నైతిక విలువలతోనే విద్యా వికాసం : ప్రవచన కర్త చాగంటి

Publish Date:Aug 4, 2026

Advertisement

 

మంత్రి లోకేష్‌తో ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు భేటీ..!

ప్రవచన చక్రవర్తి, నైతిక విలువల సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మంగళవారం ఉండవల్లిలోని నివాసంలో రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ సందర్భంగా  సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి నైతిక విలువలతో కూడిన విద్య ఎంతటి కీలకమైనదో చాగంటి కోటేశ్వరరావు  మంత్రికి వివరించారు. చిన్ననాటి నుంచే పిల్లలలో మానవీయ విలువలు, క్రమశిక్షణ, నైతికతను పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు చాగంటి కోటేశ్వరరావు  దిశా నిర్దేశంలో రూపకల్పన చేసిన నైతిక విలువల పాఠ్యాంశాలను నో బ్యాగ్ డే రోజు బోధిస్తున్నారు. నైతిక విలువల విద్యతోనే సమగ్ర విద్యా వికాసం సాధ్యమని నమ్మిన ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగం కావడం పట్ల చాగంటి కోటేశ్వరావు  సంతోషం వ్యక్తం చేశారు. భేటీ అనంతరం ఇంటి నుంచి కారు వద్దకు వచ్చి చాగంటి కోటేశ్వరావుని వినయపూర్వకంగా సాగనంపారు మంత్రి నారా లోకేష్.

Chaganti meeting with Lokesh, Undavalli, Chaganti Koteswara Rao, Discipline, morality

By
en-us Political News

  
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిరోజూ అత్యంత బిజీ షెడ్యూల్‌తో గడుపుతుంటారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఆగస్టు 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు, మొత్తం 3 రోజుల పాటు పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపరచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది
సెప్టెంబర్ 18లోగా పాస్‌పోర్ట్ ఇవ్వాలి.. కోర్టు ఆదేశాలు..!
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యక్షమైన ఈ కంటెంట్‌ను నీచమైన, నిందాపూర్వకమైనదిగా  పేర్కొంది. ఇలాంటి హానికరమైన, అసత్యపూరితమైన పోస్టులకు బహిరంగ వేదికలలో ఏమాత్రం స్థానం ఉండకూడదని స్పష్టం చేసింది.
దిల్‌సుఖ్‌నగర్‌లో తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి కారు పేరుతో కలకలం..!
వాహన యజమానులు   సామాజిక, చట్టబద్ధమైన బాధ్యతను గుర్తించేలా చేయడం,  దురదృష్టవశాత్తు రహదారి ప్రమాదాలు జరిగిన సమయంలో బాధితులకు తగిన ఆర్థిక పరిహారం సకాలంలో అందేలా చూడటమే ఈ ప్రతిపాదిత మార్గదర్శకాల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. 
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
భారత క్రీడారంగంలో స్వర్ణాక్షరాలతో లిఖించదగిన అద్భుతమైన ఘట్టం సాగర తీర నగరం విశాఖపట్నంలో ఆవిష్కృతమైంది.
ట్రైనీ మహిళా అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అరెస్టయి ప్రస్తుతం చంచల్‌గూడా జైలులో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి
ఇప్పటివరకు పోలీస్‌ అత్యవసర సేవల కోసం వినియోగిస్తున్న డయల్‌ 100 స్థానంలో 112 నంబర్‌ ను అమలు చేయనున్నారు.  పోలీస్‌, అంబు లెన్స్‌, అగ్నిమాపక సేవల ను ఒకే ఎమర్జెన్సీ నంబర్‌ పరిధిలోకి తీసుకురావడం ఈ కొత్త వ్యవస్థలో  ప్రత్యేకత. 112కు ఫోన్‌ చేస్తే కేవలం పోలీస్‌ సహాయం మాత్రమే కాదు.. పరిస్థితిని బట్టి అంబులెన్స్‌, ఫైర్‌ సర్వీసులను కూడా సమన్వయం చేసేలా వ్యవస్థను రూపొందించారు. 
మొత్తం 76 జూనియర్‌ కాలేజీలు ఫైర్‌ ఎన్‌ఓసీలను సమర్పించగా, వాటిలో ఎనిమిది కాలేజీలు నకిలీ, ఫోర్జ్డ్‌ ఎన్‌ఓసీలను సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై హైడ్రా అడిషనల్‌ డైరెక్టర్‌ ఫిర్యాదు మేరకు లేక్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.
గతంలో వైజాగ్ మధురవాడలోని ఐటీ సెజ్ హిల్ నెంబర్ 3లో ఐబీఎం క్యాంపస్ నడిచేది. అయితే నాటి పరిస్థితుల కారణంగా కార్యకలాపాలు నిలిచిపోయిన నేపథ్యంలో.. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో ఐబీఎం తిరిగి విశాఖకు వచ్చింది. ఇది నిస్సందేహంగా మంత్రి నారాలోకేష్ విజయమని పరిశీలకులు అంటున్నారు.
విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ మెగాడీఎస్సీలో అవకతవకలు, అక్రమాలు జరిగితే.. బాధిత అభ్యర్థులు కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించింది. అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి భయపడుతున్నారన్న పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.