చైనా ఆర్థిక సంక్షోభం.. ఆస్పత్రులు, బ్యాంకుల మూతతో జనం సతమతం?
Publish Date:Apr 18, 2026
Advertisement
చైనా ఆర్థిక సంక్షోభం ఒక సాధారణ మందగమనం కాదు.. వ్యవస్థాత్మక సంక్షోభం. చైనా ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్న ప్రస్తుత ఒత్తిడి, కేవలం జీడీపీ వృద్ధి మందగించడం లేదా రియల్ ఎస్టేట్ పతనం మాత్రమే కాదు. ఇది వ్యవస్థ తనను తాను నిలబెట్టుకోవడానికి ప్రజల నుంచే మరింతగా పీల్చుకోవడం ప్రారంభించిన దశ. మాక్రో వర్సెస్ మైక్రో వాస్తవం.. అధికారిక గణాంకాల్లో జీడీపీ, రిటైల్ సేల్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇలా అన్ని రంగాలలో వృద్ధి చూపిస్తాయి. కానీ నేలమీద ప్రజలు చూస్తున్నది మాత్రం వేతనాలు అందకపోవడం, బ్యాంకుల్లో దాచుకున్నడబ్బు విత్ డ్రా చేసుకోవడానికి అడ్డంకులు, ఇబ్బందులు. మూతపడుతున్నఆస్పత్రులు, కట్టుదిట్టమైన ఆలయ నియంత్రణలు, రక్షణ నుంచి ఎక్స్ట్రాక్షన్ వైపు మార్పు. ఆసుపత్రులు, బ్యాంకులు, ఆలయాలు, ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగ మార్కెట్ ఇవన్నీ ప్రజలను రక్షించాల్సిన వ్యవస్థలు. ఇప్పుడు అవే ప్రజల నుంచి సమయం, ధనం, భవిష్యత్ అవకాశాలను లాగేసుకునే యంత్రాలుగా మారుతున్నాయి. ఇది సాధారణంగా వచ్చే సైకిలిక్ ఆర్థిక మందగమనం ఇది వ్యవస్థ మొత్తం ఒత్తిడికి లోనై.. ఆ భారం మొత్తం ప్రజలపైకి నెట్టేసే దశ. ఆరోగ్య రంగం.. ఒక వైపు రద్దీ, మరో వైపు మూతపడే ఆసుపత్రులు. చైనా ఆరోగ్య వ్యవస్థలో జరుగుతున్న మార్పులు ఈ సంక్షోభాన్ని బలంగా ప్రతిబింబిస్తున్నాయి. అధిక వైద్య అవసరం ఉన్నప్పటికీ ఆస్పత్రులు దివాళా తీసి మూతపడుతున్నాయి. కోవిడ్ తరంగాలు, ఇతర ఆరోగ్య సమస్యల తర్వాత వైద్య సేవల డిమాండ్ ఎక్కువగానే ఉంది. అయినా అయినా చిన్న, మధ్యస్థ ఆసుపత్రులు మూతపడుతున్నాయి. ఇలా మూతపడుతున్న వాటిలో ప్రైవేట్ మాత్రమే కాదు.. ప్రభుత్వ ఆసుపత్రులూఉన్నాయి. భారీగా పెట్టుబడి పెట్టిన స్టార్ ఆసుపత్రులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇందుకు కారణాలేంటంటే.. మెడికల్ ఇన్సూరెన్స్ ఫండ్ ఖాళీ కావడం. మూడేళ్ల లాక్ డౌన్, టెస్టింగ్, ట్రీట్మెంట్ అన్నీ కలిసి ఇన్సూరెన్స్ పూల్ ను బలహీనంగా మార్చేశాయి. ఆసుపత్రులకు రీయింబర్స్మెంట్ తగ్గడం లేదా విపరీతమైన ఆలస్యం కావడం వల్ల క్యాష్ ఫ్లో కుదేలైంది. పెద్ద ఆసుపత్రులకు తగిన రీయింబర్స్మెంట్ లేకపోవడం, పెద్ద నగర ఆసుపత్రులు ఖరీదైన, క్లిష్ట కేసులు చూసినా, వాటికి పూర్తి చెల్లింపులు రావడం లేదు. ఫలితంగా సిబ్బంది జీతాలు ఆలస్యం, కోతలు, సేవల తగ్గింపు. ఇక జనాభా తగ్గుదల, మైగ్రేషన్ వల్ల . చిన్న పట్టణాలు, కౌంటీ స్థాయి ఆసుపత్రులకు రోగులు తక్కువగా వస్తున్నారు. పెద్ద నగరాలకు మైగ్రేషన్ పెరిగింది. దీంతో కొన్ని చోట్ల పెద్ద ఆసుపత్రుల్లో విపరీతమైన రద్దీ. మరికొన్ని చోట్ల ఆసుపత్రులే లేకపోవడం అనే వింత పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని పరిశీలకులు ఆరోగ్య వ్యవస్థ వ్యవస్థాత్మక విచ్ఛిన్నం గా అభివర్ణిస్తున్నారు. అలాగే.. బ్యాంకింగ్ వ్యవస్థ సేవల నుంచి సందేహం, విచారణ వైపు పయనిస్తోంది. చైనా బ్యాంకింగ్ రంగంలో విశ్వాస సంక్షోభం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రోజువారీ బ్యాంకింగ్ కూడా విచారణలా మారిపోయింది. ప్రజలు తమ సొంత డబ్బు తీసుకోవాలన్నా, ట్రాన్స్ఫర్ చేయాలన్నా సవాలక్ష ప్రశ్నలు, అదనపు డాక్యుమెంట్లు, యాంటీ ఫ్రాడ్ చెకింగులతో.. ఒకప్పుడు సాధారణమైన బ్యాంకింగ్ ఇప్పుడు అసెట్ ఆడిట్ లా అనిపిస్తోంది. కాగా కొందరి డిపాజిట్లు మాయమైపోయిన కేసులు కూడా ఉన్నాయి. బ్బు రిస్కీ లోన్లకు మళ్లించబడింది లేదా దుర్వినియోగమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక దాచుకున్న డబ్బులను బ్యాంకులు తిరిగి చెల్లించడానికి నిరాకరించడం, నిరవధికంగా ఆలస్యం చేయడం జరుగుతోంది. వందల కొద్దీ సంస్థలు, వేల కొద్దీ బ్రాంచులు మూతపడుతున్నాయి. అలాగే తక్కువ వడ్డీ మార్జిన్లు, అధిక బ్యాడ్ డెట్స్, రియల్ ఎస్టేట్ పతనం, లోకల్ గవర్నమెంట్ అప్పుల ప్రభావం ఇవన్నీ బ్యాంకులను, సేవల సంస్థలను తమను తాము కాపాడుకునేకోటలుగా మారుస్తోంది. ఇందుకు అయ్యే ఖర్చును డిపాజిటర్లే భరించాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో డిపాజిటర్లు తమ సొమ్మును విత్ డ్రా చేసుకోవడానికి సైతం అవాంతరాలు, అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇక పోదుపు చేసుకున్న సొమ్మను నష్టపోతున్నారు. దీంతో భయం పెరుగుతోంది. అలాగే ఆలయాలు, మత సంస్థలు విశ్వాసం నుంచి రెవెన్యూ వైపు మళ్లుతున్నాయి. చైనా ఆలయాలపై జరుగుతున్న చర్యలు సిద్ధాంతపరమైనవి ఎంత మాత్రం కావు.. అవి ఆర్థిక ఒత్తిడికి ప్రతిస్పందనగానే చెప్పాల్సి ఉంటుంది. షావోలిన్ వంటి ప్రముఖ ఆలయాల్లో సాయుధ పోలీసుల మిలిటరీ స్టైల్ నియంత్రణ. అంతే కాకుండా దాదాపు 500కు పైగా ఆలయాలు మూతపడ్డాయి. మరిన్ని ఆలయాలు రిఫామ్ లేదా రెట్టిఫై అయ్యాయి. కొన్ని చోట్ల ఆలయాల చుట్టూ ఉన్న కమర్షియల్ నిర్మాణాలను సైతం కూల్చేశారు. అంటే ఆలయాలు ప్రభుత్వ ఆస్తులు మారిపోయాయి. విరాళాలు, టూరిజం ఆదాయం, ఆలయాల చుట్టూ ఉన్న వ్యాపారాలు, రెస్టారెంట్లు వీటన్నిటినీ ప్రభుత్వం క్యాష్ రిచ్ అస్సెట్లుగా భావిస్తోంది. ఫిస్కల్ ఒత్తిడిలో ఉన్న ప్రభుత్వం ఈ ఆదాయాన్ని నేరుగా ప్రభుత్వ ఖజానాకు మళ్లిస్తోంది. అంటే ఆలయాలను చైనా ప్రభుత్వం ఏటీఎంలుగా ఉపయోగించుకుంటోంది. : ఆధ్యాత్మిక ఆశ్రయం ఇవ్వాల్సిన స్థలాలు కూడా ఆర్థిక ఎక్స్ట్రాక్షన్ యంత్రాలుగా మారుతున్నాయి. చైనా ఉద్యోగ మార్కెట్ రెండు వైపుల నుంచీ ఒత్తిడికి లోనవుతోంది. 30 ఏళ్ల క్రితం స్థాయి జీతాలతో ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి. చిన్నపట్టణాల్లో అయితే నెలకు 800 నుంచి వెయ్యి యువాన్ల వేతనం, ప్రీస్కూల్, ఇంటర్న్, హోటల్ రిసెప్షనిస్టు వంటి రంగాల్లోనే ఉద్యోగులకు ఇదే స్థాయిలో వేతనాలు లభిస్తున్నాయి. నేటి చైనా జీవన వ్యయంతో పోలిస్తే ఆ వేతనాలు బతకడానికి ఏ మూలకూ సరిపోవు. ఇల్లు, ఆహారం, ప్రయాణం ఇలా అన్ని ఖర్చులూ పెరిగిపోయాయి. కుటుంబాలు బతకడానికి బహుల ఉద్యోగాలు, సైడ్ గిగ్స్, అప్పులపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక ఉన్నత విద్యావంతులైన యువత పేస్టెబిలిటీ కోసం పరుగులు పెడుతోంది. వి పేకింగ్ యూనివర్సిటీ పీహెచ్ డీలతో సహా విద్యావంతులైన యువత, ప్రైమరీ స్కూల్ టీచింగ్, తక్కువ జీతం, కానీ ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న ఉద్యోగాలు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఎందుకంటే.. టెక్, రియల్ ఎస్టేట్, ప్రైవేట్ ట్యూటరింగ్, ఇంటర్నెట్ ప్లాట్ ఫారం వంటి హై పే రంగాలు రెగ్యులేషన్, రెసిషన్ కారణంగా బలహీనపడ్డాయి. ఉద్యోగ మార్కెట్ పై అస్థిరత భయం, 35 ఏళ్ల లోపు మాత్రమే అనే ఏజ్ డిస్క్రిమినేషన్ కారణంగా యాస్పిరేషన్ లాడర్ విరిగిపోయింది. ఎక్కువ సంపాదన కోసం అర్రులు చాచడం కాదు.. తక్కువ జీతం, ఎక్కువ గంటల పని ఉన్నా, సేఫ్ అనిపించే ఉద్యోగం కోసం ప్రజలు డబ్బు పెట్టి కొనుగోలు చేసే స్థితి. బీజింగ్లోని, పబ్లిక్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ, పెద్ద SOEలతో అనుబంధంగా ఉన్న టెక్ కంపెనీ కేసు పరిశీలిస్తే.. దాదాపు 300కి పైగా ఉద్యోగులకు రెండేళ్లకు పైగా జీతాలు బకాయి పడింది. ఈ మొత్తం దాదాపు 80 మిలియన్ యువాన్ లు. బకాయిలు క్లియర్ చేయకుండా, వేతనాల్లో భారీ కోతలు, లే ఆఫ్స్.. ఇదీ పరిస్థితి. ఈ కంపెనీ సాధారణ ప్రైవేట్ కంపెనీ ఏం కాదు.. ప్రభుత్వం సృష్టించిన సెక్యూరిటీ, టెలికాం, ప్రభుత్వ క్లయింట్లకు సేవలందించే సంస్థ. దీనిని బట్టే ఆర్థిక ఒత్తిడి, కార్మికుల పట్ల నిర్లక్ష్యం అన్నది కేవలం ప్రైవేటు రంగానికే కాకుండా పార్టీ స్టేట్ వ్యవస్థ మూలాల్లోకి చొచ్చుకుపోయిందని అవగతమౌతుంది. ప్రభుత్వ అనుబంధ సంస్థలో పని చేస్తే సేఫ్ అనే నమ్మకం కూడా ఇప్పుడు కనిపించడం లేదు. అందుకే విద్యావంతులైన యువత కూడా పేదరికాన్ని కొనుగోలు చేస్తూ స్టెబిలిటీ కోసం పరుగులు తీస్తోంది. హై స్పీడ్ రైలు స్టేషన్లలో సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల కోసం కొందరు మధ్యవర్తులకు ఒక సంవత్సరం జీతానికి సమానమైన ఫీజులు చెల్లిస్తున్నారన్న నివేదికలే ప్రత్యక్ష నిదర్శనం. ఈ ఉద్యోగాలు ఏమైనా బ్రహ్మాండమైన సౌకర్యవంతమైన ఉద్యోగాలా అంటే అదేమీ కాదు.. ఈ ఉద్యోగాలలో వేతనాలు చాలా చాలా తక్కువ. దానికి తోడు ఎక్కువ పనిగంటలు. అయినా కూడా యువత ఈ ఉద్యోగాలు ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నవి, దీర్ఘకాలం సేఫ్ అని నమ్ముతోంది. అందుకే వీటికి ఎగబడుతోంది. నిరాశ్రయులైన వారిలో వారిలో 61శాతం మంది వయసు 33 ఏళ్లలోపే కావడం గమనార్హం. పెద్ద నగరాల్లో చౌక బాక్స్ మీల్స్ కోసం క్యూలో నిలబడే యువ నిరాశ్రయుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇది యువతలో , అస్థిర, భవిష్యత్తు లేని కొత్త వర్గం తయారవ్వడాన్ని సూచిస్తోంది. వ్యవస్థ కేవలం అసమానతను కాదు, పూర్తి స్థాయి డిస్పోజెషన్ను ఉత్పత్తి చేస్తోంది.ఈ పరిస్థితి కారణంగానే.. ఇజ్రాయెల్లో ఉన్న చైనా నిర్మాణ కార్మికులు యుద్ధ ప్రమాదం ఉన్నప్పటికీ వెనక్కి రావడానికి నిరాకరిస్తున్నారు. ఎందుకంటే.. అక్కడి జీతాలు, చైనాలో దొరికే జీతాల కంటే కొన్ని రెట్లు ఎక్కువ. ఈ ఉద్యోగాల కోసం ముందుగానే భారీ ఫీజులు చెల్లించారు, కొందరు లాటరీల ద్వారా ఎంపికయ్యారు. ఇప్పుడు యుద్ధ భయంతో చైనాకు తిరిగి వస్తే.. తక్కువ జీతం, ఎప్పుడు వస్తుందో తెలియని వేతనం, లేదా నిరుద్యోగం వీటితో సతమతమవ్వాల్సి వస్తుందన్న భయం. చైనా నగరాల నుంచి దక్షిణాసియా, ఓషియానియా దేశాలకు వెళ్లే విమానాలు ఇంధన ఖర్చులు, లాభదాయకత సమస్యల కారణంగా పెద్ద సంఖ్యలో రద్దవుతున్నాయి. దీంతో దేశం బయటకు ఫిజికల్ ఎగ్జిట్ కూడా కష్టమవుతోంది. అంటే.. ప్రజలు లోపల ఒత్తిడి, బయటకు వెళ్లే మార్గాల మూసివేత మధ్య ఇరుక్కుపోతున్నారు. ప్రజల రక్షణ కోసం ఉన్న వ్యవస్థలు, ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ యంత్రాలుగా మారిపోయాయి. మొత్తంగా చూస్తే.. ప్రజలను రక్షించాల్సిన వ్యవస్థలు, ఇప్పుడు వ్యవస్థను రక్షించడానికి ప్రజల నుంచే పీల్చే యంత్రాలుగా మారుతున్నాయి. ప్రజలను రిస్క్ నుంచి రక్షించాల్సిన వ్యవస్థలు, సంస్థలు ఆ ప్రజలనే రిస్క్ ను ప్రజలపై రుద్దుతున్నాయి. మొత్తంగా చైనా ఆర్థిక సంక్షోభం కారణంగా భవిష్యత్ మూసుకుపోతోందన్న నిశ్శబ్ద భయం ఆ దేశ ప్రజలలో రోజురోజుకూ పెరిగిపోతోంది. సంకలనం, సేకరణ: సీతారాం కంఠమనేని
అన్నిటికీ మించిన తీవ్రమైన అంశం ఏమిటంటే మాయమవుతున్న డిపాజిట్లు, మూతపడుతున్న బ్యాంక్ బ్రాంచిలు.
. గిగ్ వర్క్, నిరాశ్రయులు: విరిగిపోయిన సేఫ్టీ నెట్
ఒకప్పుడు ఫాల్ బ్యాక్ గా భావించిన గిగ్ ఎకానమీ కూడా ఇప్పుడు సేఫ్టీ నెట్ వర్క్ గా పనిచేయడం లేదు.
- ఫుడ్ డెలివరీ వంటి గిగ్ ఉద్యోగాలు
- ఆర్డర్కు చెల్లించే ఫీజులు, గంటకు వచ్చే వాస్తవ ఆదాయం అన్నీ తగ్గిపోయాయి.
- ఫుల్ టైమ్ గా పనిచేసినా నెలకు సుమారు 2,500 యువాన్ మాత్రమే వస్తున్నది.
ఇది కూడా వియత్నాం వంటి దేశాల ఆదాయాలతో పోలిస్తే తక్కువే. 2025 ఆగస్టు నాటికి 47.5 మిలియన్ నిరాశ్రయులు ఉన్నారని అధికారిక గణాంకాలు. 2020తో పోలిస్తే ఇది ఐదు రెట్లు పెరుగుదల.
http://www.teluguone.com/news/content/chinas-economic-crisis-36-217676.html





