Publish Date:May 24, 2025
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ లో పాకిస్థాన్ పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న భారతీయులు, పాక్ తో కాల్పుల విరమణ ఒప్పందం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశం పట్ల వ్యతిరేకత, ఏహ్యత ఏ స్థాయిలో వ్యక్తం అవుతోందంటే.. దేశ ప్రజలంతా ఎంతో ఇష్టపడే స్వీట్ మైసూర్ పాక్ పేరు మార్చేయాలంటూ నెట్టింట ఓ రేంజ్ లో డిమాండ్ వినిపిస్తోంది. ఈ డిమాండ్ కు అనుగుణంగా ఓ మిఠాయి వాలా వెంటనే తన దుకాణంలో విక్రయించే స్వీట్లలో పాక్ అనే పదం లేకుండా వాటి పేర్లు మార్చేశాడు. ఔను నిజంగా నెటిజనుల ప్రతిపాదన రాజస్థాన్ లోని ఓ స్ట్వీట్స్ దుకాణం యజమానికి విపరీతంగా నచ్చేసింది. అంతే వెంటనే తన దుకాణంలో విక్రయించే స్వీట్లకు పాక్ పదాన్ని తీసేసి ఆ స్వీట్లకు కొత్త పేర్లు పెట్టారు. మైసూర్ పాక్ పేరును మైసూర్ శ్రీగా మార్చేశారు.
జైపుర్‌లో గల ప్రముఖ త్యోహార్ స్వీట్స్ యజమాని ఈమేరకు తమ దుకాణంలోని స్వీట్ల పేర్లకు పలు మార్పులు చేశారు. ఒక్క మైసూర్ పాక్ పేరునే కాదు మోతీ పాక్, ఆమ్ పాక్, గోండ్ పాక్ పేర్లను కూడా మార్చేశారు. వాటికి కూడా మోతీ శ్రీ, ఆమ్ శ్రీ, గోండ్ శ్రీ అని కొత్తగా నామకరణం చేశారు. స్వర్ణ భాషం పాక్, చాందీ భాషమ్ పాక్‌ను కూడా స్వర్ణ శ్రీ, చాందీ శ్రీగా మార్చేశారు.
వాస్తవానికి స్వీట్లకు ఉన్న పేరులో పాక్ అన్న పదానికి, పాకిస్థాన్ కీ సంబంధం లేదు. పాక్ అనే పదానికి సంస్కృతంలో వండటం అని అర్ధం. అయినా ఆ పదం పాకిస్థాన్ ను గుర్తుకు తెచ్చేలా ఉండటంతో.. ఆ పదం పలకడానికీ, వినడానికి ఇష్టం లేకనే తమ దుకాణంలో ఆ స్వీట్ల పేర్లు మార్చేశానని త్యోహార్ స్వీట్స్ యజమారి అంజలీ జైన్ తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/changed-the-names-of-sweets-25-198606.html
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.