సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన.. పరిహారం, పునరావాసంపై కీలక ప్రకటన?!

Publish Date:Mar 27, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం (మార్చి 27) పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లారు.  ఈ సందర్భంగా ఆయన పరిహారం, పునరావాసం, డయాఫ్రం వాల్ నిర్మాణ పనులపై కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయంటున్నారు. ముందుగా ఈ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.  అంతకు ముందు పోలవరం వ్యూపాయింట్ ను పరిశీలిస్తారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆయన పోలవరం ప్రాజెక్టు పరిశీలన చేసిన అనంతరం ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం పూర్తి చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు సర్కార్ ముందుకు సాగుతోంది.  తాజా సమీక్షలో   పనుల పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబు అధికారులకు మార్గనిర్దేశనం చేసే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలో తాగు, సాగునీటికి కొరత లేకుండా పోతుందని చంద్రబాబు చెబుతున్నారు.

2014 నుంచి 2019 వరకూ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ జీవనాడి వంటి పోలవరంపై ప్రత్యేక  దృష్టి పెట్టి పనులను పరుగులెత్తించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రతి సోమవారం ఆయన పోలవారంగా మార్చుకుని ప్రాజెక్టు సందర్శన చేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ పోలవరం పనులను నిలిపివేసింది. జగన్ హయంలో పోలవరం పడకేసింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం పోలవరం పరుగులు తీస్తున్నది. నిర్దుష్ట కాలపరిమితిలో పోలవరం పూర్తే లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ ముందుకు సాగుతోంది. అధికార పగ్గాలు అందుకున్న తరువాత చంద్రబాబు పోలవరం సందర్శించడం ఇది మూడో సారి. దీనిని బట్టే ఆయన పోలవరం పూర్తికి ఇస్తున్న ప్రాధాన్యత అవగతమౌతుంది. 

By
en-us Political News

  
కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరదించుతూ, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా పూర్తి మద్దతు ప్రకటించినట్లు ప్రచారం సాగుతోంది. 2023 మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తమిళనాడులో అన్నాడీఎంకేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు.
దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
పేటీఎం బ్యాచ్, రూ.5 బ్యాచ్.. ఇవి గత కొన్నేళ్లుగా ఉన్నా, ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న పదాల్లో కొన్ని. ఒక పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ట్రోల్స్ చేయడానికి డబ్బులు తీసుకునే వారిని, మరీ ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా వింగ్‌ను, టిడిపి, జనసేన శ్రేణులు పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ప్రతి పోస్టుకు ఐదు రూపాయలు ఇస్తారనే ప్రచారంతో ఐదు రూపాయల బ్యాచ్ అని కూడా అంటారు.
సీఎం, మంత్రుల హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ.. అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయినా, అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ రాహిత్యం కారణంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఇతర ప్రోటోకాల్ అధికారులు గానీ సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు.
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.