హస్తిన వేదికగా బిల్ గేట్స్ తో చంద్రబాబు భేటీ.. ఎందుకుంటే?

Publish Date:Mar 18, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతకు ఫిదా అయిన పారిశ్రామిక వేత్తలలో బిల్ గేట్స్ ఒకరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొలి సారిగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా బిల్ గేట్స్ తో చంద్రబాబు అనుబంధం కొనసాగుతూనే ఉంది. తొలి సారి బిల్ గేట్స్ తో భేటీకి చంద్రబాబు అప్పాయింట్ మెంట్ కోరినప్పుడు గేట్స్ అయిష్టంగానే అంగీకారం తెలిపారు. అయితే ఆ తొలి భేటీలోనే చంద్రబాబు విజనరీ బిల్ గేట్స్ ను ఆకట్టుకుంది. ఈ విషయాన్ని స్వయంగా గేట్స్ పలు సందర్భాలలో చెప్పారు.

ఇటీవల విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తరువాత చంద్రబాబు బిల్ గేట్స్ తో దావోస్ లో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్  కీలక రంగాలలో సహకారం అందించేందుకు అంగీకారం కుదిరింది. ఆ సందర్భంగా చంద్రబాబు పట్ల తనకు ఉన్న అభిమానాన్నిబిల్ గేట్స్ ఒక అపురూప బహుమతితో చాటారు. ఔను బిల్ గేట్స్ చంద్రబాబుకు  తాను కాలేజీని వీడిన తరువాత మైక్రోసాఫ్ట్ కంపెనీని ఫ్లోట్ చేయడం నుంచి, తన జర్నీకి సంబంధించిన అనుభవాలు, విశేషాలతో కూడిన సోర్స్ కోడ్ బుక్ ను చంద్రబాబుకు బహుమతిగా ఇచ్చారు.  బిల్ గేట్స్ ఇచ్చిన ఆ ఆపరూప కానుక నవ్యాంధ్ర పురోగతికి తాను చేసే కృషికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చంద్రబాబు ఆ సందర్భంగా చెప్పారు. అటువంటి అనుబంధం ఉన్న గేట్స్, చంద్రబాబు మరోసారి భేటీ కానున్నారు. ఈ భేటీకి ఢిల్లీ వేదిక కానుంది. 

చంద్రబాబు మంగళవారం (మార్చి 18) సాయంత్రం హస్తిన పర్యటనకు బయలుదేరుతున్నారు. ఈ పుర్యటనలో భాగంగా  చంద్రబాబు కేంద్ర మంత్రి, మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబంలో జరిగే ఓ వివాహ వేడుకకు హాజరౌతారు. ఆ తరువాత కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. అదే విధంగా ప్రధాని మోడీని కలిసి అమరావతి పనుల పున: ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. అలాగే బుధవారం (మార్చి 19) మధ్యాహ్నం బిల్ గేట్స్ తో సమావేశమౌతారు.

ఈ సమావేశంలో  విద్య, వైద్యం, ఆరోగ్య రంగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య సహకార ఒప్పందం చేసుకుంటారు. ఈ కీలక రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ ఏపీ సర్కార్ కు సహకారం అందించే విషయంపై దావోస్ లో భేటీలో అంగీకారం కుదిరిన సంగతి తెలిసిందే.  అనంతరం అదే రోజు సాయంత్రం సీఎం చంద్రబాబు హస్తిన నుంచి అమరావతికి తిరిగి వస్తారు. ఆ మరునాడు  అంటే గురువారం (మార్చి20) అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం అదే రోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెడతారు. శుక్రవారం (మార్చి 21) తిరుమలేశుని దర్శించుకుంటారు.  

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.