మోడీది చిల్లర వ్యవహారం.. కేంద్రం తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం.. కేసీఆర్ ఫైర్

Publish Date:May 18, 2022

Advertisement

కల్వకుంట్ల చంద్రశేఖరరావు మళ్లీ ఫామ్ లోకి వచ్చేశారు. 16 రోజుల పాటు ఫామ్ హౌస్ కే పరిమితమై మౌన వ్రతం పాటించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ అజ్ణాత వాసం నుంచి బయటకు వస్తూనే కేంద్రంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా కేంద్రం తీరు ఉందని మండిపడ్డారు.

ఇంతకీ ఆయన ఆగ్రహానికి కారణమేమిటంటే.. రాష్ట్రాలను విస్మరించి కేంద్రమే గ్రామ పంచాయతీకి నేరుగా నిధులు ఇవ్వడం. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాను కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్షించారు. ఆ సమీక్ష సందర్భంగా అధికారులు కేంద్రం నుంచి పంచాయతీకి రావలసిన నిధులు నేరుగా పంచాయతీ ఖాతాల్లోనే పడుతున్నాయనీ, ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఈ తంతు జరుగుతోందనీ వివరించారు. దీంతో కేసీఆర్ ఫైరైపోయారు. కేంద్రం తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. రాష్ట్రాల పరిస్థితులు కేంద్రానికి ఏం తెలుసునని నిలదీసారు. రాష్ట్రంలోని పల్లెలపై కేంద్రం పెత్తనమేమిటని మండి పడ్డారు. ఇదంతా మోడీ చిల్లర వ్యవహారమని పేర్కొన్నారు. 

జవహర్‌ రోజ్‌గార్ యోజన, ప్రధాని గ్రామసడక్ యోజన, నరేగా వంటి పథకాలను రాష్ట్రాల ద్వారా కాకుండా నేరుగా కేంద్రమే ఇవ్వడమంటేని ప్రశ్నించారు   . రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ.. ఆర్థికంగా దెబ్బతీసే విధానాలను కేంద్రం అనుసరిస్తున్నదన్నారు. దీనిపై కోర్టుకు వెళతామని హెచ్చరించారు. ఇన్ని రోజులూ మౌనంగా ఉన్న కేసీఆర్ మళ్లీ కేంద్రంపై విమర్శలతో విరుచుకుపడటంతో.. ఇక  రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత ఎక్కువయ్యే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇన్ని రోజులూ కేసీఆర్ మౌనం వెనుక పెద్ద వ్యూహమే ఉండి ఉండొచ్చని వారు విశ్లేషిస్తున్నారు.

కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమైన కాలంలో రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు పర్యటించారు. వారు టీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలను టీఆర్ఎస్ మంత్రులూ నేతలూ తిప్పి కొట్టినా కేసీఆర్ గళం విప్పకపోవడంతో విమర్శలకు వచ్చినంత స్పందన, టీఆర్ఎస్ ప్రతి విమర్శలకూ, ఖండనలకూ రాలేదు.

దీంతో టీఆర్ఎస్ డిఫెన్స్ లో పడిందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ దాదాపు 18 రోజుల మౌనం తరువాత  కేంద్రంపై విమర్శల నిప్పులు చెరగడంతో నడ్డా, అమిత్ షా విమర్శలకు దీటుగా మోడీపై విమర్శలతో లెవల్ చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

By
en-us Political News

  
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.