నేడు ఢిల్లీకి చంద్రబాబు!
Publish Date:Oct 7, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రెండు రోజుల పాటు హస్తినలో పర్యటించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ రోజు వామపక్ష ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో జరిగే సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రధాని మోదీతో సమావేశం అవుతారు.అలాగే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తోనూ భేటీ అవుతారు. ఇక రేపు హోంమంత్రి అమిత్ షా, మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు భేటీ అవుతారు. ఈరోజు రాత్రి 8 గంటలకు చంద్రబాబు ఎంపీలకు విందు ఇవ్వనున్నారు. చంద్రబాబు రేపు (మంగళవారం) ఉదయం 11.30 గంటలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర మంత్రి పియూష్ గోయల్, 5.30 గంటలకు హర్ దీప్ సింగ్ పూరిలతో భేటీ అవుతారు. మంగళవారం రాత్రి 8 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఆ తర్వాత కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ అవుతారు.
http://www.teluguone.com/news/content/chandrababu-going-to-delhi-25-186381.html





