ఆయనకీ నిద్రలో కూడా అవే ఆలోచనలట!

Publish Date:Mar 6, 2013

Advertisement

 

గత ఐదు నెలలుగా నిర్విరామంగా పాదయాత్రలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకి నిద్రలోకూడా అవే ఆలోచనలని చెప్పారు. అంటే కాదు మెలుకువగా ఉన్నపుడు కూడా అవే ఆలోచనలుట! అపార్ధం చేసుకోవద్దు, ప్రజల సమస్యల గురించే ఆ ఆలోచనలుట.

 

మెలకువగా ఉన్న, నిద్రపోతున్నా ప్రజల సమస్యలే తన మెదడును ఆక్రమిస్తున్నాయని ఆయన చెప్పారు. అందువల్ల ఈ సమస్యలన్నిటినీ ఒకేసారి పరిష్కరించి పడేసేందుకు అప్పుడే ఆయన  చాలా ప్రణాలికలు కూడా సిద్దం చేసుకోన్నానని ఇటీవల పాదాయత్రలో ప్రజలకు తెలిపారు. ఇక, ప్రజలు కూడా సిద్దమయితే వెంటనే అన్ని సమస్యలను తానూ చక చకా పరిష్కరించేయదలుచు కొన్నట్లు  చెప్పారు.

 

ఇదివరకు అధికారంలో ఉన్నపుడు ప్రజల మైండ్ సెట్ మారాలని చెపుతూ వచ్చిన చంద్రబాబు పాదయాత్ర మొదలుపెట్టిన తరువాత ఇప్పుడు తన మైండ్ సెట్ పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ఇప్పుడు తానూ మారిన మనిషినని ఆయన అన్నారు.

 

ఇక తన జీవితం సర్వస్వం ప్రజలకే అంకితం అని చెప్పారు. అసలు మన స్వంత బంధువులు, స్నేహితులే మన సమస్యలని పట్టించికోని ఈ రోజుల్లో మన మొహం కూడా ఎన్నడూ చూడని చంద్రబాబు ఈ విధంగా మన కోసం (?) పాపం రాత్రనకా, పగలనకా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయక పాదయాత్రలు చేయడం, మన కోసమే ఆలోచించడం నిజంగా తెలుగు ప్రజల పూర్వ జన్మ సుకృతమేనేమో.

By
en-us Political News

  
ఆయన మంత్రి పదవి ఇప్పుడు ఒక రాజ్యాంగపరమైన గడువుపై ఆధారపడి ఉంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. నెల రోజుల్లో ఆయన మంత్రి ఉద్యోగం పోతుందా? అని ప‌రిశీలిస్తే ఆయ‌న‌కా గండం ఉందనే చెప్పాలి.
వెస్ట్ బెంగాల్ లో మొత్తం 91 లక్షల ఓటు తొలగించారు. అంటే సగటున చూస్తే నియోజకవర్గానికి 31 వేల ఓట్లు తొలగించారు. ఈ తొలగింపు రెండు కారణాల వల్ల చాలా సెన్సిటివ్. మార్జిన్‌లతో పోలిస్తే ..2021లో టీఎంసీ గెలిచిన చాలా సీట్లలో మెజారిటీ 50,000 కంటే తక్కువ. 13 సీట్లలో ఇది మూడు వేల కంటే కూడా తక్కువ. ఇటువంటి పరిస్తితుల్లో నియోజకవర్గానికి 31 వేల ఓట్లు డిలిషన్ లో పోతే.. ఈ ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడుతుంది?
మహిళా రిజర్వేషన్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రజలను వంచించే ప్రయత్నం చేసిందన్నారు. విపక్షాలు సమష్టిగా ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో మోడీ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయారన్నారు. అందుకే ఆయన తన ప్రసంగంలో అబద్ధాలు వల్లెవేశారన్నారు.
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు కనిపించాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు వాటా కలిగిన ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు సాఫీగా సాగడంతో, ముడి చమురు ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మరియు యూరోప్ దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఇది తక్షణ ఆర్థిక ఊపిరిని అందించింది.
బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం. ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి కమిటీల్లో పల్నాడు జిల్లా నేతలకు సముచిత ప్రాధాన్యత దక్కింది.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.