చాహల్ , ధనశ్రీ లకు విడాకులు మంజూరు
Publish Date:Mar 20, 2025
Advertisement
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ , ధన శ్రీ విడాకులు తీసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలకు గురువారం (మార్చి 20)తో తెరపడింది. వీరికి విడాకులు మంజూరు చేస్తూ ముంబైలోని బాంద్రా కోర్టు తీర్పు చెప్పింది. ఈ విషయాన్ని చాహల్ తరపు న్యాయవాది కన్ఫర్మ్ చేశారు. ధన శ్రీకి భరణం క్రింద రూ 4. 75 కోట్లు చెల్లించేందుకు చాహల్ అంగీకరించారు. విడాకులు కేసు తుది దశకు చేరుకోవడంతో చాహల్ ఇంకా ఐపిఎల్ టీమ్ లో చేరలేదు. చాహల్, ధనశ్రీ సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో విడాకుల వార్తలు గుప్పు మన్నాయి. వీరువురికి 2020లో పెద్దల సమక్షంలో సాంప్రదాయంగా పెళ్లయ్యింది34 ఏళ్ల చాహల్ 2025 ఐపిఎల్ ఆడటానికి సిద్దమవుతున్నట్లు తెలిసింది. అతను పంజాబ్ కింగ్స్ తరపున ఆడనున్నారు. ఈ టోర్నమెంట్ మార్చి 22న ప్రారంభమౌతుంది. పంజాబ్ జట్టు మార్చి 25న గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది. బాలివుడ్ నటి ప్రీత జింతా యాజమాన్యంలో ని పంజాబ్ కింగ్స్ చాహల్ కు భారీ ఆఫర్ ఇచ్చి కొనుగోలు చేసింది. చాహల్ ను కొనుగోలు చేయడానికి పంజాబ్ కింగ్ రూ 18 కోట్ల బిడ్ వేసింది
http://www.teluguone.com/news/content/chahal-39-194742.html





