ఆంధ్రప్రదేశ్ రహదారులకు మహర్దశ.. రూ. 7,266లు కేటాయించిన కేంద్రం
Publish Date:Aug 8, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం ఈ ఏడాది రూ. 7వేల 266 కోట్లు వ్యయం చేయడానికి నిర్ణయించింది. ఈ మేరకు 2024-25 వార్షిక ప్రణాళికను ఆమోదించింది. కేంద్రం రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి ఆమోదించిన ప్రాజెక్టులో విజయవాడ తూర్పు బైపాస్ కూడా ఉంది. ఈ మేరకు ప్రాజెక్టులను ఆమోదిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఏపీకి కేటాయించిన నిధులు.. ప్రాజెక్టుల వారీగా ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా రామారావు పేట నుంచి గుంటూరు జిల్లా కాజా టోల్గేట్ వరకు నాలుగులేన్ల విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణానికి రూ.2,716 కోట్లు కేటయించింది. అలాగే పల్నాడు జిల్లా వినుకొండ – గుంటూరు నాలుగు లేన్ల రహదారికి రూ.2,360కోట్లు , ఇక విజయవాడలోని మహానాడు జంక్షన్ నుంచి నిడమానూరు వరకు ఆరు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.669కోట్లు కేటాయించారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం నుంచి విశాఖ జిల్లా షీలానగర్ వరకు ఆరులేన్ల రహదారి నిర్మాణానికి రూ.906 కోట్లు కేంద్రం కేటాయించింది.
Eaఆ
http://www.teluguone.com/news/content/center-allocate-7266-crores-to-ap-roads-25-182537.html





