పిల్లలు ఎత్తు పెరగడం లేదా.. ఆహారంలో ఈ విటమిన్లు మిస్ అవుతున్నట్టే..!

Publish Date:Feb 1, 2025

Advertisement

 

ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా సరే..  తల్లిదండ్రులు తమ పిల్లల సంరక్షణలో  ఏ చిన్న విషయాన్ని వదిలిపెట్టరు. చదువు దగ్గర్నుంచి తిండి వరకూ ప్రతి చిన్నా పెద్దా విషయాలు దగ్గరుండి చూసుకుంటారు. అయితే ఇంత జరిగినా కూడా పిల్లల ఎత్తు పెరగకపోతే ఆందోళన చెందే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. నిజానికి పిల్లలు శారీరకంగా ఎదుగుదల బాగుండాల్సిన వయసులో అలా లేకపోతే వారు తీసుకునే ఆహారంలో ఏదో లోపిస్తున్నట్టే లెక్క. పిల్లలు తగినంత ఎత్తు ఉండటం అనేది శరీర ఆకృతి అందంగా కనిపించడం కోసమే కాదు.. అది ఆరోగ్యానికి, ఫిట్ననెస్ కు కూడా సంబంధించిన విషయం. అయితే ఎత్తు తక్కువ అనే సమస్యతో బాధపడేవారు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. సాధారణంగా కొన్ని హార్మోన్ల లోపం ఈ సమస్యకు ప్రధాన కారణం.  ఏ విటమిన్ లోపం వల్ల పిల్లల ఎత్తు పెరగడం లేదో  తెలుసుకోవడం చాలా ముఖ్యం.

గ్రోత్ హార్మోన్..

గ్రోత్ హార్మోన్ లోపం (GHD) తక్కువ ఎత్తుకు ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది మాత్రమే కాదు, విటమిన్ డి లోపానికి పిల్లల ఎత్తు తక్కువగా ఉండటానికి కూడా సంబంధం ఉంటుంది.  విటమిన్ డి ఎముకలను బలపరుస్తుంది. ఎముకల అభివృద్ధికి కూడా అవసరం. ఇలాంటి పరిస్థితిలోో శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే, అది నేరుగా ఎత్తును ప్రభావితం చేస్తుంది. పిల్లల ఎత్తు,  ఎముకల అభివృద్ధికి విటమిన్ డి ముఖ్యమైనది.

10 ml కంటే తక్కువ విటమిన్ లోపం సంవత్సరానికి 0.6 cm ఎత్తులో తక్కువ పెరుగుదలకు దారితీస్తుంది. విటమిన్-డి లోపం ఉంటే పిల్లలలో కింది లక్షణాలు ఉింటాయి.

ఎముకల నొప్పి,
త్వరగా అలసిపోవడం,
జుట్టు రాలడం,
నిద్రపోవడం,
ఎప్పుడూ కోపంగా ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి.

పిల్లలో విటమిన్-డి లోపం అధిగమించాలంటే ప్రతి రోజూ ఉదయాన్నే నిద్రలేపాలి.  ఉదయం సమయంలో సూర్యుడి లేత కిరణాలలో పిల్లలను కొంత సమయం గడిపేలా ఎంకరేజ్ చేయాలి.  ఎన్ని సప్లిమెంట్లు తీసుకున్నా సహజంగా లభించే విటమిన్-డి శరీరాన్ని చాలా తొందరగా రికవర్ అయ్యేలా చేస్తుంది. అలాగే పాలు, గుడ్డులోని పసుపు భాగం తినాలి.  నారింజ వంటి సిట్రస్ పండ్లను తినాలి. ఇవన్నీ చేస్తే పిల్లలో ఎత్తు పెరుగుదల గమనించవచ్చు.


                                   *రూపశ్రీ.


గమనిక:


ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

By
en-us Political News

  
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి..
మనలో చాలా మందికి అద్దంలో చూసుకున్నప్పుడు కొన్ని శరీర భాగాలు నచ్చవు. ముఖ్యంగా ఎంత వ్యాయామం చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా తగ్గని మొండి కొవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది...
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పి.సి.ఓ.డి (PCOD). అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. ..
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో..
నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడిన జీవితంలో ఆందోళన ఒక సాధారణ సమస్యగా మారింది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మనసును అశాంతపరిచి, నిద్ర, ఆహరం, రోజువారీ జీవనశైలిపై  ప్రభావం చూపుతాయి...
కాలం మారినా మనిషి జీవన పోరాటం మాత్రం మారదు.  కొందరు కాలంతో పోటీ పడి ఎండ, వాన, చలి వంటి వాటిని లెక్క చేయకుండా సాగుతూ ఉండాలి. లేకపోతే వారితో పాటు వారిని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.....
వేసవి అంటే మండే ఎండలు, వేడి గాలులు,  చెమటలు పట్టించే వాతావరణం.. ఇవన్నీ ఉంటాయి.  ఇలాంటి రోజుల్లో  రోడ్డు పక్కన అమ్మే చెరకు రసం తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. నిమ్మరసం, నల్ల ఉప్పు, పుదీనా కలపడం వల్ల చెరకు రసం  రుచి మరింత ఇనుమడిస్తుంది...
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని..
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై..
నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని నిరంతరం వేధించే ప్రధాన శత్రువులు ఒత్తిడి మరియు ఆందోళన. వీటితో పాటు థైరాయిడ్..
బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పాహారం నేటికాలపు జీవనశైలికి చాలా ముఖ్యంగా మారింది.  ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతారు.  అయితే చాలామంది అల్పాహారంలో..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.