మారుతున్న తుని రాజకీయం..! గెలుపు దిశగా యనమల దివ్య
Publish Date:May 3, 2024
Advertisement
తుని రాజకీయం ఆసక్తి కరంగా మారింది. గెలుపు కోసం....ఇటు టీడీపీ, అటు వైసీపీకి రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అయితే కలిసొచ్చేదెవరికి, అని చూస్తే, ఇక్కడ సామాజిక సమకరణాలు కీలకంగా మారాయి. టీడీపీ, జనసేన పొత్తతో లెక్కలు మారిపోయాయి. నువ్వా నేనా అన్నట్లుగా హోరా హోరీగా పోటీ అయితే కొనసాగుతోంది. తొలి నుంచి సామాజిక వర్గాలే ఇక్కడ గెలుపు ఓటములను ప్రభావితం చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్ది రాజాకు 92,459 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్ది కృష్ణుడుకు 68,443 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఇదే నియోజకవర్గం నుంచి ఆరు సార్లు గెలుపొందారు. టీడీపీ ఆవిర్భావం నుంచి యనమల తునిలో పెద్దదిక్కుగా ఉన్నారు. తుని అంటే యనమలకు కంచుకోట. 2009లో ఓడిపోయారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో రామకృష్ణుడు పోటీ చేయకుండా సోదరుడు వరుసయ్యే కృష్ణుడుని బరిలో దించారు. కృష్ణుడు సైతం ఓడిపోయారు. దీంతో ఈ సారి కృష్ణుడుకు సీటు ఇస్తే మళ్ళీ పార్టీ ఓడిపోతుందనే భయంతో యనమల తన కుమార్తె దివ్యకు సీటు ఇప్పించుకున్నారు. దీంతో యనమల కుటుంబంలో చిచ్చు రగిలింది. తన సోదరుడు కుమార్తె కోసం తన రాజకీయ భవిష్యత్ ను దెబ్బతీశాడంటూ కృష్ణుడు వైసీపీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో యనమల సోదరుడు కృష్ణుడు టీడీపీ నుంచి పోటీ చేసారు. ఆయన పైన వైసీపీ అభ్యర్దిగా దాడిశెట్టి రాజా గెలిచారు. ప్రస్తుతం రాజా మంత్రిగా ఉన్నారు. మళ్ళీ ఈ సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని రాజా ఆశ పడుతున్నారు. టీడీపీ నుంచి యనమల కుమార్తె దివ్య పోటీలో ఉన్నారు. టీడీపీ, జనసేన పొత్తుతో ఈ నియోజకవర్గం పైన టీడీపీ ఆశలు పెట్టుకుంది. అయితే, మంత్రిగా ఉన్న దాడిశెట్టి రాజా హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. కాపు, బీసీ వర్గాలు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో రెండు పార్టీలు ఓటర్ల ను ప్రభావితం చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ప్రభావం ఈ నియోజకవర్గం పైన స్పష్టంగా కనిపిస్తోంది. సీఎం జగన్ ఈ నియోజకవర్గంలో గెలుపు బాధ్యతలు పూర్తిగా పార్టీ అభ్యర్ది దాడిశెట్టి రాజా పైనే వదిలేసారు. దీంతో, తుని నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో గెలుపు ఎవరికి దక్కుతుందనేది ఆసక్తి కరంగా మారింది. వైసీపీకి రాజకీయ సమాధి కట్టే సమయం వచ్చిందని తుని టీడీపీ అభ్యర్థి యనమల దివ్య ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం రావణ కష్టం అవుతుందన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నారని, అంతా అవినీతి దోపీడితోనే ప రిపాలన సాగుతుందన్నారు. యనమల కృష్ణుడు ప్రభావం ఏమేరకు వుంటుంది? కృష్ణుడికి, రాజాకు మధ్య ఏం ఒప్పందం కుదిరిందంటూ స్థానికంగా చర్చ జరుగుతోంది. చాణ్యక్య స్ట్రాటజీ టీం తునిలో నిర్వహించిన సర్వేలో 46 శాతం ఓటర్లు టీడీపీకి అనుకూలంగానూ, వైసీపీ కేవలం 41 శాతం ఓటర్లు అనుకూలంగా మాట్లాడారు. అయితే అభ్యర్థుల వారీగా ఓటర్ల అభిప్రాయాలను సేకరించినప్పుడు యనమల దివ్యకు అనుకూలంగా 54 శాతం, దాడిశెట్టి రాజాకు అనుకూలంగా కేవలం 38 శాతం ఓటర్లు మాత్రమే మాట్లాడారు. జగన్ పాలన ఎలా వుందనే ప్రశ్నకు తుని ఓటర్లు స్పందిస్తూ బాగానే వుందని 32 శాతం, అస్సలు బాగాలేదని 59 శాతం ఓటర్లు స్పందించారు.
http://www.teluguone.com/news/content/changing-politics--yanamala-divya-as-a-victory-25-175050.html