డీజిల్, పెట్రోల్ పై పెరిగిన ఎక్సైజ్ సుంకం.. వినియోగదారులపై పడని భారం

Publish Date:Apr 7, 2025

Advertisement

 భారత ప్రభుత్వం డీజిల్, పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.2 పెంచింది.  ప్రపంచ చమురు ధరలలో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు, ట్రంప్ సుంకాల మధ్య ప్రభుత్వం సోమవారం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  2017 నుంచి భారత్‌లో డైనమిక్ ప్రైసింగ్ విధానం అమలవుతుంది. అంటే ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలలో స్వల్ప మార్పు ఉన్నప్పటికీ పెద్దగా తేడా ఉండదు. పైసల్లోనే హెచ్చు, తగ్గులుండేవి.  2017 సెప్టెంబర్‌లో కేంద్రప్రభుత్వం పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.2.16, డీజిల్‌పై రూ.2.02 పెంచింది. ఆ తర్వాత నుంచి డైనమిక్ ప్రైసింగ్ అందుబాటులో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.109 నుంచి రూ.110 మధ్య ఉండగా జిల్లాను బట్టి పైసల్లో తేడా ఉంటుంది. మంగళవారం (ఏప్రిల్ 8) తెల్లవారుజాము నుంచి ఈ ధరలపై రూ.2 ఎక్సైజ్ సుంకం పెరగనుంది.  అంటే పెట్రోల్ ధర రూ.111 నుంచి రూ.112 కానుంది.  డీజిల్ ధర రూ.97.44 ఉండగా 99.44కు పెరగనుంది. రాష్ట్రాలను బట్టి పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పాండిచ్చెరిలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రూ.1 నుంచి రూ.2 వరకు తక్కువ ఉండే అవకాశం ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా ఉన్నాయని ప్రజల నుంచి విమర్శలు రావడంతో కేంద్రప్రభుత్వం 2021 నవంబర్ 4వ తేదీన కేంద్రప్రభుత్వం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అలాగే రాష్ట్రప్రభుత్వాలు విధించే వ్యాట్‌ను తగ్గించాలని పిలుపునిచ్చింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాష్ట్రప్రభుత్వాలు విధించే వ్యాట్‌ను తగ్గించగా, కొన్ని రాష్ట్రాలు తమ ఆదాయం తగ్గుతుందనే ఉద్దేశంతో వ్యాట్‌ను తగ్గించలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తన ఆదాయ వనరులను పెంచుకోవడం కోసం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచినట్లు తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకం ఇంధన ధరలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉంది. ఇప్పటివరకు పెట్రోల్‌పై కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం రూ.11 కాగా, పెంచిన రూ.2తో ఎక్సైజ్ సుంకం రూ.13కు పెరగనుంది. డీజిల్‌పై రూ.8 ఉండగా తాజా పెంపుతో రూ.10కు చేరనుంది. మరోవైపు కేంద్రం పెట్రో, డీజిల్ ధరలు పెంచిందనే ప్రచారం జరిగిన కొద్దిసేపటికే కేంద్రం స్పందించింది. ఈ పెంపును ఆయిల్ కంపెనీలు భరిస్తాయని తెలిపింది. ప్రత్యక్షంగా వాహనదారుడిపై ఎలాంటి ప్రభావం చూపించదని స్పష్టంచేసింది. వాహనాదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుత ధరలకే వాహనదారులకు పెట్రోల్, డీజిల్ లభిస్తుందని తెలిపింది.

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.