దేశంలో అత్యంత శక్తి మంతుడి గా చంద్రబాబు 

Publish Date:Nov 13, 2024

Advertisement

దేశంలో రాజకీయంగా ప్రధాని నరేంద్రమోదీ అత్యంత శక్తిమంతుడిగా ఉన్నట్లు ఇండియా టుడే ప్రకటించింది.  ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత అత్యంత శక్తిమంత నాయకుల్లో  ఐదో  స్ఠానంలో  నిలిచారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్, హోంమంత్రి అమిత్‌షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఉన్నట్లు తెలిపింది.దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత శక్తిమంతుడిగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తింపు పొందారు. 2019 ఎన్నికల్లో ఓటమితో రాష్ట్రంలో అధికారం కోల్పోయి, జైలుకెళ్లినా 2024 ఎన్నికల్లో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బలమైన పట్టు సాధించారు. సొంతంగా 16 మంది లోక్‌సభ సభ్యులు, కూటమిపార్టీలతో కలిపి రాష్ట్రంలో 21 మంది ఎంపీలను గెలిపించుకొని ఎన్డీఏలో తెదేపాను రెండో  అతి పెద్ద పెద్దపార్టీగా నిలపగలిగారు. దేశంలో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రుల్లో అత్యంత సీనియర్‌గా ఉన్న చంద్రబాబు, రాష్ట్ర పరిపాలనపైనా తనదైన ముద్రచూపుతూ ముందుకెళ్తున్నారు. తర్వాతి స్థానాల్లో బిహార్‌ సీఎం నీతీశ్ కుమార్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం స్టాలిన్, బంగాల్​ సీఎం మమతాబెనర్జీ తదితరులున్నారు.

By
en-us Political News

  
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలు ఇప్పటికీ దేశంలోని అనేక రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచాయన్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవంతో, భవిష్యత్తులో అమరావతిని హైదరాబాద్‌ను మించిన ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర వాసులకు హామీ ఇచ్చారు.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రులకు మరింత ప్రాధాన్యత ఉన్న శాఖలను అప్పగించాలని మోడీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలుగు సమాజం మీద తెలుగేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ముద్ర ఎన్నటికి చెరిగిపోనిది. నటుడిగా అయన కృషి అజరామరం. రాజకీయ నాయకుడిగా అయన 14 ఏళ్ల ప్రస్థానంలో అయన ప్రభావం మహత్తరం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేయడంతో పాటు, తెలుగు సమాజంలో ఫ్యూడల్ వ్యవస్థలను నిర్మూలించి, అట్టడుగు వర్గాల సామాజిక, రాజకీయ ఉన్నతికి తోడ్పడం లో ఎన్టీఆర్ చూపించిన చొరవ నభూతో నభవిష్యతి.
ఈ తీర్మానంలో ప్రధానంగా ప్ర‌స్తావించిన సెక్ష‌న్ 5 స‌వ‌ర‌ణ అత్యంత కీల‌కం. 2014 ఏపీ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలోని సెక్ష‌న్ ఐదు ప్ర‌కారం.. హైద‌రాబాద్ ప‌దేళ్ల పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉంది. ఆ త‌ర్వాత ఏపీకి కొత్త రాజ‌ధాని ఉండాల‌ని ఉంది. కానీ, దాని పేరు అమ‌రావ‌తి అని ఎక్క‌డా స్ప‌ష్టంగా లేదు. ఈ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ చేసి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అనే ద‌గ్గ‌ర అమ‌రావ‌తి అనే ప‌దాన్ని చేర్చాల‌ని.. కేంద్రాన్ని కోరుతూ.. అసెంబ్లీ శనివారం తీర్మానం చేసింది.
శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ, దానికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత కొన్నేళ్లుగా రాజధాని విషయంలో నెలకొన్న గందరగోళానికి శాశ్వతంగా స్వస్తి పలకడమే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
తాజాగా కాకినాడ జిల్లాలో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల కారణంగా ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివకాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా వడ్డాదిమాడుగుల గ్రామానికి చెందిన 22 ఏళ్ల మహమ్మద్ బషీర్ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి సెంటిమెంట్లు బాగా ఎక్కువ‌. ఎందుకంటే ఆ కుటుంబం ఎదిగిందే ఇలాంటి సెంటిమెంట్ల ద్వారా.
తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్గీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కొత్తపార్టీ స్థాపనకు రంగం సిద్దం చేసుకున్నారు.
కేంద్రమంత్రి పెమ్మ‌సాని, అంబ‌టి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది
భేటీ అనంతరం అంబటి రాంబాబు ముద్రగడపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన పట్టుదల, రాజకీయాలలో నిజాయితీ, విలువలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను ప్రస్తుతించారు. తమ మధ్య జరిగిన ఈ భేటీలో పలు రాజకీయ, సామాజిక అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు.
తెలుగువన్ వాస్తవ వేదిక సంచికలో ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఈ నేపథ్యంలో జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.