మంత్రి లోకేష్‌తో ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు భేటీ..!
ప్రవచన చక్రవర్తి, నైతిక విలువల సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మంగళవారం ఉండవల్లిలోని నివాసంలో రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ సందర్భంగా సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి నైతిక విలువలతో కూడిన విద్య ఎంతటి కీలకమైనదో చాగంటి కోటేశ్వరరావు మంత్రికి వివరించారు. చిన్ననాటి నుంచే పిల్లలలో మానవీయ విలువలు, క్రమశిక్షణ, నైతికతను పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు చాగంటి కోటేశ్వరరావు దిశా నిర్దేశంలో రూపకల్పన చేసిన నైతిక విలువల పాఠ్యాంశాలను నో బ్యాగ్ డే రోజు బోధిస్తున్నారు. నైతిక విలువల విద్యతోనే సమగ్ర విద్యా వికాసం సాధ్యమని నమ్మిన ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగం కావడం పట్ల చాగంటి కోటేశ్వరావు సంతోషం వ్యక్తం చేశారు. భేటీ అనంతరం ఇంటి నుంచి కారు వద్దకు వచ్చి చాగంటి కోటేశ్వరావుని వినయపూర్వకంగా సాగనంపారు మంత్రి నారా లోకేష్.
Chaganti meeting with Lokesh, Undavalli, Chaganti Koteswara Rao, Discipline, morality
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chaganti-meeting-with-lokesh-36-228021.html
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
భారత క్రీడారంగంలో స్వర్ణాక్షరాలతో లిఖించదగిన అద్భుతమైన ఘట్టం సాగర తీర నగరం విశాఖపట్నంలో ఆవిష్కృతమైంది.
ట్రైనీ మహిళా అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అరెస్టయి ప్రస్తుతం చంచల్‌గూడా జైలులో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి
ఇప్పటివరకు పోలీస్ అత్యవసర సేవల కోసం వినియోగిస్తున్న డయల్ 100 స్థానంలో 112 నంబర్ ను అమలు చేయనున్నారు. పోలీస్, అంబు లెన్స్, అగ్నిమాపక సేవల ను ఒకే ఎమర్జెన్సీ నంబర్ పరిధిలోకి తీసుకురావడం ఈ కొత్త వ్యవస్థలో ప్రత్యేకత. 112కు ఫోన్ చేస్తే కేవలం పోలీస్ సహాయం మాత్రమే కాదు.. పరిస్థితిని బట్టి అంబులెన్స్, ఫైర్ సర్వీసులను కూడా సమన్వయం చేసేలా వ్యవస్థను రూపొందించారు.
మొత్తం 76 జూనియర్ కాలేజీలు ఫైర్ ఎన్‌ఓసీలను సమర్పించగా, వాటిలో ఎనిమిది కాలేజీలు నకిలీ, ఫోర్జ్డ్ ఎన్‌ఓసీలను సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై హైడ్రా అడిషనల్ డైరెక్టర్ ఫిర్యాదు మేరకు లేక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
గతంలో వైజాగ్ మధురవాడలోని ఐటీ సెజ్ హిల్ నెంబర్ 3లో ఐబీఎం క్యాంపస్ నడిచేది. అయితే నాటి పరిస్థితుల కారణంగా కార్యకలాపాలు నిలిచిపోయిన నేపథ్యంలో.. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో ఐబీఎం తిరిగి విశాఖకు వచ్చింది. ఇది నిస్సందేహంగా మంత్రి నారాలోకేష్ విజయమని పరిశీలకులు అంటున్నారు.
విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ మెగాడీఎస్సీలో అవకతవకలు, అక్రమాలు జరిగితే.. బాధిత అభ్యర్థులు కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించింది. అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి భయపడుతున్నారన్న పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.
ఈ సోదాలు బీహార్ కు చెందిన ప్రత్యేక ఈడీ బృందం పర్యవేక్షణలో జరిగాయి. హైదరాబాద్, విశాఖలో మళ్ల విజయప్రసాద్ కు చెందిన నివాసాలు, వ్యాపార ప్రాంగణాలు, అనుబంధ కార్యాలయాలలో ఈడీ అధికారులు ఏక కాలంలో సోదాలు చేపట్టారు.
దాడికి కావలసిన ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి నుంచి సేకరించాలని ప్లాన్ చేశారు. అంతేకాకుండా పంజాబ్‌లోని కీలకమైన పోలీస్ స్టేషన్లు, పోలీస్ భవనాలు, సిబ్బందిపై నిరంతరం రెక్కీ నిర్వహించే బాధ్యతను కూడా ఈ నిందితులకే అప్పగించారు. మరోవైపు అమృత్‌సర్ ప్రాంతంలో రైల్వే పట్టాల సమీపంలో రహస్యంగా సీసీ కెమెరాలు అమర్చిన వ్యవహారంపై తనిఖీలు చేపట్టగా రెండో ఉగ్ర మాడ్యూల్ బయటపడింది.
947లో బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించిన ఇండియా.. ఈ ఏడాది 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని మాసచుసెట్స్ లో పంద్రాగస్టును ఇండియా డేగా జరుపుకోవాలన్న నిర్ణయం తీసుకున్నట్లు
మంత్రి సీదిరి అప్పలరాజును కోర్టు అనుమతిపై మంగళవారం ) ఒక రోజు కస్టడీకి తీసుకున్న పోలీసులు కస్టడీ గడువు ముగియడంతో అదే రోజు సాయంతరం అంపోలు జైలుకు తిరిగి తరలించారు.
హర్మూజ్ జలసంధి మూతపడలేదని, అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకల కోసం ఈ జలమార్గం సురక్షితంగా తెరిచే ఉందని ప్రకటించింది. అమెరికా బలగాలు ఈ మార్గంలో నౌకల రక్షణ కోసం నిరంతరం పహారా కాస్తున్నాయని పేర్కొంది.
ప్రజాస్వామ్యంలో నాయకుడు ప్రజల కష్టాలను ఆలకించడానికి, కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వడానికి క్షేత్రస్థాయిలోకి రావడం సహజం