అమరావతే రాజధాని.. తేల్చేసిన కేంద్రం.. భారీగా నిధులు..

Publish Date:Mar 2, 2022

Advertisement

ఎవరు అవునన్నా.. ఎవరు కాదన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతే..! సీఎం జగన్ రెడ్డి, ఆయన వందిమాగధులు ఎంతలా రోడ్డెక్కి అమరావతి రాజధానికి వ్యతిరేకంగా కూతలు కూసినా.. అమరావతిని శ్మశానంతో పోల్చినా.. చంద్రబాబు నాయుడి హయాంలో జరిగిన నిర్మాణాలను ఎక్కడిక్కడే ఆపేసినా అమరావతే ఏపీ రాజధాని నగరం కానుంది! ఈ విషయం కేంద్రం స్పష్టం చేసింది. ఏపీ రాజధాని నగరంలో సచివాలయం నిర్మాణానికి వెయ్యి 214 కోట్ల రూపాయలు కేటాయించింది. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్లు నిర్మించేందుకు మరో వెయ్యి 123 కోట్ల రూపాయలు కేటాయించడం అమరావతినే రాష్ట్ర రాజధాని అని ధ్రువీకరించినట్లయింది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ భారీగా కేటాయింపులు చేసింది. ఈ మేరకు 2022-23 బడ్జెట్ లో ప్రత్యేకంగా ప్రొవిజన్ పెట్టడం విశేషం. ఏపీ రాజధాని ఏదో తెలియదు అన్నట్లు ఇంతవరకు వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా అమరావతినే రాజధానిగాపేర్కొని, భారీగా కేటాయింపులు చేయడం గమనార్హం. అంతేకాకుండా ఈ ప్రొవిజన్ నిధులను రాజధాని అమరావతిలో ఏయే పనులకు వినియోగించాలో అనే విషయంపైనా కేంద్రం పూర్తి స్పష్టత ఇచ్చింది. 2022-23 కేంద్ర బడ్జెట్ ప్రొవిజన్ ప్రకారం.. ఏపీ రాజధాని అమరావతిలో సచివాలయం నిర్మాణానికి వెయ్యి 214 కోట్లు, రాజధాని అమరావతిలో ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల నిర్మాణానికి  వెయ్యి 123 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించింది. జీపీఓఏకు భూసేకరణ వ్యయాన్ని 6.63 కోట్ల రూపాయలుగా కేంద్రం అంచనా వేసింది.

ఇదిలా ఉంటే.. బడ్జెట్ లో కేటాయింపుల ప్రకారంగానే నిధులు విడుదల అవుతాయనే వాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేటాయింపులు మాత్రమే చేసి నిధులు విడుదల చేయని సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయని ఆర్థిక రంగ నిపుణులు ఈ సందర్భంగా గుర్తు చేస్తుండడం గమనార్హం. మరి.. రాజధాని అమరావతి నిర్మాణం కోసం అంటూ మోడీ సర్కార్ చేసిన మేరకు నిధులను విడుదల చేయించుకునే విషయంలో జగన్ రెడ్డి సర్కార్ ఎంతవరకు సఫలం అవువుతుందో చూడాలని రాజకీయ, ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. అయితే.. అమరావతి అంటే ఆముదం తాగినట్టు మొహం పెట్టే వైసీపీ సర్కార్ రాజధాని సచివాలయం, ఉద్యోగుల ఇళ్ల నిర్మాణానికి నిధుల విడుదల చేయించుకునేందుకు మనసు పెట్టి ప్రయత్నిస్తుందో లేదో వేచి చూడాల్సి ఉందని అంటున్నారు.

By
en-us Political News

  
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.