Publish Date:Oct 17, 2025
ప్రధాని నరేంద్రమోడీ కర్నూలు పర్యటన సూపర్ సక్సెస్ అయ్యింది. ఆయన చేసిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నవ్యాంధ్రప్రదేశ్ లో నవశకానికి నాంది పలికిందన్న అభిప్రాయాన్ని పరిశీలకులు సైతం వ్యక్తం చేస్తున్నారు. భారీ ఎత్తున అభివృద్ధి పథకాలు జోరందుకోవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో వైసీపీ మళ్లీ తన ఫేక్ ప్రచారానికి తెరలేపింది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి విధానాలపై ప్రధాని నరేంద్రమోడీకి తాము ఒక మెమోరాండం ఇచ్చామంటూ వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఆ మెమోరాండం కూడా ప్రధాని కర్నూలు పర్యటనలోనే ఇచ్చామని చెప్పుకున్నారు. అయితే తెలుగుదేశం ఈ ప్రచారాన్ని వెంటనే ఖండించింది.
అసలింతకీ విషయమేంటంటే.. ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు పర్యటన నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు అధికార పార్టీ సహా స్థానిక ప్రజా ప్రతినిథులకు ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానాలు అందాయి. అందులో భాగంగానే స్థానిక ఎమ్మెల్యే వైసీపీ నేత విరూపాక్షి, ఎమ్మెల్సీ మధుసూదన్, కర్నూలు జడ్పీ చైర్మన్ కు కూడా ఆహ్వానాలు అందాయి. ఆ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు వారు వచ్చారు. ప్రధాని పుష్పగుచ్ఛం ఇచ్చారు.
కానీ వారు ఆ తరువాత మీడియా ముందుకు వచ్చి తాను ప్రధాని మోడీకి రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ప్రభుత్వ విధానాలపై ప్రధానికి వినతిపత్రంలో ఫిర్యాదు చేశామని చెప్పుకున్నారు. అయితే తెలుగుదేశం నాయకులు వెంటనే దీనిని ఖండించారు. వారు కేవలం ప్రొటోకాల్ ప్రకారం వచ్చి ప్రధానికి పుష్పగుచ్ఛం మాత్రమే ఇచ్చారని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. వైసీపీ నేతలు ప్రధానికి వినతిపత్రం ఇచ్చామని చెప్పుకున్న వ్యవహారంపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఈ వ్యహారంపై ఇంటెలిజెన్స్ ను అలర్ట్ చేసింది. అసలు ఏం జరిగింది? ప్రధానికి వారు నిజంగానే వినతిపత్రం ఇచ్చారా? ఇస్తే ఆ వినతి పత్రాన్ని స్వీకరించిందెవరు? తదితర విషయాలపై నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ రాష్ట్ర డీజీపీని కోరింది. ఒక వేళ వైసీపీ నేతలది వినతి పత్రం విషయంలో ఫేక్ ప్రచారమే అని తేలిసే సీరియస్ గా చర్యలు తప్పవని కేంద్రం వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/center-serious-on-ycp-fake-propagands-39-208090.html
2029 ఎన్నికలలో విజయం కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్న జగన్ ఇప్పుడు కూడా నేతలను సొంత నియోజకవర్గం నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీలో నిలబెట్టాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అందులోనూ ప్రధానంగా ప్రస్తుతం చిలకలూరి పేట నియోజకవర్గంలో పని చేసుకుంటున్న మాజీ మంత్రి విడదల రజనీని వచ్చే ఎన్నికలలో రేపల్లె నుంచి పోటీలో దింపాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్న లోకేష్ తనకు రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచీ సబ్బానాయుడితో మంచి పరిచయం, అనుబంధం ఉందన్నారు.
తమిళ సినిమా లెనిన్ ఇండియన్ అనే సినిమాతో రోజా వెండితెరపై మళ్లీ కనిపించనున్నారు. ఈ మేరకు ఆ మూవీ మేకర్స్ రోజా తమ సినిమాలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు.
జూబ్లీ హిల్స్‌లో సెంటిమెంటో గెలుస్తుందో డెవలప్‌మెంటో గెలుస్తుందో తెలుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఇకపై ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించాలి అని టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు టీడీపీ నాయకులను ఆదేశించారు
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గోన్ననున్నారు.
హర్యానా ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ పెద్దగా కనిపించడం లేదు. పార్టీ అభ్యర్థి ఎంపికకే చాలా సమయం తీసుకున్న ఆ పార్టీ.. ప్రచారంలోనూ వెనుకబడింది. ప్రచార సరళిని బట్టి చూస్తుంటే జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ అన్న అభిప్రాయం కలుగుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
నాగబాబు ఎమ్మెల్సీ అయిన తరువాత కూడా తన వైఖరి మార్చుకోలేదని నిన్న మొన్నటి దాకా తెలుగుదేశం శ్రేణులు అంటుండేవి. ఎమ్మెల్సీగా నాగబాబు తన తొలి పర్యటనను తన సోదరుడు, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురం నుంచే మొదలు పెట్టారు. కానీ ఆ పర్యటన ఆద్యంతం తెలుగుదేశం, జనసేన క్యాడర్ మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లే విధంగానే సాగింది.
రాజకీయాలలో తొలి అడుగు కూడా పడకుండానే ఆయన నడకను ఆపేయాలని చూశారు. అయితే వాటన్నిటినీ తట్టుకుని నిలబడిన లోకేష్.. తనపై విమర్శలకు తన పనితీరుతోనే బదులిచ్చారు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తో మొదలు పెట్టి బెరుకు లేకుండా, బెదురు లేకుండా నిలదొక్కుకుని ఇప్పుడు ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంగా మారారు.
రైతులు కోరినా జగన్ మాత్రం పొలాల్లోకి అడుగుపెట్టలేదు. ఇదే రకం పరిశీలనో అర్ధంగాక రైతులు తలలుబాదుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తాను సీఎంగా ఉన్న సమయంలో రైతులను అన్నివిధాలుగా ఆదుకున్నానన్నారు. మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో పాతిక జిల్లాల్లో పంటనష్టం జరిగిందన్నారు. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రూపాయి కూడా సాయం అందలేదన్నారు.
ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించి ఎన్నికల ప్రచారంలో మైనారిటీ తీరని పిల్లలతో ఎన్నికల ప్రచారం చేయించారంటూ కేటీఆర్ పై షఫీయుద్దీన్ ఫిర్యాదు చేశారు.
బీజేపీలో బీఆర్‌ఎస్ పార్టీ విలీనం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.