Publish Date:Jul 16, 2022
రాజకీయాల్లో బంధాలు, బంధుత్వాలకు అంతగా ప్రాధాన్యం కనిపించదు. ఒకే కుటుంబంలోని వ్యక్తులు వేర్వేరు పార్టీల్లో ఉండొచ్చు. వేర్వేరు పార్టీల్లోని వేర్వేరు వ్యక్తులు అన్నదమ్ముల్లా మసలుకోనూ వచ్చు. వాస్తవానికి రాజకీయ నేతలందరిదీ ఒకే కుటుంబం.. అదే రాజకీయ కుటుంబం. ఈ ఉపోద్ఘాతం అంతా దేనికంటే.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తమ్ముడు. అవును.. మీరు సరిగ్గానే విన్నారు. చంద్రబాబు నాయుడికి విజయసాయిరెడ్డి వరసకు తమ్ముడు అవుతారు. రాజకీయంగా అనుక్షణం ఉప్పు నిప్పులా విమర్శలు, ఆరోపణలు చేసుకునే చంద్రబాబు- విజయసాయిరెడ్డి మధ్య బంధుత్వం ఉందా అన్న ఆశ్చర్యం అనవసరం. ఎందుకంటే ఇది నిజంగా నిజం. ఇలాంటి ఆసక్తికరమైన విషయాన్ని విజయసాయిరెడ్డే స్వయంగా బయటపెట్టారు.
అది కూడా చంద్రబాబును, టీడీపీ నేతలను విమర్శించే క్రమంలోనే తమ బంధుత్వాన్ని విజయసాయి వెల్లడించడం గమనార్హం. చంద్రబాబు- విజయసాయిరెడ్డి మధ్య బంధుత్వం ఎలా ఏర్పడిందంటే.. విజయసాయి భార్య సోదరి కుమార్తెని దివంగత సీఎం, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు తారకరత్న పెళ్లి చేసుకున్నారు. దాంతో చంద్రబాబు నాయుడు తనకు వరసకు అన్నయ్య అవుతారని విజయసాయిరెడ్డి వెల్లడించారు. అరబిందో సంస్థకు, అదాన్ కంపెనీకి విజయసాయిరెడ్డి బంధువు ఒకరు కామన్ డైరెక్టర్. దీంతో అడాన్ కంపెనీతో తనకు సంబంధాలు ఉన్నాయని చంద్రబాబు, ఎల్లో మీడియా అసత్య ఆరోపణలు చేస్తున్నట్లు విజయసాయి ఫైరవుతున్నారు.
ఒక డైరెక్టర్ ఎన్నో సంస్థలకు డైరెక్టర్ గా ఉన్నంత మాత్రాన ఆయా కంపెనీలన్నీ ఆయనవి అయిపోతాయా? అనేది విజయసాయి ప్రశ్న. చంద్రబాబు తనకు వరసకు అన్న అవుతారని.. అలా అయితే.. చంద్రబాబు ఆస్తులన్నీ నావే అవుతాయా? అనేది విజయసాయి ప్రశ్న. రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ అఫీషియల్ ట్విటర్ వేదికగా విజయసాయి రాసుకొచ్చారు.
ఉదయం లేచింది మొదలు టీడీపీపైన, చంద్రబాబు, లోకేష్ పైన విమర్శలు, ఆరోపణలు చేసే విజయసాయిరెడ్డికి చంద్రబాబు అన్నయ్య అవుతారన్న వాస్తవాన్ని విమర్శిస్తూనే బయటపెట్టారు. ఇంతకీ విజయసాయి ఇప్పుడీ విషయాన్ని ఎందుకు బయటపెట్టినట్టు. ఒక వైపు విమర్శలు గుప్పిస్తూనే, మరో వైపు అన్న అంటూ బంధుత్వాన్ని ఎందుకు కలుపుకున్నట్లు అన్న ప్రశ్నలకు ముందు ముందు తెలుగుదేశంతో ఏ రాజకీయ అవసరాలు ఉంటాయో అన్న సందేహమే కారణమని సామాజిక మాధ్యమంలో విజయసాయిపై సెటైర్లు పేలుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-is-my-big-brother-says-vijayasai-39-139888.html
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
Publish Date:Oct 31, 2026
రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. ప్రశాంతంగా సాగేనా.?