Publish Date:Jul 30, 2024
చార్ సౌ సాల్ షెహర్ అని చెప్పుకునే హైదరాబాద్ నగరానికి చార్మినార్ బ్రాండ్ అంబాసిడర్‌లా నిలిచింది. చారిత్రక చార్మినార్‌లోని 135 ఏళ్ల నాటి గడియారం దెబ్బతింది. చార్మినార్‌కు మరమ్మతులు చేస్తుండగా ఓ ఇనుపరాడ్ గడియారానికి తగలడంతో 5, 6 నంబర్ మధ్య అద్దం కొద్దిగా పగిలింది. అయినప్పటికీ ఇంకా అది పనిచేస్తుండడం గమనార్హం. 1889లో చార్మినార్‌కు నాలుగు వైపులా గడియారాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు తూర్పు వైపున ఉన్న గడియారం ధ్వంసమైంది.
చార్మినార్‌ను సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో నిర్మించారు. ఈ చతురస్రాకార నిర్మాణం అతని భార్య భాగమతి గౌరవార్థం నిర్మించబడిందని చెబుతారు. అయితే చార్మినార్ నిర్మాణం వెనుక అసలు కారణం మాత్రం ఇంకా పూర్తిగా తెలియరాలేదని చరిత్రకారులు చెబుతుంటారు.
ప్లేగు వ్యాధి అంతం కావాలని సుల్తాన్ ప్రార్థించాడని పూర్వికులు చెబుతుంటారు. అప్పట్లో ప్లేగు అంతం కావడంతో అల్లాకు నివాళిగా చార్మినార్ నిర్మించారు. చార్మినార్ కు ఉన్న నాలుగు స్తంభాలు కూడా ఇస్లాం లోని మొదటి నాలుగు ఖలీఫాలకు అంకితం చేయబడ్డాయి.కర్బలా యుద్ధంలో తన ప్రాణాలను కోల్పోయిన ప్రవక్త ముహమ్మద్ అల్లుడు జ్ఞాపకార్థం దీనిని నిర్మించారని కూడా చెబుతారు, దీని రూపకల్పన షియా తజియాస్ ఆకారంలో ఉంది. చార్మినార్ ఉన్న ప్రదేశంలోనే సుల్తాన్ తన కాబోయే భార్య భాగమతిని మొదటిసారి చూసిన ప్రదేశం అని కూడా కొందరు నమ్ముతారు.
17వ శతాబ్దంలో ఇక్కడ ప్రయాణించిన ఒక ఫ్రెంచ్ యాత్రికుడు, జీన్ డి థెవెనోట్ ప్రకారం దీని నిర్మాణానికి కారణం పూర్తిగా భిన్నమైనదని చెప్పొచ్చు. పర్షియన్ గ్రంథాలప్రకారం చార్మినార్ రెండవ ఇస్లామిక్ మిలీనియం ప్రారంభానికి గుర్తుగా నిర్మించబడింది.పునాది రాయిపై ఉన్న శాసనం ‘ఈ నా నగరాన్ని ప్రజలతో నింపండి, ఓ ప్రభూ, నదిని చేపలతో నింపండి’ అని అనువదించబడింది. చరిత్రకారుడు మహమ్మద్ సఫీయుల్లా ప్రకారం, చార్మినార్ హైదరాబాద్‌కు కేంద్రంగా నిర్మించబడింది. 1670లో పిడుగుపాటుకు గురై ఒక మినార్ కింద పడిపోయింది. అప్పుడు సుమారు రూ.58000 ఖర్చుతో మరమ్మతులు చేశారు. 1820లో, దానిలో కొంత భాగాన్ని సికందర్ జా పునరుద్ధరించారు. చార్ మినార్ పై అంతస్తులో అత్యంత పురాతన మసీదు ఉంది. 1889 సంవత్సరంలో చార్మినార్కు నాలుగు వైపులా నాలుగు గడియారాలు కూడా అమర్చారు. ఈ నాలుగు గడియారాల్లో ఒకటి డ్యామేజ్ అయ్యింది. గత కొన్ని రోజులుగా ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ మరమ్మత్తులు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఒక పొడవైన ఇనుప రాడ్ చార్మినార్ గడియారాన్ని తాకింది. దీంతో గడియారం అద్దం పగిలిపోయింది. అప్పట్లో ఆగిపోయిన గడియారాలను వహీద్ వాచ్ కంపెనీ రిపేర్ చేసి పునరుద్దరించినప్పటికీ తాజాగా జరిగిన డ్యామేజి పట్ల హైదరాబాద్ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/charminar-clock-broken-due-to-negligence-of-archeologyhyderabad-lovers-are-worried-25-181761.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.