చైనా అధ్యక్షుడు కనిపించుట లేదు
Publish Date:Jul 2, 2025
Advertisement
చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ అజ్ఞాతంలోకి వెళ్ళారా? లేక అనారోగ్యంతో విధులకి దూరంగా ఉంటున్నారా? తెలియరావడం లేదు. మే 21 నుంచి జూన్ 5 వరకూ జింగ్ పింగ్ కనపడలేదు. అధికార కార్యక్రమాలకీ హాజరవ్వలేదు. అయితే అనారోగ్యంతో ఉండడం వల్ల.. రెండు వారాలు విశ్రాంతి తీసుకుని ఉండవచ్చని భావించారు. జూలై 6,7 వ తేదీలలో బ్రెజిల్ లో జరగనున్న బ్రిక్స్ సమావేశానికి జింగ్ పింగ్ హాజరు కావడం లేదని చెప్పడంతో.. అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. జీ జింగ్ పింగ్ చైనా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి బ్రిక్స్ సమావేశానికి హాజరువుతూ వస్తున్నారు. తొలిసారిగా ఆయనీ బ్రిక్స్ సమావేశానికి గైర్హాజరువుతున్నారు. జీ జింగ్ పింగ్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ కి జనరల్ సెక్రటరీ, సెంట్రల్ మిలిటరీ కమిషన్ కి చైర్మన్ గానూ వ్యవహారిస్తున్నారు. చైనా లో అధికార మార్పిడి జరగబోతున్నదా? లేక ఇప్పటికే అధికార మార్పిడి జరిగిపోయిందా? అన్నదొక చర్చ. ప్రస్తుతం చైనాలో జనరల్ ఝాంగ్ యుజియానే అధికారం చెలయిస్తున్నట్టు తెలుస్తోంది. జనరల్ ఝాంగ్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ కి వైస్ చైర్మన్ గా ఉన్నారు. జనరల్ ఝాంగ్ 24 మంది సభ్యులు గల.. చైనా కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు. సెంట్రల్ కమిటీలో సీనియర్ మెంబర్స్ మద్దతు జనరల్ ఝాంగ్ యుజీయ కి బలంగానే ఉంది. సెంట్రల్ కమిటీ లో సీనియర్ సభ్యులలో చాలా వరకూ మాజీ అధ్యక్షుడు హు జింటావో అనుచరులున్నారు. సెంట్రల్ కమిటీ లో మెజారిటీ సభ్యుల మద్దతు ఝాంగ్ యుజియా కి ఉంది కాబట్టి అధికార మార్పిడి జరిగి ఉండవచ్చనే అనుమానాలకి మరింత బలం చేకూరుతోంది. సెంట్రల్ కమిటీ లోని సీనియర్ సభ్యులు మాజీ అధ్యక్షుడు హు జింటావో మద్దతుదారులు కావడం వల్ల జింగ్ పింగ్ కి వీరంతా వ్యతిరేకంగా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే అసలు కారణం వేరే ఉందని చెబుతున్నారు. చైనా లోని పాఠశాల విద్యార్థులకు జింగ్ పింగ్ పాఠాలు చెబుతున్నారు. చైనా పాఠశాల పుస్తకాల్లో జింగ్ పింగ్- ఆలోచనలు అనే పేరు మీద విద్యార్థులకి పాఠాలు నేర్పుతున్నారు. ఇదే సెంట్రల్ కమిటీ లోని సీనియర్ సభ్యులకి నచ్చడం లేదట. ఇప్పటికే మావో- ఆలోచనల పేరిట పాఠాలు చెబుతుండగా కొత్తగా ఈ జిన్ పింగ్ ఆలోచనలేంటన్నదొక ప్రశ్న. అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పటి నుంచి జిన్ పింగ్ అటు మిలిటరీలో, ఇటు ఆర్ధిక విధానాలకు సంబంధించి తన అనుచరులకే పెద్ద పీట వేస్తూ వచ్చారు. నిజానికి జింగ్ పింగ్ అనుచరుల కంటే అనుభవం, నాలెడ్జ్ ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు. వీరందరినీ కాదని తన అనుచరులకే ఆయన కీలక బాధ్యతలు అప్పగించడం సెంట్రల్ కమిటీ సీనియర్ సభ్యుల ఆగ్రహానికి మరో కారణంగా తెలుస్తోంది. ప్రస్తుత చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యాంగ్ ని తుదుపరి చైనా అధ్యక్షుడిగా జింగ్ పింగ్ ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు.. గత కొంత కాలంగా! ఇది కూడా సెంట్రల్ కమిటీ సభ్యులకి నచ్చలేదని అంటారు. వాంగ్ యాంగ్ అంత సమర్థుడైన విదేశాంగ మంత్రి కాదన్నది వీరి అభిప్రాయంగా తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/china-president-39-201120.html





