మొగుడు కొట్టినందుకు కాదు
Publish Date:Jan 4, 2013
Advertisement
‘మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకే బాధ’ అన్నట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిన్న 1500 కి.మీ. పాదయాత్ర పూర్తిచేయడం, దానిని మీడియాలో ప్రముఖంగా చర్చించి, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేకర్ రెడ్డి తో పోల్చుతూ విశ్లేషణలు వ్రాయడం, ఒకవైపు తమ అధినేత జైల్లో మగ్గుతుంటే మరో వైపు ఈవిధంగా తెలుగు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు తమనాయకుడి సాధించిన ఘనవిజయానికి సంభరాలు చేసుకోవడం చూస్తున్న, కొందరు వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ నేతలు సహజంగానే భగభగమని మండిపోయారు. తమ నాయకురాలు ఆరోగ్య కారణాలచేతనో లేక తెలంగాణావాదులకు జడిసో మధ్యలోనే పాదయాత్రకి ఫుల్ స్టాప్ పెట్టేస్తే, 63 ఏళ్ళ వయసులో కూడా చంద్రబాబు ఇంకా పాదయాత్ర కొనసాగిస్తుండటం వై.యస్సార్ పార్టీ నేతలకి అసూయ కలిగించడం సహజమే. మానాయకుడు మండు వేసవిలో మహాప్రస్థానం సాగిస్తే, మీ నాయకుడు చక్కటి చలికాలం ఎంచుకొని, తాపిగా అడుగులో అడుగేసుకొంటూ కబుర్లు చెప్పుకొంటూ, మీకోసం వస్తున్నానని ఎన్ని కి.మీ.లు నడిచినా మా నాయకుడి పాదయాత్రకు సాటి రాదు అని తీర్మానించేశారు. అప్పుడు రాజశేకర్ రెడ్డి ప్రజలకోసం (?) పాదయాత్ర చేయగా, ఇప్పుడు చంద్రబాబు కేవలం రికార్డు సృష్టించడానికే చేస్తున్నట్లు కూడా వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ నేతలు కనిపెట్టి ప్రజలకు ఆ విషయం తెలియజేసారు. కోటి సంతకాలతో జైల్లో ఉన్న తమ నేతని విడిపించుకోవచ్చనే ఒక సరికొత్త ఐడియాని కనిపెట్టిన వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ నేతలకి 63 సం.ల వయసుగల వ్యక్తి 1500 కి.మీ. పాదయాత్ర చేయడం ఒక పాత ఐడియాగానే కనిపించడంలో వింతేమి ఉంది.
http://www.teluguone.com/news/content/chandrababu-padayatra-24-20216.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





