తలైవా మాటలు టీడీపీకి మేలు

Publish Date:Apr 29, 2023

Advertisement

ప్రముఖ సినీ నటుడు రజనీ కాంత్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరైనప్పటికీ తెలుగుదేశం పార్టీకి మేలు జరిగే మాటలు చాలానే మాట్లాడారు. చంద్రబాబు వల్లె హైటెక్ సిటీ నిర్మాణం జరిగింది. ఇటీవల తాను హైదరాబాద్ వెళ్లినప్పుడు న్యూయార్క్ నగరాన్ని చూసిన అనుభూతి కలిగింది. 
చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు అని తలైవా పొగడ్తల వర్షం కురిపించారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు సమీపంలోనే ఉండటం రజనీ కాంత్ ప్రసంగం తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయ్యాయి. 


రజనీకాంత్ రాజకీయాలలో రావాలని తమిళ ప్రజలు చాలా సంవత్సరాల నుంచి కోరుకుంటున్నారు. బాబా చిత్రం రజనీ  చివరి చిత్రం అని అందరూ అనుకున్నారు. తమిళనాడులో రజనీకాంత్ నటించిన ముత్తు సినిమా చాలా పేరు తీసుకువచ్చింది. ఆయన సినిమాలు ఓ వైపు విజయవంతం కావడం మరో వైపు రజనీ రాజకీయ ఆగమనంపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోవడం పారలల్ గా జరిగిపోయాయి. అయినా రాజకీయాలకు ఎప్పటికప్పుడు పుల్ స్టాప్ పెట్టాడు. సినిమాల్లో బిజీగా ఉంటూనే తమిళ ప్రజలతో మమేకమయ్యేవారు.  రజనీ కురిపించిన ప్రేమానురాగాల కోసం తమిళ ప్రజలు పరితపించేవారు. ప్రజలతో రజనీకి పెరిగిన బాండింగ్ వల్లే రజనీ రాజకీయాల్లో రావాలన్న ఆలోచనకు అంకురార్పణ జరిగింది. ఆయన ఒకసారి హైదరాబాద్ వచ్చిన సమయంలో బీపీ విపరీతంగా పెరిగి జూబ్లిహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు రజనీ రాజకీయాల్లో వచ్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. నాటి నుంచి రాజకీయాల గురించి మాట్లాడని ఆయన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో హాజరై చంద్రబాబును ఆకాశాన్నెత్తేశారు. 
చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఏపీ నెంబర్ వన్ కావడం ఖాయమన్న గ్యారంటీ ఇచ్చారు రజనీకాంత్. రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని, రాజకీయాలు మాట్లాడవద్దని అనుభవం చెబుతుందని రజనీ మరో మారు రాజకీయాల పట్ల తన అయిష్టతను వ్యక్తం చేశారు. 
చంద్ర బాబుతో తనకు 30 ఏళ్ల ఫ్రెండ్ షిప్ ఉందని, దేశ , విదేశాల్లో పలుకుబడి ఉన్న వ్యక్తి అని పొగడ్తలతో ముంచెత్తారు. ఫలానా పార్టీకి ఓటు వేయాలి, ఫలానా అభ్యర్థిని గెలిపించాలని రజనీకాంత్ చెప్పకపోయినా చంద్రబాబును అభినందించడం టీడీపీకి మేలు జరిగినట్టయ్యింది. 

By
en-us Political News

  
జాతీయ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడెక్కుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కాంగ్రెస్ న్యాయపోరాటానికి దిగింది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
ప్రస్తుతం మార్కెట్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి
అర్థశాస్త్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి విజేతల ప్రకటన వెలువడింది.
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ
సికింద్రాబాద్‌లోని బొల్లారం చిన్నారి మోజెస్ అరెలియా కిడ్నాప్, హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.