చిరంజీవి ఫ్యాన్స్ సంబరాల్లో అగ్నిప్రమాదం
Publish Date:Oct 28, 2012
Advertisement
కేంద్రమంత్రిగా రాష్ట్రపతి భవన్‌లో చిరంజీవి ప్రమాణం చేయడంతో నెల్లూరు జిల్లాలో ఆయన అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి హాజరయ్యారు. ఆనం పక్కనే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ఆనం సహా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అభిమానులు ఉత్సాహంతో పేల్చిన బాణసంచా అటువైపుకు వచ్చి గ్యాస్ బెలూన్ల పైన పడినట్లుగా గుర్తించారు. దీంతో బెలూన్లు వరుసగా పేలాయి. ఇది అక్కడ కాసేపు అలజడి సృష్టించింది. కేంద్ర మంత్రిగా ప్రజా సేవను మరింత బాధ్యతగా నిర్వహిస్తానని చిరంజీవి పేర్కొన్నారు. తనకు ఏ శాఖ కేటాయించినది తెలియదని, మీడియా ద్వారానే తనకు పర్యాటక శాఖ కేటాయించినట్లు తెలిసిందన్నారు. ఒక వేళ తనకు పర్యాటక శాఖ కేటాయిస్తే దేశంలోని పర్యాటక ప్రదేశాలను మెరుగుపరుస్తానని చెప్పారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తానన్నారు. భారత పర్యాటక రంగాన్ని ఉన్నత స్థాయిలో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని అన్నారు
http://www.teluguone.com/news/content/chiranjeevi-fans-31-18627.html





