షాబాద్ హంతకుడికి జగన్ కి పోలికలు.. చంద్రబాబు సెన్సేషనల్ కామెంట్స్!

Publish Date:Jul 11, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబునాయుడు వైసీపీకి ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన కనీస లక్షణాలు లేవని విమర్శించారు. గొడ్డలి, ఫేక్ ప్రచారాలే వైసీపీ అస్త్రాలన్న చంద్రబాబు.. వైసీపీ చరిత్ర మొత్తం రక్త చరిత్రేనన్నారు.  తెలంగాణ షాబాద్ లో ఆరుగురిని అత్యంత కిరాతకంగా చంపిన రాజ్ కుమార్ కు, సొంత బాబాయిపై గొడ్డలి వేటు, సొంత తల్లీ, చెల్లిని గెంటేసిన జగన్ కూ మనస్తత్వ పరంగా పోలీకలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 తెలంగాణలో  ఒక వ్యక్తి తనపై పోక్సో   కేసు పెట్టిందన్న కక్షతో బాధితురాలితో పాటు ఆమె కుటుంబాన్ని, అలాగే తనకు సహకరించలేదనే కోపంతో సొంత కుటుంబాన్ని కలిపి మొత్తం ఆరుగురిని అత్యంత క్రూరంగా హతమార్చిన వ్యక్తికీ, సరిగ్గా అలాగే..  సొంత బాబాయిని గొడ్డలితో నరికి చంపడం, కన్నతల్లి మరియు చెల్లిని దూరం పెట్టే విషయంలో జగన్ ప్రవర్తించిన తీరుకూ చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు.  నేర ప్రవృత్తిని, దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యపరచాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు.  

కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో కేవలం ఒకే ఒక్క వ్యక్తి అవినీతి దాహానికి లక్షల కోట్ల రూపాయల విలువైన ఆంధ్రప్రదేశ్ సహజ సంపద పూర్తిగా ఆవిరైపోయిందని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ నెపంతో యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని దుయ్యబట్టారు. బ్రహ్మణీ స్టీల్స్‌కు గతంలో కేటాయించిన భూములను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇప్పటికే పూర్తిగా వెనక్కి తీసుకుందని,  ఓబులాపురం మైనింగ్ అంశంపై విచారణ ఇంకా ముగియలేదని చెప్పిన చంద్రబాబు. జగన్   స్వార్థపూరిత నిర్ణయాల వల్ల ఎంతోమంది ఐఏఎస్  అధికారులు జైలుపాలయ్యారనీ, ఎంతోమంది వ్యాపారవేత్తలు సర్వనాశనమయ్యారని వివరించారు. 

వైసీపీ నైజాన్ని చంద్రబాబు  హిట్, రన్ అండ్ ఎస్కేప్ (కొట్టడం, పారిపోవడం, దాక్కోవడం) గా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏదో ఒక విధ్వంసం సృష్టించడం, ఆ వెంటనే పక్క రాష్ట్రమైన కర్ణాటకలోని బెంగళూరు ప్యాలెస్‌కు వెళ్లి తలదాచుకోవడం   అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే భయంతోనే పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలను బెదిరించి, పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, పోలవరం ప్రాజెక్టు, వెలిగొండ ప్రాజెక్టులు వేగంగా పూర్తికావస్తుండటంతో ఈ గొడ్డలి పార్టీలో తీవ్రమైన టెన్షన్ మరియు భయం మొదలైందని చంద్రబాబు పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న వ్యక్తిత్వ హననంపై చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాను వాడుకుని మహిళలను బ్లాక్ మెయిల్ చేయడం, తప్పుడు పోస్టులతో సమాజంలో అలజడి సృష్టించడం అత్యంత ప్రమాదకరంగా మారిందన్నారు. ఇలాంటి ఫేక్ ప్రచారాలను, అసత్య పోస్టులను పూర్తిగా కట్టడి చేసేందుకు త్వరలోనే ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్  ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు.  

Chandrababu makes sensational comments, Chandrababu Naidu, YS Jagan Mohan Reddy, YSRCP Axe Party, Andhra Pradesh Politics, Social Media Task Force AP, Kadapa Steel Plant Corruption

By
en-us Political News

  
సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ తీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా రంజక పాలనను పూర్తిగా గాలికొదిలేసి కేవలం ప్రతిపక్షాలపై నిందలు వేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.
పరిశ్రమల పేరుతో యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి, వేల ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ఇలా కారుచౌకగా కేటాయించడంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, భూములు పొందిన తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి అక్కడ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పరిశ్రమ పెట్టకపోగా, ఈ ప్రభుత్వ భూములను జాతీయ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి దాదాపు 350 కోట్ల రూపాయల మేర రుణాలు పొంది బ్యాంకులను సైతం మోసం చేశారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
ముందస్తు ఎన్నికల ప్రచారాలపైనా సీఎం స్పష్టత ఇచ్చారు. కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరో ఏదో అనుకున్నారని తాము ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు.
నిన్న మొన్నటి వరకూ వైసీపీకి, వివాదాస్పద యూట్యూబర్ ప్రశ్న రావణ్ కు అనుకూలంగా గళమెత్తిన జడ శ్రవణ్ కుమార్ అంత లోనే.. ఇలా యూటర్న్ తీసుకుని వైసీపీపై విరుచుకు పడటం విశేషం. తనకు వైసీపీ ఫండింగ్ చేస్తోందని వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చే క్రమంలో ఆయన వైసీపీ దోపిడీని ఎండగట్టారు. వైసీపీ తనకు ఫండింగ్ చేయడమేంటని ప్రశ్నించిన ఆయన ఆ పార్టీ నేతలు ఎంగిలి మెతుకులను కూడా వదలకుండా దోచేసుకుంటారని దుయ్యబట్టారు. జగన్ పాలనా కాలమంతా దోపిడీ రాజ్యమేలిందని విమర్శలు గుప్పించారు.
మొత్తం మీద రేవంత్ సభలో జగన్ ఫ్లెక్సీలు, బ్యానర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా తెలంగాణలో కేటీఆర్ సభలోనూ జగన్ ఫ్లెక్సీలు వెలిసన సంగతి తెలిసిందే. సొంత రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టడంలో స్తబ్దుగా ఉంటున్న వైసీపీ శ్రేణులు తెలంగాణలో మాత్రం ఇతర పార్టీల సభలలో తమ అధినేత ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది.
మాజంలో వివాదాలకు కారణమైన ఒక వ్యక్తికి వైసిపి బహిరంగంగా మద్దతు ప్రకటించడం, మరీ ముఖ్యంగా మత విద్వేషాలు ప్రజ్వరిల్లేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి.. తనను తాను రావణుడినని చెప్పుకున్న వ్యక్తిని వత్తాసుగా వైసీపీ నిలవడం కోరి ప్రజా వ్యతిరేకతను కొని తెచ్చుకోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈటల కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ గళం ఎత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఆరోపణలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో ఈటల మళ్లీ కారెక్కేస్తారా అన్న ప్రచారం అప్పట్లో జోరందుకుంది. ఆ తరువాత సద్దుమణిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అత్యంత సంక్లిష్టమైన మరియు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి.
ఉపా కింద నమోదైన ఈ కేసులో నిందితుడి తరఫున న్యాయపోరాటం చేసేందుకు వైసీపీ పార్టీ లీగల్ సెల్ విభాగానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఈ సర్జరీల తరువాత పవన్ కల్యాణ్ కనీసం నెల రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య చోటుచేసుకున్న వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల పరంపరపై మధుసూదన్ రెడ్డి, ప్రజాప్రతినిధుల మధ్య కేవలం రాజకీయ పోరాటం ఉంటే ఫర్వాలేదని, కానీ ఇరువర్గాలు కులాల ప్రస్తావన తెస్తూ కుంపట్లు రాజేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
రావణ్ అరెస్టుపై వైసీపీ, ఇతరులు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరస్థులకు వైసీపీ ఇలా బాహాటంగా మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో, సమాజానికి ఎంతటి ముప్పుగా పరిణమించాడో ప్రజలంతా గమనించాలని కోరారు.
తిపక్షాల నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టే విషయంలో జనసేన ఏమంత యాక్టివ్ గా లేదన్నది వాస్తవమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఈ విషయంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పార్టీ లీడర్లు, క్యాడర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.