Publish Date:Jun 19, 2023
మాటల్లో విమర్శలు.. చేతల్లో వత్తాసు.. ఇదీ జగన్ రెడ్డి ప్రభుత్వం విషయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరి. ఆంధ్రప్రదేశ్ ప్రజల విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ తీరు మాటల్లో పలకరింపు, నొసటితో వెక్కిరింపు అన్న చందంగా ఉంది. గత నాలుగేళ్లుగా జగన్ రెడ్డి ప్రభుత్వ విధానాలను అన్ని విధాలుగా సమర్ధిస్తూ వచ్చిన మోడీ సర్కార్.. ఇక ఎన్నికల సంవత్సరం వచ్చే సరికి ఎక్కడ లేని హడావుడీ ప్రదర్శించి ఒకే సారి రాష్ట్రానికి రెవెన్యూ లోటును విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడేసేందుకు చేయగలిగినంతా చేసింది. అదీ సరిపోదనుకుందో ఏమో అప్పులకూ అడ్డగోలు అనుమతులు ఇచ్చేసింది. అందించగలిగినంత సహకారం అందించేసి... ఇక ఇప్పుడు ఏపీ సర్కార్ పై విమర్శల పర్వానికి తెరతీసింది.
కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలు ఏపీ పర్యటనలో జగన్ సర్కార్ ను అవినీతి మయంగా అభివర్ణించారు. దోపిడీ, అవినీతి జగన్ నాలుగేళ్ల పాలన సారాంశంగా తేల్చేశారు. వారి తరువాత ఇక బీజేపీ ఏపీ నేతలు తమ నోటికి పని చేబుతున్నారు. అయితే మాటలు కోటలు దాటుతుంటే.. చేతలు మాత్రం ఇంకా జగన్ రెడ్డి సర్కార్ కు సహకారం అందిస్తూనే ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ జగన్ ను మోడీ ఎంత అభిమానంతో చూసుకుంటారో గతంలో చెప్పిన మాటలను ఒక సారి గుర్తు చేసుకోవాలి. జగన్ పట్ల మోడీకి ఉన్నది పుత్ర వాత్సల్యం అని నిర్మలా సీతారామన్ గతంలో ఒక సారి చెప్పారు.
అందుకే అడ్డగోలు అప్పులు చేసి రాష్ట్రాన్ని గుల్ల చేసేస్తున్నా సహకారం అందిస్తూనే వస్తున్నారు. జగన్ సర్కార్ ను అవినీతి మయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించేసిన తరువాత కూడా ఈ సహకారం ఆగలేదు. తాజాగా రుణ పరిమితిలో విధించిన కోతకు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. ఎన్నికల ఏడాదిలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులూ ఎదుర్కోకుండా ఉండేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ చేయగలిగినంతా, చేయాల్సినంతా చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే కేంద్రం జగన్ రెడ్డి ప్రభుత్వానికి రూ. 28,704.02 కోట్ల మేర ప్రయోజనాలను అందించింది.
ఇవి చాలవన్నట్లు మరింతగా రుణం పొందేందుకు అవకాశం కల్పించకపోయినా.. గతంలో విధించిన కోతను వాయిదాల పద్ధతిన తీర్చేందుకు వెసులు బాటు కల్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణపరిమితిపై 8,000 కోట్ల రూపాయల కోత విధించాల్సి ఉంటే మోడీ పుత్స వాత్సల్యంతో జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ కోతను వాయిదా పద్ధతిలో విధించాలని నిర్ణయించారు.
అంటే ఎన్నికల సంవత్సరంలో జగన్ నెత్తిన రుణభారం పడకుండా వెసులుబాటు ఇచ్చారు. ఇక ఎన్నికల తరువాత వచ్చే ప్రభుత్వం ఈ భారం భరించాల్సి ఉంటుందన్న మాట. ఒక వేళ ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా జగన్ రెడ్డి ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి రాకపోతే.. జగన్ రెడ్డి తప్పిదాలకు మూల్యం వచ్చే ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందన్న మాట. తప్పులు ఈ ప్రభుత్వం చేస్తే.. తదుపరి ప్రభుత్వం ఆ భారం భరించాల్సి ఉంటుందన్న మాట.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/center-special-flexibilities-25-157048.html
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.