రేవంత్ కేబినెట్ లో విజయశాంతికి స్థానం?.. కొండా సురేఖ ఊస్టింగేనా?

Publish Date:Aug 28, 2026

Advertisement

తెలంగాణ మంత్రివర్గంలో మార్పులూ, చేర్పులపై ఇప్పుడు చర్చ జోరందుకుంది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ వర్గాలలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఓ రేంజ్ లో చర్చ నడుస్తోంది.  ముఖ్యంగా ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో  రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, సనీనటి విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవ కాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.

గతకొద్ది రోజులుగా తెలంగాణలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖపై చర్యలకుసిఫారసు చేస్తూ నివేదిక కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ స్థానంలో రేవంత్ తన కేబినెట్ లోకి ఎవరిని తీసుకుంటారన్న విషయంపై చర్చ జరుగుతోంది. సీనియర్లు, పార్టీ వర్గాలలో విజయశాంతి పేరు గట్టిగా వినిపిస్తోంది. 

సామాజిక సమీకరణాలు, బీసీ మహిళా కోటాను వంటి అంశాలను పరిశీలిస్తే.. విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలే మెండుగా  ఉన్నాయంటున్నారు పరిశీలకులు.  బిసి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత కావడంతో పాటు, ఆమెకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా మహిళా ప్రాతినిధ్యంతో పాటు సామాజిక బ్యాలెన్స్ కూడా సాధించినట్లౌతుందని అంటున్నారు. 

విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో అధిష్ఠానం ఆమెకు మంత్రి పదవి హామీ ఇచ్చిందని ఆమె వర్గీయులు ఇఫ్పుడు గుర్తు చేస్తున్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో అధిష్టానం ఇచ్చిన హామీలను విజయశాంతి వర్గాలు గుర్తు చేస్తున్నాయి. హై కమాండ్  కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు.  


Changes in Revanth Cabinet, Konda Surekha, Vijayashanthi,  Minister Post,  Telangana Politics, Ramulamma, Telugu One

By
en-us Political News

  
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..!
నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి. 
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో అధికార పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
సాధారణంగా స్థానిక ఎన్నికలలో అధికార పక్షం హవా నడుస్తుంది. అయితే విపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత పులివెందుల విషయంలో మాత్రం మిగిలిన ప్రాంతాలలోలా  అధికార పార్టీ హవా అని టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవడానికి లేదు. అందుకే అధికార తెలుగుదేశం కూటమి వ్యూహాత్మకంగా పులివెందులలో పాగా వేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. 
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు, గౌరవం కల్పించడమే తమ లక్ష్యమని
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రస్తుతం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల (ముఖ్యంగా పట్టణ, నగర పాలక సంస్థల) చుట్టూ తిరుగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ ఉత్కంఠ నెలకొంది.
అవినాష్ రెడ్డి ఇల్లు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇళ్లపై జరిగిన దాడుల్లో కేవలం 24 లక్షల క్యాష్, కొన్ని డాక్యుమెంట్లు మాత్రమే దొరికాయా? లేక ఈ దాడుల వెనుక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసే పెద్ద విషయం ఏమైనా జరగబోతోందా? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది.
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.