చంద్రబాబు యాత్రకి బ్రేకులే బ్రేకులు

Publish Date:Aug 30, 2013

Advertisement

 

చంద్రబాబు క్రిందటి ఆదివారం విజయనగరం జిల్లా నుండి చేప్పట్టాలనుకొన్నఆత్మగౌరవ యాత్రను తెదేపా నేతల సూచన మేరకు వాయిదా వేసుకొన్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేనెల 1న గుంటూరు జిల్లా నుండి యాత్రకు సిద్దమవుతుంటే తెదేపా నేత పయ్యావుల కేశవ్ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన యాత్ర చెప్పటడం అంత మంచిదికాదని సూచించారు.

 

ఏపి.ఎన్.జి.ఓ సంఘ అద్యక్షుడు అశోక్ బాబు కూడా ఆయనకు అదేవిధంగా సలహా ఇచ్చారు. రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ ఆయన ఏవిధంగా లేఖ ఇచ్చారో, అదేవిధంగా ఇప్పుడు సమైక్యాంధ్ర కోరుతూ ఒక లేఖ ఇచ్చి యాత్ర మొదలుపెడితే ఆయనకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని సలహా ఇచ్చారు. విభజనకు అనుమతించిన చంద్రబాబు ఇప్పుడు ఆత్మగౌరవం గురించి మాట్లాడటం అనుచితమని అశోక్ బాబు అన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ఈ సమయంలో ఆయన యాత్ర చేప్పటడం అంత మంచిది కాదని, అందువల్ల యాత్ర విరమించుకోవడం మేలని చంద్రబాబుకి సలహా ఇచ్చారు. ఈ పరిస్థితులు అన్నితెలిసి యాత్రకు బయలుదేరదలిస్తే, అందుకు సిద్దపడే రావడం మేలని సలహా ఇచ్చారు. ఆయన ఇప్పటికీ రాష్ట్ర విభజనకే మొగ్గు చూపుతునట్లయితే, రానున్న ఎన్నికలలో ప్రజలే తగిన గుణపాఠం చెపుతారని అశోక్ బాబు అన్నారు.

 

ఈవిధంగా ఒకరి తరువాత మరొకరు చంద్రబాబు యాత్రను వ్యతిరేఖిస్తుండటంతో అసలు ఆయన యాత్ర మొదలుపెడతారా లేదా అనే విషయంపై పార్టీ శ్రేణులలో కూడా సందిగ్ధం నెలకొంది.

 

దీనిని బట్టి గతంలో ఆయన పాదయాత్ర చేసిప్పటి పరిస్థితులకి నేటికీ చాలా తేడా వచ్చినట్లు అర్ధం అవుతోంది. అప్పుడు ఆయన తెలంగాణకు అనూకలంగా లేఖ ఇచ్చినప్పటికీ, ఈవిధంగా పార్టీలో కానీ, ప్రజల నుండి కానీ వ్యతిరేఖత కానరాలేదు. బహుశః ఆయన లేఖ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేస్తుందని ఎవరూ విశ్వసించక పోవడం వలననే అప్పుడు ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోకపోయి ఉండవచ్చును. కానీ, రాష్ట్ర విభజన అనివార్యంగా కనబడుతున్నఈ తరుణంలో  అందుకు అనుకూలంగా లేఖ ఇచ్చారనే కాంగ్రెస్, వైకాపాల ప్రచారం వలన చంద్రబాబు యాత్రకి అభ్యంతరాలు ఎదురవుతున్నాయి.    

 

By
en-us Political News

  
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి కమిటీల్లో పల్నాడు జిల్లా నేతలకు సముచిత ప్రాధాన్యత దక్కింది.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.