చంద్రబాబు జోడు గుర్రాల స్వారీ... ఎటు దారితీయనుంది?
Publish Date:Oct 7, 2016
Advertisement
సమైక్యాంధ్ర పోయి ఇప్పుడు నవ్యాంధ్రా నెలకొంది! కాని, ఆ నవ్యాంధ్రా స్వర్ణాంధ్రప్రదేశ్ అయ్యేది ఎలా? అంతకంటే ముందు అమరావతి అంతర్జాతీయ స్థాయిని అందుకునేదెలా? ఇవన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందున్న సవాళ్లు. అయితే, ఒకవైపు ప్రభుత్వపరమైన ఛాలెంజ్ లు బోలెడు వుండగానే మరో వైపు పార్టీ కూడా చాలా ప్రధానం. మరో మారు, ఇంకో మారు అధికారంలోకి వచ్చి అభివృద్ధి కొనసాగించాలంటే పార్టీనే కదా కీలకం...
సీఎం చంద్రబాబు... ప్రభుత్వం, పార్టీ ... ఈ జోడు గుర్రాల స్వారీ సమర్థంగా చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆయన చేస్తున్న ప్రయత్నాలు, ప్రయోగాల ఫలితాలు ఎలా వుంటాయో ఇప్పుడే చెప్పలేం. కాని, ముందు ముందు మాత్రం చెప్పుకోతగ్గ స్థాయిలో మార్పులు ఖాయంలా తోస్తోంది. దీనికి చక్కటి ఉదాహరణ ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ లో నడుస్తోన్న రెండు ప్రయోగాలే!
అమరావతిని రాజధానిగా నిర్ణయించి పనులు ప్రారంభించటం ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులు, సెక్రటేరియట్ కూడా రాజధాని చేరుకున్నాయి. కొంత హడావిడైతే కనిపిస్తోంది. కాని, జనం అనుభవంలోకి వచ్చేలా, అర్థం చేసుకునేలా అభివృద్ధి మాత్రం ఈ రెండేళ్లలో జరగలేదు. అందుకే, ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఏపీ సర్కార్.
ఏ ఇంటర్నేషనల్ సిటీకైనా అత్యంత ప్రధానమైంది , ప్రతిష్ఠాత్మకమైంది విద్యారంగం. దానిపై దృష్టి పెట్టింది రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ( సీఆర్ డీఏ ). పలు ఇంటర్నేషనల్ స్కూల్స్ మ్యానేజ్ మెంట్లతో డిస్కషన్స్ చేస్తోంది. వాట్ని అమరావతికి రప్పించేలా ప్లాన్ చేస్తోంది. అంతే కాదు, నెక్స్ట్ టార్గెట్ హోటల్స్ అంటున్నారు. ఏ టాప్ సిటీకైనా హోటల్స్ ఎంతో వన్నె తెస్తాయి. అందుకే, పెద్ద పెద్ద హోటల్స్ తో గవర్నమెంట్ చర్చలు చేయాలని ఆలోచిస్తోంది. తమ బిజినెస్ ని అమరావతిలోనూ జరపాలని కోరనుంది.
విద్యా, హోటల్స్ లాంటివే కాదు ఆర్దిక సంస్థలు, సేవా సంస్థలు, ఐట సంస్థలు... ఇలా అన్ని రంగాల్లోని ప్రముఖ సంస్థలతో ఏపీ గవర్నమెంట్ ఒప్పందాల దిశగా ముందుకు సాగుతోంది. ఇవన్నీ సాపీగా జరిగితే అమరావతి కొత్త శోభతో , కొత్త ఉత్సాహంతో వెలిగిపోతుంది!
చంద్రబాబు ఒకవైపు రాజధాని మీద దృష్టి పెడుతూనే పార్టీని కూడా క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ఎమ్మేల్యేలకు సీల్డ్ కవర్స్ లో వారి పర్ఫామెన్స్ గురించి రిపోర్ట్ అందించారు! ఇది ఏ పార్టీ, ఎప్పుడూ చేయని ప్రయోగం. పైగా సీక్రెట్ రిపోర్ట్స్ లో నేతలకి గ్రేడింగ్ కూడా ఇచ్చారట. ఏబీసీడీల్లో గ్రేడింగ్ తక్కువ వచ్చిన వారికి డేంజర్ బెల్స్ మోగినట్టే! ఎంపీలకు కూడా వాళ్ల పర్ఫామెన్స్ పై సీల్డ్ కవర్ రిపోర్ట్ అందజేసింది ప్రత్యేక అధ్యయన కమిటీ. దీని ద్వారా మిగతా సగం టర్మ్ లో ఆయా నేతలు మరింత సమర్థంగా పని చేసే ఛాన్స్ లభిస్తుంది!
అటు పాలన, ఇటు పార్టీ... రెండిటిపై చంద్రబాబు తనదైన ముద్ర వేస్తున్నారు. సరికొత్తగా ముందుకు పోతున్నారు. ఈ కృషికి ఫలితం పూర్తిగా దక్కాలని మనమూ కోరుకుందాం. జనం, కార్యకర్తలు ఇద్దరూ హ్యాపీగా వుంటే... ఆ నాయకుడు సక్సెస్ అయినట్టే కదా!
http://www.teluguone.com/news/content/chandra-babu-45-67518.html





