వైసీపీ ఫేకు ప్రచారంపై కేంద్రం సీరియస్!
Publish Date:Oct 17, 2025
Advertisement
ప్రధాని నరేంద్రమోడీ కర్నూలు పర్యటన సూపర్ సక్సెస్ అయ్యింది. ఆయన చేసిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నవ్యాంధ్రప్రదేశ్ లో నవశకానికి నాంది పలికిందన్న అభిప్రాయాన్ని పరిశీలకులు సైతం వ్యక్తం చేస్తున్నారు. భారీ ఎత్తున అభివృద్ధి పథకాలు జోరందుకోవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో వైసీపీ మళ్లీ తన ఫేక్ ప్రచారానికి తెరలేపింది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి విధానాలపై ప్రధాని నరేంద్రమోడీకి తాము ఒక మెమోరాండం ఇచ్చామంటూ వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఆ మెమోరాండం కూడా ప్రధాని కర్నూలు పర్యటనలోనే ఇచ్చామని చెప్పుకున్నారు. అయితే తెలుగుదేశం ఈ ప్రచారాన్ని వెంటనే ఖండించింది. అసలింతకీ విషయమేంటంటే.. ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు పర్యటన నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు అధికార పార్టీ సహా స్థానిక ప్రజా ప్రతినిథులకు ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానాలు అందాయి. అందులో భాగంగానే స్థానిక ఎమ్మెల్యే వైసీపీ నేత విరూపాక్షి, ఎమ్మెల్సీ మధుసూదన్, కర్నూలు జడ్పీ చైర్మన్ కు కూడా ఆహ్వానాలు అందాయి. ఆ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు వారు వచ్చారు. ప్రధాని పుష్పగుచ్ఛం ఇచ్చారు. కానీ వారు ఆ తరువాత మీడియా ముందుకు వచ్చి తాను ప్రధాని మోడీకి రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ప్రభుత్వ విధానాలపై ప్రధానికి వినతిపత్రంలో ఫిర్యాదు చేశామని చెప్పుకున్నారు. అయితే తెలుగుదేశం నాయకులు వెంటనే దీనిని ఖండించారు. వారు కేవలం ప్రొటోకాల్ ప్రకారం వచ్చి ప్రధానికి పుష్పగుచ్ఛం మాత్రమే ఇచ్చారని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. వైసీపీ నేతలు ప్రధానికి వినతిపత్రం ఇచ్చామని చెప్పుకున్న వ్యవహారంపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఈ వ్యహారంపై ఇంటెలిజెన్స్ ను అలర్ట్ చేసింది. అసలు ఏం జరిగింది? ప్రధానికి వారు నిజంగానే వినతిపత్రం ఇచ్చారా? ఇస్తే ఆ వినతి పత్రాన్ని స్వీకరించిందెవరు? తదితర విషయాలపై నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ రాష్ట్ర డీజీపీని కోరింది. ఒక వేళ వైసీపీ నేతలది వినతి పత్రం విషయంలో ఫేక్ ప్రచారమే అని తేలిసే సీరియస్ గా చర్యలు తప్పవని కేంద్రం వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/center-serious-on-ycp-fake-propagands-39-208090.html





