సీఈసీ సీక్రెట్ విజిట్.. ఎందుకీ రహస్యం?

Publish Date:Jul 2, 2022

Advertisement

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ కుమార్, రెండు రోజులుగా హైదరాబాద్’లో ఉన్నారు. మరో రోజు కూడా ఉంటారు. కేంద్ర ఎన్నికల సంఘం వర్గాల సమాచారం మేరకు, ఆయన శుక్రవారం (జులై 1) హైదరాబాద్ వచ్చారు. జూలై 3 వ తేదీ (ఆదివారం)వరకు  హైదరాబాద్’లోనే ఉంటారు. సీఈసీ హైదరబాద్ రావడం విశేషం కాదు, కానీ, వచ్చిన సమయ సందర్భాల విషయంలో, అదే విధంగా సీఈసీ పర్యటన గురించి, రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి మీడియాకు అంతగా సమాచారం లేక పోవడం విషయంలో రాజకీయ పరిశీలకులు అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. 

సహజంగా సీఈసీ లేదా కేంద్ర ఎన్నికల సంఘం  సీనియర్ అధికాలు రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం, మీడియాకు సమాచారం అందిస్తుంది. అయితే, ప్రస్తుత పర్యటనకు సంబందించి, సరైన సమాచారం లేదని, ఏంపిక చేసిన మీడియా సంస్థలకు మాత్రమే సమాచారం, అది  కూడా  అరకొరగా మాత్రమే అందించారని అంటున్నారు. అందుకే, ఎందుకీ, గోప్యత అంటూ ఇటు మీడియా వర్గాలు, అటు రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు.

అలాగే, మీడియాకు అందుబాటులో  లేకుండా సీఈసీ గోల్కొండ రిసార్ట్ లో బస చేయడం గురించి కూడా అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.  అలాగని సీఈసీ పర్యటనకు ప్రాధాన్యత లేదా అంటే లేక పోలేదు, ఆయన రెండు రోజుల పర్యటనలో భాగంగా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ (ఈవీఎం) తయారుచేసే ఈసీఐఎల్ ను సందర్శిస్తున్నారు.  ఈవీఎంలకు సంబందించిన వివిధ అంశాలపై అధికారాలతో చర్చలు జరుపుతున్నారు, అదే విధంగా తెలంగాణ రాష్ట్ర  ఎన్నికల సంఘం ప్రధాన అధికారి  వికాస్ రాజ్, ఇతర అధికారులతో, ఎన్నికలకు సంబందించిన వివిధ అంశాలపై చర్చిస్తున్నారు.

నిజానికి ఈవీఎంల విషయంలో  రాజకీయ పార్టీలకు ఎప్పటినుంచో అనుమనాలు న్నాయి. కాంగ్రెస్ సహా కొన్ని ప్రధాన పార్టీల నుంచి మళ్ళీ బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ వినవస్తోంది. మరో వంక రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల గురించిన ఉహాగానాలు  వినవస్తున్నాయి. ఈ నేపధ్యంలో, సీఈసీ  రాష్ట్ర పర్యటనకు చాల ప్రాధన్యత ఉందని పరిశీలకులు అంటున్నారు. అయితే, సీఈసీ గుట్టు చప్పుడు కాకుండా, ఎందుకు వచ్చారు? ఏమి  చేశారు? అనే విషయంలో అధికారిక సమాచారం లేక పోవడంతో అనుమానాలు బలపడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సీఈసీ పర్యటను రాష్ట్ర  ఎన్నికల సంఘం ఎందుకు గోప్యంగా ఉంచింది అనే విషయంలో రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు.

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.