ఎంపీ గోరంట్ల మాధవ్ పై తెలుగుదేశం ప్రధాన కార్యదర్వి చింతకాలయ విజయ్ రూ. 50లక్షలకు పరువు నష్టం దావా వేశారు. శుక్రవారం (ఆగస్టు 5) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయనీ విషయం తెలిపారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడైన చింతకాలయ విజయ్ ఈ సందర్భంగా మరోసారి గోరంట్ల మాధవ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
అసహ్యకరంగా వీడియోకాల్ లో మాట్లాడటమే కాకుండా.. బుకాయింపు కూడానా అని గోరంట్లపై మండి పడ్డారు. తనపై మీడియా సమావేశంలో ఆరోపణలు చేసినందుకే మాధవ్ పై పరువునష్టం దావా వేసినట్లు చెప్పారు. ఎంపీ హోదాలో ఉన్న గోరంట్ల మాధవ్ చేసిందే దగుల్బాజీ పని.. నగ్నంగా మహిళలో వీడియో కాల్ మాట్లాడుతూ దొరికిపోయిన ఆయన సిగ్గుతో తలదించుకోవలసింది పోయి నా పై ఆరోపణలు చేయడమేమిటని నిలదీశారు.
ఎంత ఎంపీ అయినా.. చట్టం ముందు ఆయన సామాన్యుడేనని చింతకాలయ విజయ్ అన్నారు. దిక్కుమాలిన పని చేసి తమపై నిందలేయడం దారుణమన్నారు. పవిత్రమైన పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ.. గోరంట్ల మాధవ్ దిక్కుమాలిన పని చేసి దొరికిపోవడమే కాక.. తెలుగుదేశం పార్టీ నేతలపై, మీడియాపై నిందలేయడం సిగ్గుచేటన్నారు. ఎంపీ మాధవ్ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి తనకు సంబంధించిన వీడియో బయటకు తెచ్చింది తానే అనడం సరికాదన్నారు. అసలు ఆ వీడియోకు, తనకు ఏం సంబంధమో ఆయనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉన్న వ్యక్తికి నీతి, నిజాయితీ అనేవి లేవా అన్నారు. ఒక ఎంపీకి సంబంధించిన ప్రైవేటు వీడియోకు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శికి ఏం సంబంధమో సమాధానం చెప్పాలన్నారు. ఒక పౌరుడిగా, కుటుంబంలోని వ్యక్తిగా, పార్లమెంటు సభ్యుడిగా ఆయన కుటుంబానికి, ఓట్లేసిన ప్రజలకు, దేశానికి సమాధానం చెప్పడం పోయి.. తనను విమర్శించడమేంటి అన్నారు. తాను తప్పు చేయలేదని చెప్తే సరిపోతుందా.. ఫోరెన్సిక్ పరీక్షలకు పంపిస్తానని చెబుతున్నపుడు.. ఆ పని చేయకుండా భయపడాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.
మాధవ్ సుందర ప్రతి బింబాన్ని చూసేందుకు ఎవరికీ అంత గుండె ధైర్యం లేదంటూ ఎద్దేవా చేశారు. పార్లమెంటులో ఏపీ పరువు తీశారన్నారు. 25 ఎంపీలు ఇవ్వండి ప్రత్యేక హోదా తీసుకొస్తానని వారి నాయకుడు అంటే.. జనం నమ్మి సీట్లిస్తే.. ఇదా ప్రత్యేక హోదా అటూ ప్రశ్నించారు. ఇలాంటి న్యూడ్ వీడియోలేనా వారు తెచ్చే స్పెషల్ స్టేటస్.? ఇదేనా సాధిస్తామన్న రైల్వే జోన్.? ఇవేనా వెనుకబడిన జిల్లాలకు తెస్తామన్న కేంద్ర నిధులు అంటూ ధ్వజమెత్తారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ తన పేరు చెప్పినందుకే పరువునష్టం దావా వేశానని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తానన్నారు. మాధవ్‌పై అధినేత జగన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విజయ్ ప్రశ్నించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chintakayala-defomation-case-on-gorantla-madhav-39-141319.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.