విద్యుత్ కొనుగోళ్ల‌కు కేంద్రం ఓకే

Publish Date:Aug 21, 2022

Advertisement

గత రెండు రోజులుగా భారత ఇంధన ఎక్స్ఛేంజీ (ఐఈఎక్స్‌) నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు కొనుగోలు చేయకుండా విధిం చిన నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది. విద్యుదుత్పత్తి సంస్థలకు తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన పాత బకాయిలు లేవని కేంద్రా నికి సమాచారం అందడంతో  ఇంధన ఎక్స్ఛేంజీ విద్యుత్తు కొనుగోలుకు అనుమతులను పునరుద్దరించింది.

 విద్యుదుత్పత్తి సంస్థలకు తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన పాత బకాయిలు లేవని కేంద్రం వెల్లడించింది.   తొలుత తెలం గాణ డిస్కంలు రూ.1360 కోట్లు చెల్లించాలని పేర్కొంటూ విద్యుత్తు కొనుగోలు చేయకుండా అడ్డుకుంది. ఆ తరువాత ఈ బకాయిలు రూ.52.85 కోట్లుగా ఉన్నాయని పేర్కొంటూ నిషేధాన్ని కొనసాగించింది. చెల్లించిన మొత్తాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థల బకాయిలపై గందరగోళం నెలకొంది.

 శనివారం చెల్లించాల్సిన పాత బకాయిలు ఏమీ లేవని తెలిపింది. ఈ మేరకు ఐఈఎక్స్‌ నుంచి విద్యుత్తు కొనుగోలు చేయవచ్చని తెలంగాణతో పాటు కర్ణాటకకు అనుమతి ఇచ్చింది. దీంతో శనివారం తెలంగాణ డిస్కంలు ఐఈఎక్స్‌ నుంచి 10 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును కొనుగోలు చేసింది. మరోవైపు తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి డిమాండ్‌ శనివారం 11,524 మెగావాట్లకు తగ్గింది. కేంద్రం నిషేధంతో పాటు విద్యుత్తు లోటుతో రెండు రోజులు ఇబ్బందులు వస్తాయని భావించినా, డిమాండ్‌ తగ్గడంతో పాటు కేంద్రం అనుమతించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

విద్యుత్‌ ఎక్స్ఛేంజీలలో కొనుగోలు, విక్రయాలకు సంబంధించి తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ.. రాష్ట్ర ట్రాన్స్‌కో, జెన్ కో సీఎండీ ప్రభాకరరావు మెయిల్‌ ద్వారా విద్యు త్‌ ఎక్స్ఛేంజీకి లేఖ రాశారు. తెలంగాణలో ఇటీవ‌ల‌ గరిష్ఠ విద్యుత్‌ డిమాండు 12,114 మెగావాట్లు నమోదైంది. గత ఏడాది 2021 ఆగస్టు 18న ఈ డిమాండ్ 8,500 మెగావాట్లు మాత్రమే   ఉంది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు పెద్దగా లేక పోవడం, ఉష్ణోగ్ర తలు పెరగడం, ఇళ్లకు, వ్యవసాయానికి వినియోగం పెరగడంతో డిమాండు ఎక్కు వైంది.

 ప్రస్తుతం కృష్ణానదిలో భారీ వ‌ర‌ద‌ల కార‌ణంగా,  పూర్తిస్థాయిలో జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. దీనివల్ల ఎక్స్ఛేంజీల్లో కొనుగోలు తక్కువగా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం గరిష్ఠ డిమాండు సమయంలో డిస్కంలు 2 వేల మెగావాట్ల దాకా ఎక్స్ఛేంజీలో కొంటున్నాయి. శుక్రవారం నుంచి నిషేధం విధించినందున ఈ మేర వ్యవసాయానికి త్రీఫేజ్‌ సరఫరా తగ్గించాలని డిస్కంలు యోచిస్తున్నాయి. సమ స్య పరిష్కారమైతే ఎలాంటి కోతలు ఉండవని అధికారులు చెబుతున్నారు.  కేంద్ర ఇంధన శాఖ 2022 జూన్‌ నుంచి చెల్లింపుల్లో జాప్యానికి సర్‌ఛార్జి నిబంధనలను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం విద్యుదుత్పత్తి సంస్థలకు బిల్లులను నిర్దేశిత వ్యవధిలో చెల్లించాలి. తెలంగాణ రూ.1,600 కోట్లు, ఏపీ రూ.350 కోట్లు బకాయిలున్నాయంటూ.. విద్యుత్‌ ఎక్స్ఛేంజీల్లో లావాదేవీలపై కేంద్రం నిషేధం విధించిన సంగతి విదితమే.

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.