బనకచర్ల ప్రాజెక్టుపై 12 మంది సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. సముద్రంలో వృధాగా కలిసే నీటిని బనకచర్ల ద్వారా రాయలసీమ అవసరాలకు వాడుకోవాలని ఏపీ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుపై తెలంగాణ నుంచీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కేంద్రం రంగంలోకి దిగింది. అయితే ఈ ప్రాజెక్టుపై తెలంగాణ నుంచీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కేంద్రం రంగంలోకి దిగింది. ఇరు రాష్ట్రాల మధ్యా నీటి వినియోగానికి సంబంధించిన తగాదాపు పరిష్కరించేందుకు నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిపుణుల కమిటీలో తెలంగాణ నుంచి ఐదుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు సభ్యులు ఉంటారు. అలాగే కేంద్రం ఇద్దరు నిపుణులను నామినేట్ చేస్తుంది. ఈ కమిటీ కోసం సభ్యుల పేర్లను పంపాలని కేంద్రం ఉభయ తెలుగు రాష్ట్రాలను కేంద్ర జలనవరుల శాఖ కోరింది.
బనకచర్లపై జూన్ 16న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులతో హస్తినలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో జరిగిన సమావేశంలో ప్రాజెక్టుపై విభేదాల పరిష్కారంపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటోందని ఏపీ వాదించింది. అయితే తెలంగాణ మాత్రం తమ రాష్ట్రం నీటి వనరు లను కోల్పోతుందని గట్టిగా వాదించింది. బనకచర్ల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాజీ రాజకీయ గురువు చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇస్తున్నారని తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పించడంతో బనకచర్లపై పీటముడి పడే పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ ఉద్రిక్తతలూ పెరిగాయి. వాస్తవానికి బనకచర్ల రాయలసీమలో కరవును పరిష్కారానికి దోహద పడుతుందనీ, తెలంగాణ ప్రయోజనాలకు ఇసుమంతైనా నష్టం వాటిల్లదని ఏపీ గట్టిగా చెబుతోంది. ఈ నేపథ్యంలో బనకచర్లపై ప్రతిష్ఠంభన తొలగించే ఉద్దేశంతో కేంద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని నిర్ణయించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/center-to-appoint-experts-committee-on-banakacharla-39-203769.html
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.