విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. రేపు చంద్రబాబు శంకుస్థాపన

Publish Date:Apr 27, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ను  సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రపథాన నిలపాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం ఆ దిశగా కీలకమైలు రాయిని చేరుకుంది.  ప్రపంచ టెక్ దిగ్గజం  గూగుల్ తన ప్రతిష్టాత్మక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఈ మెగా ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  మంగళవారం (ఏప్రిల్ 28)  శంకుస్థాపన చేయనున్నారు. ఈ పరిణామంతో విశాఖ నగరం అంతర్జాతీయ ఐటీ మ్యాప్‌లో అత్యంత కీలకమైన కేంద్రంగా నిలవనుంది.

విశాఖ జిల్లా  తర్లువాడ సమీపంలో ఈ భారీ డేటా సెంటర్ నిర్మాణం కానుంది.  15 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో  1.25 లక్షల కోట్ల రూపాయల  భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది.  దేశ చరిత్రలోనే ఇది అత్యంత భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో   ఒకటి.  ఒక గిగావాట్ సామర్థ్యంతో నిర్మితమయ్యే ఈ హైపర్ స్కేల్ డేటా సెంటర్, కేవలం ఒక కార్యాలయంలా కాకుండా ఆసియా ఖండానికే ఏఐ సేవలకు ప్రధాన ద్వారంగా  అంటే గేట్ వేగా ఉంటుంది.  

ఈ ప్రాజెక్టు విస్తరణ కోసం తర్లువాడ, అడవివరం,  రాంబిల్లి ప్రాంతాల్లో   600 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. గూగుల్ భాగస్వామ్యంతో పాటు అదానీ కనెక్ట్స్, ఎయిర్‌టెల్ నెక్స్‌ట్రా వంటి దిగ్గజ సంస్థలు కూడా ఈ డిజిటల్ ఎకోసిస్టమ్ నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాయి. రాష్ట్రంలో సుమారు 6.5 గిగావాట్ల సామర్థ్యంతో మల్టీ గిగావాట్ డిజిటల్ హబ్‌ను అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి  లక్ష్యం. ఈ దిశగా గూగుల్ రాక తొలి మెట్టుగా చెప్పవచ్చు.

గతంలో హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ రూపురేఖలు మార్చిన చంద్రబాబు..  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా  అదే తరహా ఐటీ విప్లవాన్ని విశాఖ వేదికగా ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్  విధానం కారణంగానే గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నాయనడంలో సందేహం లేదు. విశాఖ తీరంలో అందుబాటులోకి రానున్న సబ్-సీ కేబుల్ వ్యవస్థ ఈ డేటా సెంటర్ల నిర్వహణకు అత్యంత అనుకూలంగా మారనుంది.

ఈ భారీ పరిశ్రమ ద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ,  డేటా సైన్స్ వంటి అత్యాధునిక  రంగాల్లో వేలాది నిపుణులకు ఉపాధి దొరుకుతుంది. నేరుగా లభించే ఉద్యోగాలతో పాటు అనుబంధ రంగాలైన సర్వర్ తయారీ, కూలింగ్ టెక్నాలజీ, నెట్‌వర్కింగ్ వంటి విభాగాల్లో కూడా పరోక్షంగా వేలాది మందికి లబ్ధి చేకూరనుంది.

రాబోయే రోజుల్లో విశాఖపట్నం కేవలం పోర్టు సిటీగానే కాకుండా డేటా సిటీ గా  గుర్తింపు పొందనుంది. గూగుల్ రాకతో ఇతర గ్లోబల్ స్టార్టప్‌లు, సెమీకండక్టర్ కంపెనీలు కూడా విశాఖ వైపు చూసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన గ్రీన్ ఎనర్జీ  సరఫరాకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తయితే, అంతర్జాతీయ స్థాయిలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగై విశాఖ ఐటీ రంగం పరుగులు తీస్తుందని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
సాంకేతిక నిపుణులకు ఆండ్రాయిడ్ అందించే డెవలపర్ ఆప్షన్స్ ఒక అద్భుతమైన వరం. ఐఫోన్‌లో ఇటువంటి నియంత్రణ పొందాలంటే ఎక్స్-కోడ్ వంటి పరికరాల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆండ్రాయిడ్‌లో నేరుగా ఫోన్ నుండే యానిమేషన్ వేగాన్ని మార్చుకోవడం.. బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ నియంత్రించడం వంటి వాటి ద్వారా ఫోన్ వేగాన్ని పెంచుకోవచ్చు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం ఈసారి ఆసక్తికర సంకేతాలను ఇస్తోంది.
అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) అంచనా ప్రకారం, ఒకవేళ ఈ దిగ్బంధనం ఇలాగే కొనసాగితే యూరప్ వద్ద ఉన్న నిల్వలు మరో ఆరు వారాలకు సరిపోవడమే గగనం. ఇది చరిత్రలోనే అతిపెద్ద ఇంధన భద్రతా సంక్షోభంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారతీయ సంస్కృతిలో మాతృదేవో భవ అనే వాక్యానికి అక్షర రూపం ఇచ్చారు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సోదరులు.
ఐటీ వర్సెస్ ఏఐ అనేది ఒక యుద్ధంలా కాకుండా, ఒక పరిణామంలా చూడాలంటారు నిపుణులు. నిజం చెప్పాలంటే.. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు, కానీ ఉద్యోగాల స్వ‌రూప‌- స్వభావాలు మారిపోతాయంటున్నారు.
తిరుపతి జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఒక ఘటనపై చంద్రబాబు స్పందించిన తీరు సర్వత్రా ప్రశంసలందుకుంటోంది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అనుచరులు టోల్ ప్లాజా సిబ్బందిపై దౌర్జన్యానికి దిగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కఠినంగా స్పందించారు.
హైదరాబాద్ నగరంలో మళ్ళీ ఇంధన సంక్షోభం మొదలైంది.
గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 7 శాతం అధికం. రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ ఆదాయం 2025-26 సంవత్సరంలో రూ.40,209 కోట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పడిన అనంతరం తొలిసారిగా రూ. 40 వేల కోట్ల ఆదాయానికి చేరుకోవడం ఒక కొత్త రికార్డు.
ఈ కాల్పుల ఘటనను నెటిజనులు ఒక ప్రణాళిక మేరకు జరిగిన స్టేజ్డ్ డ్రామాగా అభివర్ణిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాల కోసం, పడిపోతున్న తన ప్రతిష్ఠను పెంచుకోవడం కోసం ఆడిన నాటకంగా నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. కాల్పులు జరిగిన సమయంలో అధ్యక్షుడు ట్రంప్ కంటే ముందు ఉపాధ్యక్షుడు జెడి వెన్స్‌ను భద్రతా సిబ్బంది అక్కడి నుండి తరలించడం ఏమిటని నిలదీస్తున్నారు.
చైనా గత 15 నెలల కాలంలో దాదాపు 100 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ట్రెజరీలను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే దీన్ని కేవలం ఒకేసారి చేసిన విక్రయంగా చూడలేము. బాండ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత వాటిని తిరిగి పునరుద్ధరించకుండా, ఆ నిధులను ఇతర రూపాల్లోకి మళ్లించడం చైనా వ్యూహం.
మాసాయిపేట సమీపించగానే ఇంజిన్ భాగం నుంచి పొగ, మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్, క్లీనర్ ను అప్రమత్తం చేసి బస్సు నుంచి బయటకు వచ్చేశాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. సుమారు 50 మందితో కూడిన ప్రత్యేక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అటవీ శాఖ సిబ్బందితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ విభాగం, అగ్నిమాపక దళం సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోనికి తీసుకువచ్చారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర విస్తరించిన మంటలను అదుపు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.