ప‌థ‌కాల పేర్ల మార్పు.. కేంద్రం కినుక.. బెంగాల్ కు నిదులు నిలుపు

Publish Date:Jun 20, 2022

Advertisement

ఒకే పేరున్న పిల్ల‌లు ఎదుర‌యితే నీ పేరు, నా పేరు ఒక‌టే అని న‌వ్వుకుంటారు, స్నేహితులూ అవుతారు. ఒకే లాంటి డ్ర‌స్‌ వేసుకున్న‌వారి విష‌యంలోనూ అదే జ‌ర‌గ‌వ‌చ్చు. కానీ కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం బెంగాల్ విష‌యంలో ఆగ్ర‌హించింది. కేంద్రం ప‌థ‌కాల‌నే పేరు మార్చి అమ‌లు చేస్తున్నారంటే ప‌శ్చిమ బెంగాల్ మీద కారాలు మిరియాలూ నూరుతోంది మోదీ ప్ర‌భుత్వం. అంతేకాదు అస‌లా ప‌థ‌కాల‌కు ఇవ్వాల్సిన నిధుల్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఇంత‌కంటే అన్యాయం మ‌రోటి వుంటుందా ? 
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) పథకాల యాక్షన్ ప్లాన్ వివరించి. అమలు కోసం నిధులు మంజూరు చేయాలని జనవరి, 2022లో కేంద్రాన్ని ప‌శ్చిమ‌ బెంగాల్ ప్రభుత్వం కోరింది. పిఎంఏవై కింద రూ.4,900 కోట్లు, రూ.2,700కోట్లు ఇవ్వాలని కోరింది. కానీ ఈ పథకాల అమలుపై కొన్ని సందేహాలున్నాయ‌ని  కేంద్రం అడ్డుపుల్ల వేసింది. పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తున్నార‌ని, వాటికి  సంబంధించిన వివరాలు ఇవ్వండి అంటూ బెంగాల్ ప్రభుత్వానికి సమాచారం పంపింది కేంద్రం. హౌరా పట్టణంలోని బెంగాల్ ప్రభుత్వ తాత్కాలిక సచి వాలయ భవనం నబన్నాను వివరాలు ఇవ్వాలని తన లేఖలో కోరింది.
ప‌శ్చిమ‌ బెంగాల్ లో పిఎంఎవై ప‌థ‌కాన్ని బంగ్లా ఆవాస్ యోజన గా.. స్వచ్ఛ భారత్ మిషన్, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకాలను నిర్మల్ బంగ్లా మిషన్, బంగ్లా సడ‌క్‌ యోజనగా మార్చి అమలు చేస్తున్నా రు. ఇలా పలు కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చి అమలుచేస్తున్న బెంగాల్ ప్రభుత్వానికి  ఈ పరిణా మంతో ఝలక్ తగిలినట్టయింది. ఏటా మార్చి చివర్లో, ఏప్రిల్ మొదటి వారంలో  నిధులు మంజూరయ్యేవి.  ఈసారి మాత్రం కేంద్రం ఎన్నో అనుమానాలు  వ్య‌క్తంచేసిందని ఆ ప్రభుత్వ ప్రతినిధి చెప్పారు. 2023లో పంచాయతీ ఎన్నికలు ఉండటంతో ఏం చేయాలనే దానిపై బెంగాల్ ప్రభుత్వం ఆలోచనలో పడింది.
కేంద్రం పథకాలు, నిధులు, అమలు అంశాలపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోనూ రాజకీయ కాక ర‌గులుతోంది. ముఖ్యంగా తెలంగాణలో బలంగా, వేగంగా ఎదుగుతున్న బీజేపీ, అధికార టీఆర్ఎస్ మధ్య ఈ విషయంలో పదే పదే మాట‌ల యుద్ధం నడుస్తోంది. తెలంగాణలో పథకాలు-కేంద్రం వాటాలపై ప్రతి రోజూ వాడీ వేడి చర్చ జరుగుతూనే ఉంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం నుంచి వచ్చే నిధులతో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టి కేవలం  కేసీఆర్ పేరు ఒకటే పెట్టుకుంటున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.  

నగరాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం అమృత్ స్కీమ్ కింద ఇచ్చే నిధులను మిషన్ భగీరథ కోసం తెలంగాణ సర్కారు వాడుకుంటోందని వాదిస్తోంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి రైతు వేదికలు, గ్రామాల్లో పార్కుల అభివృద్ధిలోనూ  కేంద్రం డబ్బులున్నాయనేది  బీజేపీ ఆరోపణ. ఐతే.. బీజేపీ నేతలకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటరిస్తూ వస్తున్నారు. తెలంగాణ పథకాలనే కేంద్రం కాపీ కొడుతోందని.. మిషన్ భగీరథ ను హర్ ఘర్ జల్ పేరుతో అమలు చేస్తోందని కేసీఆర్  ఆరోపించారు.
ఆంధ్రాలోనూ సీఎం జగన్ తన ప్రాభ‌వం కోసం అనేక పథకాలను తండ్రి వైఎస్ఆర్ పేరు మీద, తన పేరు మీద అమలు చేస్తున్నారు. నవరత్నాలు, జగనన్న అమ్మ ఒడి, మన బడి నాడు –నేడు, సర్వ శిక్షా అభి యాన్ లో భాగంగా ‘జగనన్న విద్యా కానుక, మధ్యాహ్న భోజనం స్కీమ్ లో భాగంగా జగనన్న గోరుముద్ద , సంక్షేమ వసతి గృహాల పథకంలో భాగంగా జగనన్న వసతి దీవెన లను అమలు చేస్తున్నారు.ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, స్వచ్ఛ భారత్ మిషన్  అమలులో కేంద్రం   వాటా 60శాతం. మిగతా 40 శాతం ఖర్చును రాష్ట్రాలు భరిస్తున్నాయి.

సంక్షేమ, మౌలిక వసతుల రంగాలకు కేటాయింపులతోనే జనాన్ని ఎక్కువగా ఆకర్షించొచ్చన్న అంచనాతో.. కేంద్రం అమలు చేస్తున్న చాలా సంక్షేమ ప‌థ‌కాల్లో పలు రాష్ట్రాలు తమ వాటాను, కేటాయింపులను భారీగా పెంచి.. సోంత పేర్లతో అమలు చేస్తున్నాయి.

 ఒకప్పు డు కేంద్ర సంక్షేమ పథకాల్లో ఖర్చుల వాటా 60:40శాతంగా ఉండేది. నేడు రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తెచ్చి మరీ ఆ స్కీముల్లో డబ్బులు కుమ్మరించి పంపిణీకి  సిద్ధ‌ప‌డ‌టంతో  రాష్ట్రాల వాటా 90 శాతం అన్న ట్టుగా మారిపోయింది. వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లను కేసీఆర్, జగన్ భారీగా పెంచేశారు. కొన్ని పథకాల్లో కేంద్రం వాటా నామమాత్రమే అన్నట్టుగా సీన్ మారింది. కేంద్రం ప్రశ్నించినా,నిధులు ఆపేసినా, రాష్ట్రాలే అప్పులు చేసో, ఆస్తులు అమ్మో ఆ పథకాల అమలును కొనసాగించి, ఓట్లు రాబట్టుకోవా లనుకునే విపరీత పరిస్థితి  దేశం అంత‌టా కనిపిస్తోంది

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.