అప్పుల్లో ఏపీ , తెలంగాణ దొందూ దొందే!

Publish Date:Jul 25, 2022

Advertisement

అడ్డగోలు అప్పుల్లో తెలుగు రాష్ట్రాలు రెండూ ఒకే దారిలో నడుస్తున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన రాష్ట్రాల రుణాల జాబితాలో ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది మార్సి 31 నాటికి ఏపీకి 3లక్షల98 వేల 903 కోట్ల రూపాయల అప్పులు ఉంటే.. తెలంగాణకు 3 లక్షల 12 వేల 191 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి రాష్ట్రాల అప్పుల వివరాల గురించి ఎంపీ కిషన్ కపూర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వక  సమాధానం ఇచ్చారు.

మూడేళ్లలో ఏయే రాష్ట్రం బహిరంగ మార్కెట్ నుంచి ఎంత మొత్తం రుణంగా తీసుకుందన్న విషయాన్ని కేంద్రం ప్రకటించింది.  బహిరంగ మార్కెట్ నుంచి మూడేళ్లలో తీసుకున్న రుణాలతో జాబితాను రూపొందించింది. బడ్జెటేతర రుణాలను మాత్రం కేంద్రం ఈ జాబితాలో పొందుపరచలేదు. బడ్జెట్ నుంచి అసలు, వడ్డీ చెల్లిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కేంద్రం తెలిపింది. ఏపీలో అప్పుల విషయానికి వస్తే.. 2020 మార్చి 31 నాటికి ఏపీ అప్పులు రూ.3,07,671 కోట్లుగా కాగా.. 2021 మార్చి 31 నాటికి ఏపీ అప్పులు రూ.3,60,333 కోట్లు. 2022 మార్చి 31 నాటికి ఏపీ అప్పులు రూ.3,98,903 కోట్లకు చేరాయని విత్త మంత్రి వెల్లడించారు.  

రాష్ట్రాలు ఆర్ధిక క్రమశిక్ష పాటించకుండా, ఇష్టానుసారం అప్పులు చేసి ఆర్ధికవ్యవస్థను దెబ్బతీస్తున్నాయన్న విమర్శల నేపథ్యంలో.. ఏ రాష్ట్రం ఎంత అప్పు చేసిందో కేంద్రం వెల్లడించింది.  దేశంలో అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రాల జాబితాను కేంద్రం పార్లమెంటులో బయటపెట్టింది. ఎంపీ కిశోర్‌ కపూర్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా, కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆ జాబితాను వెల్లడించారు. ఆ జాబితా ప్రకారం దేశంలో అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రంగా తమిళనాడు మొదటి స్థానంలో, సిక్కిం చివరి స్థానంలో ఉంది.     తెలుగు రాష్ట్రాలలో ఏపీ 8వ స్థానం,  1తెలంగాణ1వ స్థానంలో ఉన్నట్లు తేలింది.

దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల అప్పల వివరాల్లోకి వెళితే...తమినాడు- 6,59,868 లక్షల కోట్లు, ఉత్తర‌ప్రదేశ్- 6,53,307 లక్షల కోట్లు, మహారాష్ట్ర -6,08,999 లక్షల కోట్లు, పశ్చిమ బెంగాల్-5,62,697 లక్షల కోట్లు, రాజస్థాన్- 4,77,177 లక్షల కోట్లు,  కర్నాటక -4,62,832 లక్షల కోట్లు, గుజరాత్-4,02,785 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ -3,98,903 లక్షల కోట్లు,కేరళ్- 3,35,989 లక్షల కోట్లు,  మధ్యప్రదేశ్ 3,17,736 లక్షల కోట్లు, తెలంగాణ -3,12,191 లక్షల కోట్లు, పంజాబ్ -82,864 లక్షల కోట్లు,హర్యానా- 2,79,022 లక్షల కోట్లు, బీహార్ - 2,46,413 లక్షల కోట్లు, ఒడిశా-1,67,205 లక్షల కోట్లు, జార్ఖండ్ 1,17,789 లక్షల కోట్లు,  చత్తీస్‌ఘ‌డ్- 1,14,200 లక్షల కోట్లు, అస్సాం-1,07,719 లక్షల కోట్లు, ఉత్తరాఖండ్ -84,288 వేల కోట్లు, హిమాచల్ ప్రదేశ్ -74,686 వేల కోట్లు, గోవా- 28,509 వేలకోట్లు,  త్రిపుర -23,624 వేల కోట్లు, మేఘాలయ- 15,125 వేల కోట్లు, నాగాలాండ్- 15,125 వేల కోట్లు,  అరుణాచల్ ప్రదేశ్ -15,122 వేల కోట్లు, మణిపూర్ -13,510 వేలకోట్లు, మిజోరాం- 11,830 వేల కోట్లు, సిక్కిం -11,285 వేల కోట్లు

By
en-us Political News

  
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.