ఆంధ్రా ఫస్ట్.. చంద్రబాబు బెస్ట్!

Publish Date:Oct 28, 2025

Advertisement

నాలుగు దశాబ్దాలకు పైబడిన ప్రజా జీవితంలో  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నో మైలు రాళ్లను అధిగమించారు. ఎన్నెన్నో విజయాలను సాధించారు. రాజకీయ నేపథ్యం లేకుండా ఒక సాధారణ కుటుంబం నుంచి ఆయన రాజకీయాలలోకి ప్రవేశించి అనితర సాధ్యమనదగ్గ విజయాలను అందుకున్నారు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా సుదీర్ఘకాలం ఉన్నారు. అటువంటి చంద్రబాబునాయుడిని రాజకీయ వైరంతో విమర్శలు చేసే వారు ఉంటే ఉండొచ్చు కానీ, దార్శనికత, పాలనా దక్షతకు సంబంధించి ఆయనను వేలెత్తి చూపేవారెవరూ దాదాపు ఉండరనే చెప్పాలి.

ఎప్పుడో.. దాదాపు మూడు దశాబ్దాలకు పూర్వమే..  కొండలు గుట్టల నడుమ చంద్రబాబు నాయుడు  ముందు చూపుతో  నాటిన ఐటీ విత్తనం, మహావృక్షమై ఇప్పుడు సైబరాబాద్ గా కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఆ నాడు చంద్రబాబు విజన్  యువత  భవితకు బంగరు బాటలు పరిచింది. ఈ విషయాన్ని ఎవరూ కాదనరు.. కాదనలేరు.  నిజానికి ఐటీ అంటే అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పడూ కూడా చంద్రబాబే గుర్తుకు వస్తారు.  చంద్రబాబు నాయుడు కృషి, పట్టుదల వల్లనే మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలు హైదరాబాద్ నగరానికి వచ్చాయి. చంద్రబాబు ముందు చూపు వల్లనే  ఐఎస్‌బీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్ వచ్చాయి.

రాజకీయ విభేదాలతో ఆయన ఘనతను పొలిటీషియన్లు బాహాటంగా అంగీకరించకపోవచ్చు.. కానీ మేధావులు, రాజకీయాలతో సంబంధం లేని అధికారులు, అందులోనూ కేంద్రంలో ఉన్నత స్థాయిలో  వివిధ విభాగాలకు అధిపతులుగా పని చేసిన వారూ మాత్రం చంద్రబాబు దార్శనికతకు ఫిదా అవ్వడమే కాదు.. పదవీ విరమణ తరువాత వారి ఆత్మకథలలో చంద్రబాబు విశిష్ఠతను, ఆయన ఔన్నత్యాన్ని గొప్పగా ప్రస్తావించారు. ప్రస్తావిస్తున్నారు.  అలాంటి వారిలో నీతీ ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్‌.  కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్య‌ద‌ర్శి సుభాష్ చంద్ర‌గార్గ్‌ లు కూడా ఉన్నారు. వీరిద్దరూ కూడా రాజకీయాలతో ఇసుమంతైనా సంబంధం లేని వారే. పైగా వారు చంద్రబాబును ప్రస్తుతిస్తూ, ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వారి వ్యక్తిగత అభిప్రాయాలే తప్ప.. ఎవరి ఒత్తడి, ప్రోద్బలంతో చేశారని అనుకునేందుకు అవకాశమే లేదు.  

 ముందుగా నీతి ఆయోగ్ మాజీ  సీఈవో అమితాబ్ కాంత్ విషయానికి వస్తే.. ఇటీవల ఆయన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో విశాఖ‌కు గూగుల్‌ డేటా కేంద్రం రావ‌డంపై స్పందించారు.  విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడం అన్నది మామూలు వ్యక్తులు, సీఎంల వల్ల సాధ్యమయ్యే పని కాదనీ,  చంద్రబాబు వంటి విజనరీ వల్ల మాత్రమే సాధ్యమౌతుందని ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు. ఆయన దూరదృష్టి విశాఖపట్నాన్ని మాత్రమే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ను, ఇండియాను కూడా ప్రపంచానికి మేటిగా నిలబెడతాయని పేర్కొన్నారు.  

ఇది కూడా చదవండి

అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్య‌ద‌ర్శి సుభాష్ చంద్ర‌గార్గ్‌ గార్గ్ కూడా చంద్రబాబు ఆంధ్రాఫస్ట్ విధానాన్ని ఒకింత క్రిటికల్ గా ప్రశంసించారు. చంద్రబాబు స్వార్థపరుడు అంటూనే.. ఆయన స్వార్థం వ్యక్తిగతమైనది కాదనీ, ఏపీని అత్యున్నతంగా నిలబట్టాలన్నదే ఆయన స్వార్థమని పేర్కొన్నారు. చంద్రబాబు   విజ‌న్‌.. ప్రణాళిక‌లు అనితర సాధ్యమంటూ ఆయన తన బయోగ్రఫిలో పేర్కొన్నారు. గ‌తం లో వాజ‌పేయిని ఒప్పించి ఉమ్మ‌డి రాష్ట్రానికి స్వ‌ర్ణ చ‌తుర్భుజి జాతీయ ర‌హ‌దారులు తెచ్చుకోవడాన్నీ, ఇప్పుడు ప్రధాని మోడీని మెప్పించి.. పలు ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కు వచ్చేలా చేసుకుంటున్నారనీ వివరించారు.  నిజమే చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలు, స్వార్థ రాజకీయాలు కాదు.. ఆంధ్రఫస్ట్ అన్నదే నినాదం. అందుకే చంద్రబాబు   అవకాశం వచ్చిన ఏ సందర్భంలోనూ ఆయన  స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాకులాడలేదు.  రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం మాత్రమే పాటుపడుతున్నారు. అవకాసం ఉన్న అన్ని విధాలుగానూ కేంద్ర నిధుల కోసం  వెంట పడుతున్నారు.   కేంద్రం ఒకదాని వెంట ఒకటిగా రాష్ట్రానికి  ప్రాజెక్టుల్ని ప్రటికటించేలా తన పరపతిని ఉపయోగిస్తున్నారు. 

By
en-us Political News

  
సాయికృష్ణ మిస్సింగ్ కేసును రాజకీయం చేయాలని వైసీపీ చూస్తోందనీ., కానీ ఈ కేసులో నిందితుడైన సీఐ నాగరాజు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడేనని గుర్తుచేశారు. తప్పు చేసిన వాడు ఏ కులానికి చెందినవాడైనా తప్పేనని, దానికి కులాన్ని అంటగట్టడం సరికాదని హితవు పలికారు.
ఆ అమ్మాయి నోట జగన్ సార్ అనే మాట రాగానే.. అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనంటూ వైఎసీపీ సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడింది వైఎస్ జగనేనంటూ ఫోటోలు మార్ఫింగ్ చేసి నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ క్రెడిట్ చోరీపై కిరాక్ ఆర్పీ సాక్ష్యాలను చూపిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
బాధిత తల్లితో సిఐ నాగరాజు మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఆయన ప్రదర్శించిన దురుసు ప్రవర్తన ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమై ప్రపంచమంతటా సంచలనం సృష్టించాయన్నారు.
ఈ శిలాఫలకంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేరు ఎక్కడా కనిపించలేదు. ఈ వింత పరిస్థితిని గమనించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంతో ఉత్సాహంగా కార్యక్రమానికి వచ్చిన ఆయన, ఆ శిలాఫలకంపై తన పేరు లేకపోవడంతో నిరాశకు లోనయ్యారు.
కాంగ్రెస్ నేతల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి..
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎప్పుడూ ఊహించని మలుపులు చోటుచేసుకుంటూనే ఉంటాయి
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు నేతృత్వంలో జరిగిన వైసీపీ కాపు సామాజిక వర్గాల నాయకుల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత పవన్ టోన్ పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తాను కేవలం 21 సీట్లు గెలిచిన ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మాత్రమే కాకుండా.. కేంద్రంలోని పెద్దల అండదండలు ఉన్న సుపీరియర్ పొజిషన్‌లో ఉన్నాననే సంకేతాన్ని పవన్ పంపించారన్నారు.
కూటమి ప్రభుత్వంలో పరిపాలనా లోపాలు, రాజకీయ సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా లభించిన 80 శాతం ప్రజా సంతృప్తి కేవలం కాగితాలకే పరిమితమైందనీ.. డిజిటల్ కనెక్టివిటీ పెరిగి భౌతిక సంబంధాలు దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తమ సర్వేలో తేలిందని చెప్పారు.
ఎన్నికల బరిలో కేసీఆర్, బీఆర్ఎస్ కూటమిని ఢీకొట్టడం ఎవరికైనా పెద్ద సవాలే. గతంలో కేసీఆర్ వాడే ఘాటైన రాజకీయ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలపై ఆయనకు మాత్రమే పేటెంట్ హక్కు ఉందనే భావన ఉండేది. కానీ రేవంత్ రెడ్డి రాకతో.. ఆ ముద్రను పూర్తిగా చెరిపివేశారు. కేసీఆర్, కేటీఆర్ ల కంటే మరింత దూకుడుగా, ఘాటుగా రేవంత్ ప్రజల్లోకి వెళ్లారు.
కేంద్ర ప్రభుత్వం పాలసీలు లేదా ప్రాజెక్టులను ఏ ఒక్కరి కోసమో కాకుండా దేశ ప్రజలందరి కోసమే ప్రవేశపెడుతుందని బదులిచ్చారు. అయితే.. ఆ ప్రాజెక్టులను అందుకోవడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా, సానుకూలంగా స్పందిస్తుందనే దానిపైనే వాటి రాక ఆధారపడి ఉంటుందని చెప్పారు.
చంద్రబాబు నాయుడు కుమారుడిగా, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేతగా మాత్రమే గుర్తింపు ఉన్న యువకుడు నారా లోకేష్. అదే నారా లోకేష్ ఇప్పుడు ప్రజా క్షేత్రంలో తిరుగులేని నాయకుడిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు.
ఈ చర్చోపచర్చలు, ఊహాగాన సభలపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ప్రెస్ అడ్డా వేదికగా క్లారిటీ ఇచ్చారు. దేశానికి నరేంద్ర మోదీ రూపంలో ఒక బలమైన ప్రధానమంత్రి ఉన్నారన్న లోకేష్.. చంద్రబాబు ప్రధాని అన్న చర్చకు, వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.