చంద్రబాబు విజన్.. జితేంద్ర శర్మ ఆవిష్కరణ.. మెడ్‌టెక్ జోన్ సృష్టి
Publish Date:Jul 18, 2024
Advertisement
చిన్న ప్రయత్నం నేడు చరిత్ర సృష్టించింది. కొవిడ్ సమయంలో దేశానికి వెన్నుదన్నుగా నిలిచింది. వైద్య పరికరాల ఉత్పత్తిలో ప్రంపచానికే దిక్సూచిలా మారేందుకు అడుగులు వేస్తోంది. అదే విశాఖపట్టణంలోని మెడ్‌టెక్ జోన్. విశాఖలో పురుడు పోసుకున్న ఈ మెడ్‌టెక్ జోన్.. ప్రారంభమైన కొద్దిరోజుల నుంచే అనేక కష్టాలను చవిచూస్తూ వచ్చింది. జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న ఐదేళ్లూ పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. కానీ, పట్టుదల, కృషితో మెట్‌టెక్ జోన్‌ను దినదినాభివృద్ధి చేస్తూ ప్రపంచం మొత్తం తమవైపు చూసేలా చేయగలిగారు మెడ్‌టెక్ జోన్ సీఈఓ జితేందర్ శర్మ. సీఎం చంద్రబాబు నాయుడు ఏరికోరి తెచ్చుకున్న వ్యక్తే జితేందర్ శర్మ. 2014లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత విశాఖలో మెడ్‌టెక్ జోన్ ఏర్పాటుకు జితేంద్ర శర్మకు అన్నివిధాల అండగా నిలిచారు. రాష్ట్రం అభివృద్ధికోసం చంద్రబాబు దూరదృష్టి.. ప్రపంచ స్థాయిలో వైద్య పరికరాలు ఉత్పత్తి చేయాలన్న జితేంద్ర శర్మ పట్టుదల.. వెరసి నేడు ప్రపంచ వైద్య రంగంలో దేశానికే గర్వకారణంగా మెడ్‌టెన్ జోన్ మారుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద వైద్య పరికరాల తయారీ క్లస్టర్లు కేంద్రంగా ఉన్న ఈ మెడ్‌టెక్ జోన్‌లో ప్రస్తుతం 145కిపైగా కంపెనీలతోపాటు పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. అతేకాదు.. రూ.30వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా మెడ్‌టెక్ జోన్ పరుగులు తీస్తోంది. మెడ్‌టెక్ జోన్ కోసం విశాఖలో దాదాపు 270 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. 2016 జూన్ 7న మెడ్‌టెక్ జోన్ తొలి ఎండీ, సీఈవోగా జితేందర్ శర్మను చంద్రబాబు నియమించారు. 2018 జనవరిలో కనస్ట్రక్షన్ ప్రారంభమైంది. అదే ఏడాది డిసెంబర్ నెలలో మెడ్‌టెక్ జోన్ ను ప్రారంభించారు. ఈ మెడ్‌టెక్ జోన్ విశాఖలోనే ఏర్పాటు చేయడానికి కూడా ఓ కారణం ఉంది. మెడ్‌టెక్ జోన్ లో తయారయ్యే వైద్య పరికరాల రవాణాకు పోర్ట్ అందుబాటులో ఉండాలి. దేశంలో గుజరాత్, ముంబై, కోల్‌కతా, వైజాగ్ తోపాటు పలు రాష్ట్రాల్లో పోర్టు సదుపాయం అందుబాటులో ఉంది. అయితే, చంద్రబాబు నాయుడు చొరవతో మెడ్‌టెక్ జోన్‌ను విశాఖలోనే ఏర్పాటు చేశారు. మెడ్‌టెక్ జోన్ కార్యకలాపాలు ప్రారంభమైన కొద్దిరోజులకే 2019లో చంద్రబాబు ప్రభుత్వం అధికారం కోల్పోయింది. సీఎంగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడే జోన్‌ను అభివృద్ధి చేయాల్సిన జగన్, రాజకీయ కారణాలతో మెడ్‌టెక్ జోన్ ను నిర్వీర్యం చేశారు. దాదాపు 270 ఎకరాల స్థలంలో రూ. 30వేల కోట్ల పెట్టుబడులు, 25వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన లక్ష్యంతో ప్రారంభమైన మెడ్ టెక్ జోన్ ప్రాజెక్ట్ జగన్ అనాలోచిత నిర్ణయాల కారణంగా అనుకున్న స్థాయిలో ఫలితాలను రాబట్టలేక పోయింది. మెడ్‌టెక్ జోన్ అభివృద్ధిలో కీలకమైన బోర్డు సరిగా వ్యవహరించకపోవడంతో ప్రాజెక్టు నిర్వీర్యమైంది. బోర్డులో ఉన్న అధికారులను చూసి పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. పలు కారణాలతో 2019 సెప్టెంబర్ లో మెడ్‌టెక్ ఎండీ, సీఈఓ బాధ్యతల నుంచి జితేందర్ శర్మను తొలగించారు. కొద్దికాలం తరువాత ఆయనను మళ్లీ నియమించినప్పటికీ.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోవటంతో జితేంద్ర శర్మ ఆశయానికి కొంత విఘాతం ఏర్పడింది. దీనికి తోడు పెట్టుబడు పెట్టేందుకు ముందుకొచ్చిన వారినికూడా వైసీపీ హయాంలో తరిమేసిన పరిస్థితి. ఓ మెడికల్ కంపెనీ మెడ్‌టెక్ జోన్‌లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. సదరు కంపెనీ మౌలిక సదుపాయాలు సిద్ధం చేసుకొని, సిబ్బందిని నియమించుకుంది. ఉత్పత్తిని ప్రారంభించే సమయంలో సమస్యలు ఎదురయ్యాయి. మెడ్‌టెక్ జోన్ లో వైసీపీ ప్రభుత్వం నియమించిన ఓ వ్యక్తి రూ.15కోట్లు పెట్టుబడి పెట్టిన కంపెనీకి రూ. 33 కోట్లు ఫెనాల్టీ విధించారు. ఇదేమని ప్రశ్నిస్తే.. ఉంటే ఉండండి, లేదంటే వెళ్లిపోండి అంటూ బెదిరింపులకు దిగారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు వ్యక్తుల వ్యవహారశైలి కారణంగా పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ఆసక్తి చూపలేదు. అయినా, పట్టవదలని విక్రమార్కుడిలా జితేంద్ర శర్మ తన ప్రయత్నాన్ని ముందుకు కొనసాగిస్తూ వెళ్లారు. కొవిడ్ సమయంలో మెడ్‌టెక్ జోన్‌లో తయారైన వైద్య పరికరాలను దేశంలోని 20కిపైగా రాష్ట్రాలు వినియోగించగా.. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం వాటిని కొనుగోలు చేయలేదు. ప్రభుత్వ సహకారం లేకపోయినా మెడ్‌టెక్ జోన్ లో ప్రపంచ దేశాల్లోని మెడికల్ ఉత్పత్తుల తయారీ కంపెనీల ఏర్పాటుకు జితేంద్ర శర్మ ఎనలేని కృషి చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం, చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో జితేంద్ర శర్మ ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వ అండదండలు పుష్కలంగా ఉండటంతో ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు మెడ్‌టెక్ జోన్ లో పెట్టుబడులు పెట్టేలా కృషిచేస్తున్నారు. ఇటీవల మెడిజోన్‌లో తయారైన వైద్య పరికరాల ప్రదర్శనను సీఎం చంద్రబాబు తిలకించారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు, జితేంద్ర శర్మలు మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. మెడ్‌టెక్ జోన్ అభివృద్ధిలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయని జితేంద్ర శర్మ గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తులు ఎంతో దైర్యమిస్తారు. మాకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ లా అండగా ఉంటారు. మీరుంటే ఎన్నో కొత్త ఆవిష్కరణలతో సమాజం బాగుంటుంది అంటూ చంద్రబాబు అందించిన ప్రోత్సాహాన్ని జితేంద్ర శర్మ కొనియాడారు. చంద్రబాబు సైతం.. జితేంద్ర శర్మ పట్టుదలను కొనియాడారు. నేడు మెడ్‌టెక్ జోన్ ఈ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం జితేంద్ర శర్మ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రస్తుతం జితేందర్ శర్మ గోల్ ఒక్కటే. మెడికల్ టెక్నాలజీ అంటే ఇండియా పేరు వినిపించాలి. మెడ్‌టెక్ జోన్ కేంద్రంగా తయారైన పరికరాలు ప్రపంచ దేశాలకు రవాణా అవ్వాలన్న పట్టుదలతో జితేంద్ర శర్మ తన పనిలో వేగాన్ని పెంచారు.
మెడ్‌టెక్ జోన్ ఏర్పాటు వెనుక పెద్ద కథే ఉంది. 2014లో ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 2015లో ఓ ఆడిట్ కు జితేందర్ శర్మ, మరికొందరు అధికారులు ఏపీకి వచ్చారు. ఆడిట్ నివేదిక సమర్పించే సమయంలో జితేంద్ర శర్మ తన ప్రత్యేకను చాటుకున్నారు. ఆడిట్ నివేదికలో జరిగిన తప్పులతో పాటు.. వాటి పరిష్కారానికి సూచనలు సైతం చేశారు. దీంతో శర్మ నివేదికను చూసి చంద్రబాబు ఇంప్రెస్ అయ్యారు. జితేంద్రశర్మ లాంటి వ్యక్తి సేవలు రాష్ట్రానికి అవసరమని భావించిన చంద్రబాబు.. ఫోన్ చేసి తమ రాష్ట్రంలో హెల్త్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టాలని కోరారు. అందుకు జితేంద్ర శర్మ తొలుత ఒప్పుకోలేదు. చంద్రబాబు చొరవ తీసుకొని.. వారానికి రెండు రోజులు రాష్ట్రంలో పనిచేయండని కోరారు. దీనికి ఆయన ఒప్పుకోవటంతో వైద్య ఆరోగ్యశాఖ సలహాదారుగా అప్పట్లో జితేంద్ర శర్మను చంద్రబాబు నియమించారు. అప్పటికే మెడ్‌టెక్ జోన్ ప్లాన్‌ను చంద్రబాబు దృష్టికి జితేందర్ శర్మ తీసుకెళ్లారు. ఆ తరువాత కాలంలో చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రక్రియ ప్రారంభమైంది.
http://www.teluguone.com/news/content/cbn-vision-and-sharma-innovation-meditech-25-180942.html





