కుప్పంలో కూడా కొంప మునిగేది: చంద్రబాబు

Publish Date:Jun 4, 2019

Advertisement

 

కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో సమావేశమయ్యారు. కుప్పంలో మెజార్టీ తగ్గడానికి గల కారణాలపై ఆరా తీశారు. గతంలో 70వేలు మెజారిటీ వస్తే ఈసారి 30 వేలే వచ్చిందని ఎందుకు తగ్గిందో కారణాలను తెలుసుకోవాలని కోరారు. హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పం శివారు వరకూ నీళ్లు తెచ్చామని ఎందుకు మెజారిటీ తగ్గిందో అన్వేషించాలని టీడీపీ నేతలకు ఆదేశించారు. నియోజకవర్గంలోని కొందరు నేతల తీరు వల్ల స్థానిక ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని పలువురు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఏరియా, కోర్ కమిటీల నాయకత్వాన్ని మార్చి నియోజకవర్గ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని మెజారిటీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ట్రెండ్ మేరకే కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడ మెజారిటీ తగ్గిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల మెజారిటీ తగ్గిందని మరికొందరు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ నెలాఖరుకు తాను కుప్పం లో పర్యటించనున్నట్టు చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీలో ప్రక్షాళన కూడ చేస్తానన్నారు. మూడు నాలుగు రోజుల పాటు అక్కడే ఉంటానని బాబు పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ప్రజల కష్ట సుఖాల్లో పాల్గొంటే మెజారిటీ పెరిగేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. స్థానిక నేతల తీరు వల్ల పార్టీకి నష్టం వాటిల్లిందని కూడా బాబు అభిప్రాయపడ్డారు. అభివృద్ధి పనులే తనను  కాపాడిందని... స్థానిక నేతలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తితో కొంప మునిగేదని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. అధికారం లేని సమయంలోనే మరింత క్రమశిక్షణతో పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు.

రాష్ట్రంలో టీడీపీ ఓటమిపై కూడా చంద్రబాబు స్పందించారు. మరోఐదేళ్లపాటు అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా సైబరాబాద్ లాంటి నగరం నిర్మించేవాళ్లమని స్పష్టం చేశారు. మనం తప్పు చేయలేదు. ధైర్యంగా ముందుకెళ్దాం అంటూ కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. టీడీపీ నేతలంతా గతం మరిచి భవిష్యత్తు వైపు నడవాలని సూచించారు. చిన్నచిన్న లోపాలను సవరించుకుని భవిష్యత్ కోసం ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూనే వైసీపీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా ఒత్తిడి తేవాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.