బనకచర్ల ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం

Publish Date:Aug 8, 2025

Advertisement

బనకచర్ల ప్రాజెక్టుపై  12 మంది సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు  కేంద్రం ప్రకటించింది. సముద్రంలో వృధాగా కలిసే నీటిని బనకచర్ల ద్వారా రాయలసీమ అవసరాలకు వాడుకోవాలని ఏపీ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుపై తెలంగాణ నుంచీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కేంద్రం రంగంలోకి దిగింది. అయితే ఈ ప్రాజెక్టుపై తెలంగాణ నుంచీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కేంద్రం రంగంలోకి దిగింది. ఇరు రాష్ట్రాల మధ్యా నీటి వినియోగానికి సంబంధించిన తగాదాపు పరిష్కరించేందుకు నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిపుణుల కమిటీలో తెలంగాణ నుంచి ఐదుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు సభ్యులు ఉంటారు. అలాగే కేంద్రం ఇద్దరు నిపుణులను నామినేట్ చేస్తుంది. ఈ కమిటీ కోసం సభ్యుల పేర్లను పంపాలని కేంద్రం ఉభయ తెలుగు రాష్ట్రాలను కేంద్ర జలనవరుల శాఖ కోరింది.  

 బనకచర్లపై జూన్ 16న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులతో హస్తినలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో  జరిగిన సమావేశంలో  ప్రాజెక్టుపై విభేదాల పరిష్కారంపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటోందని ఏపీ వాదించింది. అయితే  తెలంగాణ మాత్రం  తమ రాష్ట్రం నీటి వనరు లను కోల్పోతుందని గట్టిగా వాదించింది. బనకచర్ల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాజీ రాజకీయ గురువు  చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇస్తున్నారని తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పించడంతో బనకచర్లపై పీటముడి పడే పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ ఉద్రిక్తతలూ పెరిగాయి. వాస్తవానికి బనకచర్ల  రాయలసీమలో కరవును పరిష్కారానికి దోహద పడుతుందనీ, తెలంగాణ ప్రయోజనాలకు ఇసుమంతైనా నష్టం వాటిల్లదని ఏపీ గట్టిగా చెబుతోంది. ఈ నేపథ్యంలో బనకచర్లపై ప్రతిష్ఠంభన తొలగించే ఉద్దేశంతో కేంద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని నిర్ణయించింది.  

By
en-us Political News

  
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.