Publish Date:Sep 10, 2026
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యధిక కాలం పాటు రాజకీయాల్లో కొనసాగుతున్న నాయకులలో ఒకరు. ఆయన ప్రస్తుతం నాలుగవసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే వ్యక్తిగత స్థాయిలో, సరిగ్గా మూడేళ్ల కిందట అప్పటి జగన్ ప్రభుత్వం ఆయనను అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేసింది. ఏడు పదుల వయస్సులో ఈ అరెస్టు సమయంలో చంద్రబాబు క్లిష్టపరిస్థితులను ఎదుర్కొనేలా చేసిందని చెప్పాలి. ఏకంగా 53 రోజుల పాటు ఆయనను రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో నిర్బంధించింది.
ఐసోలేటెడ్ సెల్ లో, కనీస సౌకర్యాలు కూడా ఇవ్వకుండా వేధించింది అప్పటి జగన్ సర్కార్. నాటి రోజులను తాజాగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. సామాజిక మాధ్యమ వేదికపై తనను అక్రమంగా అరెస్టు చేసిన నాటి రోజులను గుర్తు చేసుకుంటూ షేర్ చేసిన పోస్టులో తనను అరెస్టు చేసిన తీరు దారుణమనీ పేర్కొన్న చంద్రబాబు.. అయితే ఈ ఘటన తనను ఏ మిత్రం కుంగదీయలేదన్నారు. తనను అరెస్టు చేయించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి తనకు ఒక్క నిమిషం కంటే ఎక్కువ సమయం పట్టదన్న ఆయన అయితే తన విధానం అది కాదన్నారు.
తనను చాలా మంది మెతక అనీ, కఠిన నిర్ణయాలు తీసుకోలేని మృదు స్వభావిననీ చెబుతుంటారు. కానీ వాస్తవానికి తాను చేసే ప్రతి పనీ తెలుగు ప్రజల శ్రేయస్సు, సమాజ హితం కోసమే ఉండాలి అని భావిస్తానని పేర్కొన్నారు. రాజకీయాలు అంటే సవాళ్లు విసురుకోవడం, తొడలు కొట్టుకోవడం కాదన్నారు. అలాగే ఎన్నికల ఫలితాల ఆధారంగా ఒకరినొకరు అరెస్టు చేయించుకోవడం కూడా కాదన్నారు. తాను ప్రతీకార రాజకీయాలకు దూరంగా ఉంటూ సామాజిక హితం గురించి ఆలోచిస్తానని పేర్కొన్నారు.
[Chandrababu Naidu, AP Politics, YS Jagan Mohan Reddy, Revenge Politics, Telugu Desam Party, Andhra Pradesh News, Telugu One]
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-naidu-25-231135.html
Publish Date:Sep 10, 2026
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.