్రం ఇదో మెగా కుంభకోణం అంటున్నారు. 

సొసైటీ తాజాగా చిరంజీవికి రిజిస్టర్ చేసిన 595 చదరపు గజాల భూమి, 303ఎన్’లో భాగం కాదు. అసలు అది  సొసైటీ భూమే కాదు. సొసైటీ లేఅవుట్’లో ఆ భూమిలేదు. అయినా, సొసైటీ అమ్మేసింది, కారు చౌకగా వచ్చిందని చిరంజీవి కొనేశారని, సొసైటీ సభ్యులు ఆరోపిస్తునారు. నిజానికి ఈ భూమి అయితే ప్రభుత్వ భూమి కావాలి, కాదంటే, జీహెచ్ఎంసీ భూమి అయినా కావాలి, అయినా ప్రభుత్వానికి లేదా జీహెచ్ఎంసీ కనీసం సమాచారం అయిన లేకుండానే. సొసైటీ విక్రయించింది. చిరంజీవి కొనుకున్నారు.  రిజిస్ట్రరార్’ సార్ రిజిస్టర్ చేసేశారు.  ఇలా తమది కాని ప్రభుత్వ భూమిని ప్రభుత్వ అనుమతి లేకుండా విక్రయించడం సొసైటీ చేసిన నేరమైతే, చిరంజీవి తెలిసి కొన్నారో, తెలియకే కొన్నారో గానీ, సొసైటీ సభ్యులు చేస్తున్న ఆరోపణలు నిజం అయితే, అయన చేసింది కుడా నేరమే అవుతుందని అంటున్నారు.

నిజంగా, సొసైటీ వారు నిజాయతీగానే ఆ భూమిని చిరంజీవికి విక్రయించాలని అనుకుంటే, ముందుగా జీహెచ్ఎంసీ అనుమతితో , నిబంధనల ప్రకారం సొసైటీ లేఅవుట్’లో చేర్చి,ఆతర్వాత చిరంజీవికి గానీ మరొకరికి గానీ బదిలీ చేయాలి, కానీ, సొసైటీ ఇదేమే లేకుండానే, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా, నిబంధనలను ఉల్లంఘించి జీహెచ్ఎంసీ/ప్రభుత్వానికి చెందిన భూమిని చిరంజీవి పేరున రిజిస్టర్’ చేసిందని సొసైటీ సభ్యులు, న్యాయ నిపుణులు ఆరోపిస్తున్నారు. అలాగే, ఈ భూమి నిజం చిరంజీవి పేరున ఉండి ఉంటే, ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 58 & 59 ప్రకారం, రెగ్యులరైజేషన్’కు సొసైటీ, లేదా చిరంజీవి దరఖాస్తు చేసుకోవలసిందని, అది కూడా చేయలేందంటే, ఈ మొత్తం వ్యవహారంలో అక్రమాలు జరిగాయని అనుకోవచ్చని, సొసైటీ సభ్యులు, న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.      

అదొకటి అలా ఉంటే, సదరు  భూమి మార్కెట్ ధర చదరపు గజానికి,రూ. 3,50,000 ఉంటే, సొసైటీ చిరంజీవి నుంచి  ఉదారంగా రూ. 65000 వంతున వసూలు చేసింది. ఇక్కడే చిరంజీవి మీద సొసైటీకి ఇంత ప్రేమ ఎందుకు అనే ప్రశ్న తలెత్తుతోంది. అదుకే ఇందులో ఏదో గోల్ మాల్ ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. గత సొసైటీ హయాంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కొత్త చైర్మన్, అదే దారిలో మరో ముందడుగు వేశారనే ఆరోపణలూ ఉన్నాయి. అలాగే, సొసైటీ మేనేజింగ్ కమిటీ లేదా జనరల్ బాడీకి తెలియ చేయకుండానే అధ్యక్ష, కోశాధికారులు దస్తావేజులు రిజిస్టర్ చేశారని, కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సేల్ డీడ్’ను  రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  

నిజానికి ఈ సొసైటీలో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయని , సొసైటీ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎప్పుడో సంవత్సరం క్రితమే ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మంత్రి గారికి వినతి పత్రం అందజేశారు.

అయినా, చలనం లేదు.నిజానికి సొసైటీ చరిత్రలో ఇలాంటి అక్రమాలు అవకతవకలు కోకొల్లుగా జరిగాయి. అయితే, అందరూ అయితే రాజకీయ నాయకులు, కాదంటే చిరంజీవి వంటి పెద్ద మనుషులే కావడంతో, అంతా గప్ చిప్’గా సాగిపోతోందని అంటున్నారు.

By
en-us Political News

  
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.